ఆ రెండింటికి ఝలక్‌ : జియో ప్లాన్స్‌ అప్‌గ్రేడ్‌ | Jio revises Rs. 509, Rs. 799 plans to offer more data to take on Airtel and Vodafone | Sakshi
Sakshi News home page

ఆ రెండింటికి ఝలక్‌ : జియో ప్లాన్స్‌ అప్‌గ్రేడ్‌

Published Tue, Jan 9 2018 4:33 PM | Last Updated on Tue, Jan 9 2018 8:15 PM

Jio revises Rs. 509, Rs. 799 plans to offer more data to take on Airtel and Vodafone - Sakshi

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లకు షాకిస్తూ.. రిలయన్స్‌ జియో తన ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేసింది. రూ.509, రూ.799 ప్రీపెయిడ్‌ ప్లాన్లను సమీక్షిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ తమ ఎంపిక చేసిన ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేసిన తర్వాత జియో కూడా తన ప్లాన్లను సమీక్షించింది. సమీక్షించిన ఈ ప్లాన్లను జియో ఎక్కువ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. కొత్త రూ.509 ప్లాన్‌పై రోజుకు 3జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది. అంటే మొత్తంగా 84జీబీ డేటాను ఆఫర్‌ చేయబోతుంది. అంతకముందు ఈ ప్యాక్‌పై రోజుకు 2జీబీ డేటాను, 49 రోజుల పాటు అందించింది.

అదేవిధంగా రూ.799 ప్లాన్‌పై రోజుకు 5జీబీ 4జీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో మొత్తంగా యూజర్లకు 140జీబీ లభ్యం కానుంది. అంతకముందు ఈ ప్యాక్‌పై రోజుకు 3జీబీ డేటాను జియో ఆఫర్‌ చేసింది. గురువారం జియో తన ప్రీపెయిడ్‌ ప్యాక్‌లపై ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించిన అనంతరం, ఎయిర్‌టెల్‌ తన ప్లాన్లను సమీక్షించింది. వొడాఫోన్‌ కూడా రూ.456 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ఇవి ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేయడంతో, జియో కూడా మరోసారి తన ప్లాన్లను సమీక్షించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement