వారి వల్ల రూ. 400కోట్ల నష్టం- జియో | Reliance Jio alleges Airtel, Vodafone, Idea Cellular caused Rs 400-cr loss to govt | Sakshi
Sakshi News home page

వారి వల్ల రూ. 400కోట్ల నష్టం- జియో

Published Tue, May 23 2017 11:23 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

వారి వల్ల రూ. 400కోట్ల నష్టం- జియో

వారి వల్ల రూ. 400కోట్ల నష్టం- జియో

న్యూఢిల్లీ:  రిలయన్స్‌ జియో  తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీలపై మరోసారి దాడికి  దిగింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలపై తీవ్ర ఆరోపణలతో డిపార్టమెంట్‌మెంట్‌ ఆఫ్‌  టెలికమ్యూనికేషన్స్‌ గడప తొక్కింది.   వీటి కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని ఆరోపిస్తూ  డాట్‌కు  ఫిర్యాదు  చేసింది.  ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఐడియా మార్చిలో అవసరమైన లైసెన్స్ ఫీజును జమ చేయలేదంటూ  జియో  టెలికాం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. గత త్రైమాసికంలో ముందస్తు లైసెన్స్ ఫీజు  తక్కువ చెల్లింపు  కారణంగా  ప్రభుత్వానికి రూ .400 కోట్ల నష్టం వచ్చిందని పేర్కింది.  దీనిపై డాట్‌  సంబంధిత చర్యలు తీసుకోవాల్సిందిగా   జియో కోరింది.

లైసెన్సులను ఏకపక్షంగా నిర్ణయించడం,  తక్కువ లైసెన్స్ ఫీజులను అనుమతించడం  లాంటి చర్యలు నిబంధనల ఉల్లంఘనగా ఉందని తన లేఖలో పేర్కొంది. లైసెన్సు ఉల్లంఘన (టెలికాం సర్వీసు ప్రొవైడర్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని,  ఫైనాన్షియల్ పెనాల్టీలు, లేదా లైసెన్స్‌ రద్దు  లేదా లైసెన్స​ నిలిపివేయడం చేయాలని కోరింది.  ఆర్థిక జరిమానాగా రూ.50 కోట్ల జరిమానా విధించాలని డిమాండ్‌ చేస్తోంది.  లైసెన్స్‌ ఫీజు చెల్లించడంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లైసెన్సు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాయంటూ ముకేష్ అంబానీ  నేతృత‍్వంలోని జియో పిటిషన్‌ దాఖలు చేసింది.  2016-17 నాటికి  అంచనా వేసిన స్థూల రాబడి ఆధారంగా చెల్లించిన ఫీజు,  లైసెన్స్ నిబంధనలకు చెల్లించాల్సిన లైసెన్స్  ఫీజు కంటే తక్కువగా ఉందని పేర్కొంది
ఫిర్యాదు ప్రకారం, ఎయిర్టెల్ జనవరి-మార్చి 2017 నాటికి రూ. 950 కోట్ల లైసెన్స్ ఫీజుగా చెల్లించింది. అక్టోబర్-డిసెంబరు 2017 వరకు ఎయిర్టెల్ చెల్లించిన 1,099.5 కోట్ల లైసెన్స్ ఫీజుతో పోలిస్తే ఇది రూ. 150 కోట్ల తక్కువ. అదేవిధంగా, వోడాఫోన్ రూ. 550 కోట్లు చెల్లించింది, ఇది మూడవ త్రైమాసికంలో చెల్లించిన రూ. 746.8 కోట్ల లైసెన్స్ ఫీజుతో పోలిస్తే రూ. 200 కోట్లు  తక్కువ . అలాగే మూడవ  త్రైమాసికంలో  చెల్లించిన రూ.609  కోట్లతో పోలిస్తే  ఐడియాఈ క్వార్టర్‌లో రూ.60కోట్లు తక్కువ చెల్లించింది.  

కాగా  నిబంధనల ప్రకారం, టెలికం ఆపరేటర్ ఆశించిన ఆదాయాల ఆధారంగా జనవరి-మార్చి కాలానికి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, కానీ అదే ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో చెల్లించిన రుసుము కన్నా తక్కువగా ఉండకూడదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement