Prime Membership
-
యూజర్లకు బంపరాఫర్: అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్.. ఫ్రీ,ఫ్రీ
గతంలో గ్రామాల్లో సంతలు జరిగేవి, అక్కడికి వెళ్లి మనకి నచ్చిన వస్తువుని కొనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుత రోజుల్లో అలాంటివి కనుమరుగైనా ఆ స్థానంలోకి ఆన్లైన్ షాపింగ్‌లు వచ్చాయి. అందులో ప్రధానంగా అమెజాన్ సంస్థ నిర్వహించే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఒకటి. తాజాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 జూలై 23, 24 తేదీల్లో జరగబోతోంది. అయితే ఇందులో అమెజాన్ ప్రైమ్ సభ్యులు మాత్రమే పాల్గొనాలి. వారికి అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ఉచితంగా డెలివరీ, కొన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్, ప్రైమ్ వీడియో యాక్సెస్ లాంటి బెనిఫిట్స్ బోలెడు ఉంటాయి. ఇతరులు ఈ సేల్‌లో షాపింగ్ చేయాలంటే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తప్పక తీసుకోవాల్సిందే. అయితే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొందేందుకు ఆ సంస్థ మొబైల్ వినియోగదారులకు ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం మొబైల్‌ని రీచార్జ్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందేలా ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ని.. ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్ జియో నెట్వర్క్ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. అయితే అందులో కొన్ని సెలక్టడ్ ప్లాన్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని లింక్ చేశారు. ఈ రీచార్జ్‌లు చేసుకున్నవారికి నిబంధనల ప్రకారం ఉచిత సబ్స్క్రిప్షన్ వర్తిస్తుంది. అవేంటో చూద్దాం. ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే: Airtel Rs 359 postpaid plan: ఎయిర్టెల్ రూ.359 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే 28 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజుకు 2 జీబీ డేటీ వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ తరహాలోనే ఎయిర్టెల్ కస్టమర్లు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందేందుకు .. 499, 699, 999, 1199, 1599. Jio Rs 399 PostPaid Plan: జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. 75జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందేందుకు జియో ప్లాన్ జాబితా.. 599, 399, 1499, 799. Vi Rs 999 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్నవారికి ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 220 డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఉచిత సబ్స్క్రిప్షన్ పొందేందుకు వొడాఫోన్ ప్లాన్ జాబితా..699, 1099, 499, 999, 1299,1699, 2299. -
జెఫ్ బెజోస్ కొంపముంచిన అంతరిక్ష యాత్ర...!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ రాకెట్ ద్వారా అంతరిక్షయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. రోదసి యాత్ర విజయవంతమైనందుకు గాను జెఫ్ బెజోస్ అమెజాన్ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్క్షతలను తెలిపారు. కాగా రోదసీయాత్ర పూర్తి చేసుకున్న జెఫ్బెజోస్పై కొంత మంది మండిపడుతున్నారు. జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్రను పన్నులు కట్టకుండా డబ్బులను సంపాదించారని సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొంపముంచుతుంది. తాజాగా బెజోస్ అంతరిక్షయాత్రకు వ్యతిరేకంగా పలువురు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ తన అంతరిక్షయాత్ర కోసం అమెజాన్ కస్టమర్ల, ఉద్యోగుల డబ్బులను వాడి వెళ్లి వచ్చారనే అభిప్రాయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్చేస్తున్నారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. పన్నులు కట్టకుండా అమెరికన్లు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులతోనే స్పేస్ టూర్ చేసి వచ్చారని నెటిజన్లు ఎద్దెవా చేస్తున్నారు. జెఫ్ బెజోస్ గత నెలలో జూలై 20 న 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టారు. ఈ పదకొండు నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం 16 లక్షల డాలర్లు ఖర్చు చేశారని నెటిజన్లు దుయ్యబట్టారు. అంతరిక్షయాత్రను పూర్తి చేసిన కొద్ది రోజులకే జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానం నుంచి జెఫ్ బెజోస్ వైదొలిగాడు. బెజోస్ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(ఎల్వీఎమ్హెచ్) అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్డ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 200.5 బిలియన్ డాలర్లతో ముందున్నారు. జెఫ్ బెజోస్ 190.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. Tone deaf doesn’t begin to describe this @JeffBezos quote. I’m sure your workers who get blocked from unionizing at every turn are just giddy with excitement about your neato field trip to outer space that they subsidized. https://t.co/pmgCUIp7kp — Nick Knudsen 🇺🇸 (@NickKnudsenUS) July 21, 2021 I'm about to cancel my Amazon prime membership quite literally just bc bezos said "thanks, you guys are the ones who paid for this" upon return from space. — ɴᴀᴅɪᴀ 💉💉 (@VainArab) July 24, 2021 @JeffBezos how about you give every Amazon prime subscriber a freebie considering we paid for you to go to space! I’d like you to pay me to stay at home and rent some films, not much to ask👍 #amazon #BlueOrigin #space #givemeabreak #amazonprime #freerental — FromTheShadows (@FTShadows) July 23, 2021 -
జియో యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాంప్లిమెంటరీ బేసిస్‌గా ప్రస్తుత ఎగ్సిస్టింగ్ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా రిలయన్స్ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. సబ్స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఆటోమేటిగ్గా రెన్యూవల్ అవుతుందన్నమాట. ప్రైమ్ మెంబర్షిప్ పొడిగింపు జియో ప్రైమ్ సభ్యత్వం ఖరీదు ఏడాదికి రూ.99. అయితే కంపెనీ ఇప్పుడు ఈ మెంబర్‌షిప్‌ను ఉచితంగానే ఆటో రెన్యూవల్ చేసింది. మైజియో యాప్‌లోకి వెళ్లి ప్రైమ్ మెంబర్షిప్ సభ్యత్వం ఆటో రెన్యూవల్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లోని మై ప్లాన్స్ సెక్షన్లో జియో ప్రైమ్ మెంబర్షిప్ చూసుకోవచ్చు. పొడిగిస్తే ఆ మేరకు సందేశం వస్తుంది. తమ యూజర్ల కోసం ఇప్పుడు జియో ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా మరో ఏడాది వరకు ఫ్రీగా ఆటో రెన్యూవల్ అయ్యే అవకాశాన్ని కల్పించింది. తాజా నిర్ణయం ప్రకారం జియో యూజర్లు ప్రైమ్ సభ్యత్వం కింద ఏడాది పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు. ఇప్పటికే 2016లో జియో కార్యకలాపాలు ప్రారంభించిన జియో 2017లో ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్‌ను పరిచయం చేసింది. అలాగే రెండుసార్లు ఈ ప్రైమ్ మెంబర్షిప్ గడువును పెంచింది. ఆరు నెలల వరకు ఉచిత కాల్స్, డేటా సేవలు అందించింది. అనంతరం ఉచిత సేవలను స్వస్తి పలికి రూ.99 ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. అయితే ఇప్పటికే సభ్యత్వాన్ని రెండుసార్లు పొడిగించింది. ప్రైమ్ మెంబర్షిప్ ఆటో రెన్యూవల్‌ను ఇలా చెక్ చేసుకోండి - మీ స్మార్ట్‌ఫోన్‌లోని మై జియో యాప్‌ను ఓపెన్ చేయండి. - మెనూ ఆప్షన్ లెఫ్ట్ కార్నర్‌ను ట్యాప్ చేయండి. మీ ప్లాన్ ఆటోమేటిగా అప్డేట్ అయితే... మై ప్లాన్స్ సెక్షన్లో జియో ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివేట్ చేయబడింది అనే మెసేజ్ కనిపిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు నిజంగా శుభవార్త చెప్పింది. ఈ సేవలను వాడుతున్న వినియోగదారులకు ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని విలువ రూ.999. అయితే భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.777 (18జీబీ) ఆపైన ప్లాన్‌ను వాడుతున్న కస్టమర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ఆఫర్‌ను పొందాలంటే వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సేవల పట్ల భారతీయ ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారని అందుకే తమ వినియోగదారులు ఆనందంకోసం వారెంతో ఎంతో ఇష్టపడేలా ఈ ప్లాన్ తీసుకొచ్చామని బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు. అలాగే డిసెంబర్లో అత్యంత సరసమైన ధరల వద్ద తీసుకొచ్చిన తమ కొత్త డేటా ప్రణాళికలు నమ్మశక్యంకాని డిమాండ్‌ను తీసుకొచ్చాయన్నారు. -
జియో ప్రైమ్ ముగుస్తోంది.. తర్వాత ఏంటి?
ముంబై : దేశీయ టెలికం రంగంలో కాలు మోపినప్పటి నుంచి సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో, ఆరంభం నుంచి అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ.99కి వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. 2017 మార్చి 31 వరకు ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇచ్చిన జియో, సరిగ్గా ఏడాది పాటు దీనిపై పలు ప్రయోజనాలు అందించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో ప్రకటించిన ఆ ఏడాది గడువు పూర్తి కావొస్తోంది. మరికొన్ని రోజుల్లో అంటే ఈ నెల చివరికి ప్రైమ్ మెంబర్షిప్ గడువు తీరిపోతుంది. అయితే తరువాత పరిస్థితి ఏమిటోనని యూజర్లు సందిగ్ధలో పడ్డారు. తరువాత కూడా ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొడిగిస్తారా లేదా మరేదైనా ప్లాన్ తీసుకొస్తారా అని జియో యూజర్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు జియో ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి అదనపు మొబైల్ డేటాతోపాటు రూ.10వేల విలువైన జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తూ వచ్చింది రిలయన్స్ జియో. ప్రస్తుతం జియో కంపెనీకి 160 మిలియన్‌కు పైగా కస్టమర్లున్నారు. వారిలో 80 శాతం మంది జియో ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారే. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముఖేష్ అంబానీ మరేదైనా మ్యాజిక్ చేయనున్నారా? అని కూడా టెలికాం వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే జియో కంపెనీ, పార్టనర్ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువును రూ.99కే మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జియో ప్రైమ్ కింద అందిస్తున్న ప్రయోజనాలను మరో ఏడాది పాటు అందిస్తుందని చెబుతున్నారు. ఇంకా దీనిపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ, మార్చి చివరి వారంలో బిగ్ సర్ప్రైజే ఉండొచ్చని జియో వర్గాలంటున్నాయి. జియో ట్రాక్ రికార్డును పరిశీలిస్తే, తన ప్రైమ్ మెంబర్లకు ఎప్పడికప్పుడు కంపెనీ సర్ప్రైజింగ్ ఆఫర్లనే ప్రవేశపెట్టిందని, కస్టమర్లను కాపాడుకోవడానికి ఈ సారి అలానే సర్ప్రైజ్ చేయొచ్చని జియో పార్టనర్లు, స్టోర్లు అభిప్రాయ వ్యక్తంచేస్తున్నాయి. మరికొందరు జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువు పెంపు ఏమీ ఉండదని, కానీ జియో యాప్స్‌ను వాడితే చార్జి వసూలు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రైమ్ మెంబర్‌షిప్‌పై జియో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కస్టమర్లకు జియో సమ్మర్ సర్ప్రైజ్
⇒ యూజర్లకు 3 నెలల కాంప్లిమెంటరీ ఆఫరు ⇒ రిలయన్స్ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడి న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా తమ ప్రైమ్ ఆఫర్ కింద సభ్యత్వ నమోదు పథకాన్ని ఏప్రిల్ 15 దాకా పొడిగించింది. ఆలోగా సభ్యత్వం తీసుకోవడంతో పాటు రూ. 303 ప్లాన్ కొనుగోలు చేసిన వారికి మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ ఆఫర్ ప్రకటించింది. సభ్యత్వ నమోదుకు భారీగా స్పందన రావడంతో రూ. 303, ఇతరత్రా ప్లాన్ల కొనుగోలుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కస్టమర్లకు రాసిన లేఖలో జియో చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఆఫరు మార్చి 31తో ముగియాల్సి ఉంది. ఇప్పటిదాకా 7.2 కోట్ల మంది పెయిడ్ సబ్‌స్క్రయిబర్స్ ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ‘ఉచితం నుంచి పెయిడ్‌కి మారే క్రమంలో యూజర్లకు సర్వీసుల్లో ఇబ్బందులు ఎదురవకుండా చూసేందుకు తుది గడువును పొడిగించడం జరిగింది. ఏ కారణం వల్లనైనా మార్చి 31లోగా జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకోలేకపోయిన వారు ఏప్రిల్ 15 లోగా రూ. 99 చెల్లించడంతో పాటు రూ. 303 ప్లాన్ కొనుగోలు చేయడం ద్వారా సభ్యత్వం పొందవచ్చు‘ అని అంబానీ తెలిపారు. అలాగే గడువులోగా రూ. 303 ప్లాన్ లేదా అంతకు మించిన ప్లాన్‌ని ఫస్ట్ పెయిడ్ రీచార్జ్ కింద కొనుగోలు చేసిన వారికి సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ కింద తొలి మూడు నెలల సేవలు కాంప్లిమెంటరీ ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాంప్లిమెంటరీ సర్వీసు గడువు పూర్తయ్యాకా జూలై నుంచి మాత్రమే పెయిడ్ టారిఫ్ ప్లాన్ అమల్లోకి వస్తుందని అంబానీ తెలిపారు. ఇక.. సర్వీసు నాణ్య తను మరింతగా మెరుగుపర్చే దిశగా నెట్వర్క్ విస్తరణపై భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఉచిత వాయిస్, డేటా ప్లాన్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో .. ఆ తర్వాత ఉచిత ఆఫర్లను ఈ ఏడాది మార్చి 31దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. -
రేపటితో 'జియో ప్రైమ్' ఆఫర్ క్లోజ్
హైదరాబాద్ : రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఆఫర్ రేపటితో(మార్చి 31) ముగియనుంది. ఉచిత కాల్స్ ఉచిత డేటాతో కూడిన హ్యపీ న్యూఇయర్ ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో జియో ప్రైమ్‌కు అప్ గ్రేడ్ అవ్వాలని కంపెనీ ఇది వరకే వినియోగదారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కంపెనీకి ఉన్న 10 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లలో దాదాపు 5 కోట్ల మంది ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంటే వీరందరూ రూ.99లతో రీఛార్జ్ చేసుకున్నారు. ఇంకా ఒక్క రోజులోనే ఈ ఆఫర్ ముగుస్తుండటంతో జియో సిమ్ కోసం క్యూలు కట్టిన మాదిరిగా ప్రస్తుతం ప్రైమ్ రీఛార్జ్ కోసం వినియోగదారులు క్యూలు కడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ కింద ప్రస్తుతం జియో సిమ్ కలిగి ఉన్న వారు myJio యాప్ ద్వారా రూ.99 చెల్లించి ప్రస్తుతం అనుభవిస్తున్న సేవలను మరో ఏడాది పాటు కొనసాగించుకోవచ్చు. ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న యూజర్లు తర్వాత అందుబాటులో ఉండే డేటా ఫ్యాక్స్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాయిస్ కాల్స్ ఉచితం. ప్రైమ్ యూజర్లకు నాన్ ప్రైమ్ యూజర్లతో పోలిస్తే కొన్ని అదనపు ప్రయోజనాలు పొందుతారని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోజనాల కింద టెలికాం రంగంలో ఎన్నడూ లేనట్టుగా ప్రతి రోజూ 1జీబీ డేటాను కేవలం 10 రూపాయలకే అందించనుంది. వినియోగదారుల తమకు అనువైన రీఛార్జ్ ప్యాకేజీని ఎంచుకోవడానికి తమ మొబైల్ లోని myJio యాప్ ని కానీ, కంపెనీ వెబ్ సైట్ www.jio.com కానీ చూడవచ్చని రిలయన్స్ జియో చెప్పింది. రూ.99 అంతకంటే ఎక్కువ ప్లాన్లను జియో మనీ వ్యాలెట్, myJio యాప్, www.jio.com వెబ్సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. మార్కెట్లో అన్ని రీఛార్జ్ స్టోర్లలలో కూడా జియో ప్రైమ్ వివరాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. -
గుడ్ న్యూస్: జియో మెంబర్షిప్ గడువు పొడిగింపు?
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తాజా పథకం ప్రైమ్ మెంబర్షిప్ ఇంకా తీసుకోని జియో ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఈ పథకం రిజిస్టర్ గుడువును జియో పెంచే అవకాశం ఉందట. మార్చి 31 తో ముగియనున్న ప్రైమ్ మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ గడువును ఆర్ఐఎల్ పెంచనుందట. ఈ గడువు మరో నాలుగు రోజుల్లోముగియనుండగా మరింత సమయం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కస్టమర్ల సౌలభ్యంకోసం ఈ గడువును మరో నెలపాటు పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఉచిత డాటా ప్రకనటతో టెలికాం మార్కెట్ లో సునామీ సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా టారిఫ్‌లను ప్రకటించింది. ముఖ్యంగా వన్‌టైం ఫీజు రూ. 99 తో ప్రైమ్ మెంబర్ షిప్ రిజిస్ట్రేషన్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ నమోదు కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చిలో 31న ముగియనుంది. దీని ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న ఆఫర్లను వినియోగదారులు 2018వరకు పొందవచ్చని తెలిపింది. మరోవైపు గత ఫిబ్రవరిలో ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏప్రిల్ నెలనుంచి ప్రత్యర్థులతో పోలిస్తే తమ వినియోగదారులు 20 శాతం ఎక్కువ డేటా సహా, ఇతర ఆఫర్లను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
జియో ప్రైమ్ గడువు పెంపు??
ముంబై: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో తన దూకుడును కొనసాగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఉచిత కాల్స్, డేటా ఆఫర్లతో సంచలనం సృష్టిచింది. తన వినియోగదారులకు అందించిన ఉచిత జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ మార్చి 31తో ముగియబోతోంది. దీని తర్వాత ఏడాదిపాటు ఉచిత సర్వీసులు కావాలంటే రూ.99తో జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాలి. అయితే ఈ సభ్యత్వం గడువు కూడా మార్చి 31తో ముగియనుంది. అయితే వినియోగదారుల సంఖ్య పెంచుకోవడానికి జియో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో నెలరోజులు పాటు ప్రైమ్ సభ్యత్వ గడువును పెంచి ఎక్కువ మొత్తంలో చందాదారులను చేర్చుకోవాలని భావిస్తోంది. అంటే ఏప్రిల్ 30లోపు రూ.99చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ పొందొచ్చు. ఇప్పటికే ఉచిత ఆఫర్లతో తమ వ్యాపారాలను భారీగా దెబ్బతీశాయని ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు పలుసార్లు ట్రాయ్‌కి ఫిర్యాదులు చేస్తున్నాయి. దీనిపై ఇతర టెలికాం సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
జియో మరో బంపర్ ఆపర్
న్యూఢిల్లీ: సంచలనానికి మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచిత డేటా ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయాలనుంచి టారిఫ్ లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఇపుడు ప్రైమ్ మెంబర్ షిప్ ను కూడా ఉచితంగా అందించే ప్లాన్ ను ఒక దాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఆఫర్లో రూ.99 ల చార్జితో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా మార్చి 2018 వరకు జియో సేవలు ఉచితం. అయితే జియో మనీ ద్వారా ప్రత్యేక ఆఫర్లో ఉచితంగా ప్రైమ్ మెంబర్ షిప్ పొందే అవకాశాన్ని కల్పించింది. ఎలా అంటే.. 15 మార్చి నుండి ప్రారంభమైన ఈ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంది. జియోమనీ వాలెట్ లేదా మై జియో యాప్ లేదా www.jio.com లాగిన్ ద్వారా రూ.99+303 చెల్లించాలి. అనంతరం యాప్ లోరూ.50 డిస్కౌంట్ వోచర్ లభిస్తుంది. ఈ వోచర్ రూ.303లు, ఆ పైన విలువగల తరువాతి రీచార్జ్ సమయంలో వినియోగించుకోవచ్చు. 25 మార్చి నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ పరిమిత కాలంలో ఇలా యూజర్ 5 సార్లు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో.. ఇలా రెండుసార్లు రీచార్జ్ చేసుకొని, రెండు సార్లు 50 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందడం ద్వారా ప్రైమ్ మెంబర్ షిప్‌ను ఉచితంగా పొందవచ్చన్నమాట. కాగా 303 రూపాయల ప్లాన్‌లో ప్రైమ్ మెంబర్స్‌కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, 499 రూపాయల ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీతో 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 999 రూపాయల రీచార్జ్‌పై ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ, 1999 రూపాయల ప్లాన్‌లో ప్రైమ్ మెంబర్స్‌కు 125 జిబి 90 రోజుల వ్యాలిడిటీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ 30 జీబీ ఆఫర్ సంగతి తెలిసిందే.