దిగ్గజాలను మరింత ఉడికిస్తూ జియో ట్వీట్ | Reliance Jio sends Valentines day wishes to Airtel, Vodafone and Idea on Twitter | Sakshi
Sakshi News home page

దిగ్గజాలను మరింత ఉడికిస్తూ జియో ట్వీట్

Published Tue, Feb 14 2017 1:09 PM | Last Updated on Mon, Feb 10 2020 3:26 PM

దిగ్గజాలను మరింత ఉడికిస్తూ జియో ట్వీట్ - Sakshi

దిగ్గజాలను మరింత ఉడికిస్తూ జియో ట్వీట్

న్యూఢిల్లీ : దేశీయ టెలికం మార్కెట్‌ను హోరెత్తించేస్తూ దిగ్గజ కంపెనీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న రిల‌య‌న్స్ జియో ఆ కంపెనీలను మరింత ఉడికిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా టెలికాం కంపెనీలన్నింటికీ శుభాకాంక్షలు పంపించింది. ''డియర్, ఎయిర్టెల్ ఇండియా, ఐడియా సెల్యులార్, వొడాఫోన్లకు హ్యాపీ వాలెంటైన్స్ డే విత్ లవ్ ఫ్రమ్ జియో'' అని తన అధికారిక ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపింది. 14 ఫిబ్రవరి ఉదయం 10 గంటలకు జియో ఈ ట్వీట్ చేసింది. అయితే జియో ప్రేమతో పంపిన ప్రేమ శుభాకాంక్షలకు ఏ టెలికాం కంపెనీ రిటర్న్ రిప్లే ఇవ్వలేదు.
 
ఈ ట్వీట్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీన్ని 'ట్వీట్ ఆఫ్ ది డే'గా పేర్కొంటున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర వరకు దీనికి 2వేల రీట్వీట్లు, లైక్స్ వచ్చాయి. జియో నేటి వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రమోషన్స్ అన్నింటికీ హ్యాష్ ట్యాగ్ గా #WithLoveFromJioను వాడుతోంది. రిలయన్స్ జియో వెల్కమ్ ఆఫర్ను పొడిగిస్తూ ఉచిత సేవా ఆఫర్లను మార్చి వరకు అందించడానికి హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ను ప్రకటించింది. అప్పటికే ఉచిత కాలింగ్, ఉచిత డేటా ఆఫర్లపై గుర్రుగా టెలికాం కంపెనీలు, ఆఫర్ల పొడిగింపుపై మరింత మండిపడుతున్నాయి. వారిని మరింత ఉడికిస్తూ జియో ఈ ట్వీట్ చేసింది.   
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement