ప్రముఖ టెల్కోలకు ట్రాయ్ ఆదేశాలు | Truce in sight? Trai summons Airtel, Vodafone and Idea to settle fight with Reliance Jio | Sakshi
Sakshi News home page

ప్రముఖ టెల్కోలకు ట్రాయ్ ఆదేశాలు

Published Thu, Sep 8 2016 4:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

Truce in sight? Trai summons Airtel, Vodafone and Idea to settle fight with Reliance Jio

జియో వార్  లోఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా  భారత టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్  ప్రధాన టెలికాం ఆపరేటర్లకు మొట్టికాయలేసింది.  చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా భారతి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లతో పాటు రిలయన్స్ ఇన్ఫో కాం  అధికారులను కోరింది. ఈ పోరుపై శుక్రవారం సమావేశంలో చర్చించాలని కోరింది. ఈ పోరుపై శుక్రవారం సమావేశంలో చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా భారతి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లతో పాటు రిలయన్స్ ఇన్ఫో కాం  అధికారులను కోరింది. 
మరోవైపు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో భాగమైన జీఎస్ఎం టెల్కోస్ లోని ఎయిర్ టెల్ ,ఐడియా, వోడాఫోన్ తో పాటు జియో కూడా ఇతర టెల్కోలను పిలిని మాట్లాడాల్సిందిగా ఒక లేఖ రాశాయి. వారు కూడా  ఈ అసోసియేషన్ లో భాగమని
జియో ఆఫర్లతో హోరెత్తించిన  ముకేష్ ప్రకటన నేపథ్యంలో  ప్రధాన ఆపరేట్లర్లయిన ఎయిర్ టెల్, ఐడియా,వోడాఫోన్ జియో  మధ్య వివాదం నిలకొంది. పరస్పర ఆరోపణలతో ఇరువర్గాలు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాంను ఆశ్రయించాయి. అయితే  ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన డాట్   టెలికాం రెగ్యులేటర్ వద్ద పరిష్కరించుకోవాల్సిందిగా తెలిపింది. దీంతో ట్రాయ్ ఈ ఆదేశాలిచ్చింది.  
మరోవైపు జియో కాల్ నెట్‌వర్క్ లో కస్టమర్లకు తలెత్తిన సమస్యను అతిత్వరలో తీరుస్తామని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ హామీ ఇచ్చారు. కొత్తగా ప్రవేశపెట్టిన జీయోతో అవతలి నెట్ వర్క్ కు కాల్స్ వెళ్లకపోవడంపై ఆయన స్పందించారు. రెండుమూడు వారాల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.  టెక్నికల్ (ట్రాఫిక్ భారం)గా ఏలాంటి సమస్యలున్నా కస్టమర్లకు మాత్రం ఏలోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమదేనని ముకేష్  మీడియాకు  చెప్పారు.
రూ.1.5లక్షకోట్ల భారీ వ్యయంతో ప్రారంభించిన అతిపెద్ద స్టార్టప్ జీయోనేనని తెలిపిన ముకేష్ దీనికి తనకు ఆరేళ్లు పట్టిందన్నారు. ...తాము రాత్రికి రాత్రి లాభాలు ఆశించడం లేదని స్పష్టం చేశారు.   సోదరుడు అంబానీ రియలన్స్ కమ్యూనికేషన్స్ తో ప్రస్తుతం తమకు ఎలాంటి   విభేదాలు లేవని, ఇబ్బందలు ఉండవని,  వ్యక్తిగతంగా తమ మధ్య అనుబంధం బలంగా ఉందని  తెలిపారు. అయితే వ్యాపారంలో ఎవరి వ్యూహాలు వారివేనని తెలిపారు.

కాగా జియో ఆఫర్ల సంచలనంతో అనేక అనుమానాలు  వినియోగదారులను వెంటాడుతుండగా,  జియో కమర్షియల్ లాంచింగ్ నాలుగు రోజుల ముందు ఈ సమావేశం జరగనుండటం విశేషం.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement