గతంలో గ్రామాల్లో సంతలు జరిగేవి, అక్కడికి వెళ్లి మనకి నచ్చిన వస్తువుని కొనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుత రోజుల్లో అలాంటివి కనుమరుగైనా ఆ స్థానంలోకి ఆన్‌లైన్ షాపింగ్‌లు వచ్చాయి. అందులో ప్రధానంగా అమెజాన్ సంస్థ నిర్వహించే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఒకటి. తాజాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 జూలై 23, 24 తేదీల్లో జరగబోతోంది. అయితే ఇందులో అమెజాన్ ప్రైమ్ సభ్యులు మాత్రమే పాల్గొనాలి. వారికి అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ఉచితంగా డెలివరీ, కొన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్, ప్రైమ్ వీడియో యాక్సెస్ లాంటి బెనిఫిట్స్ బోలెడు ఉంటాయి.
ఇతరులు ఈ సేల్‌లో షాపింగ్ చేయాలంటే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తప్పక తీసుకోవాల్సిందే. అయితే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు ఆ సంస్థ మొబైల్ వినియోగదారులకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం మొబైల్‌ని రీచార్జ్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందేలా ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ని.. ఎయిర్‌టెల్, వోడాఫోన్, రిలయన్స్ జియో నెట్‌వర్క్ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. అయితే అందులో కొన్ని సెలక్టడ్ ప్లాన్‌లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని లింక్ చేశారు. ఈ రీచార్జ్‌లు చేసుకున్నవారికి నిబంధనల ప్రకారం ఉచిత సబ్‌స్క్రిప్షన్ వర్తిస్తుంది. అవేంటో చూద్దాం.
ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇవే:
Airtel Rs 359 postpaid plan: ఎయిర్‌టెల్ రూ.359 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే 28 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజుకు 2 జీబీ డేటీ వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ తరహాలోనే ఎయిర్‌టెల్ కస్టమర్లు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు .. 499, 699, 999, 1199, 1599.
Jio Rs 399 PostPaid Plan: జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 75జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు జియో ప్లాన్ జాబితా.. 599, 399, 1499, 799.
Vi Rs 999 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్నవారికి ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 220 డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు వొడాఫోన్ ప్లాన్ జాబితా..699, 1099, 499, 999, 1299,1699, 2299.
Comments
Please login to add a commentAdd a comment