జియో యూజర్లకు గుడ్ న్యూస్ | Reliance renews Jio Prime Membership plan for free | Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు గుడ్ న్యూస్: మరో ఏడాది ఉచితం

Published Tue, May 14 2019 11:23 AM | Last Updated on Wed, May 15 2019 8:23 AM

Reliance renews Jio Prime Membership plan for free - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కాంప్లిమెంటరీ బేసిస్‌గా ప్రస్తుత ఎగ్సిస్టింగ్ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా రిలయన్స్ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు  ఆటోమేటిగ్గా రెన్యూవల్ అవుతుందన్నమాట.

ప్రైమ్ మెంబర్‌షిప్ పొడిగింపు
జియో ప్రైమ్ సభ్యత్వం ఖరీదు ఏడాదికి రూ.99. అయితే కంపెనీ ఇప్పుడు ఈ మెంబర్‌షిప్‌ను ఉచితంగానే ఆటో రెన్యూవల్ చేసింది. మైజియో యాప్‌లోకి వెళ్లి ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఆటో రెన్యూవల్ అయిందో లేదో చెక్‌ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లోని మై ప్లాన్స్ సెక్షన్‌లో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ చూసుకోవచ్చు. పొడిగిస్తే ఆ మేరకు సందేశం వస్తుంది. తమ యూజర్ల కోసం ఇప్పుడు జియో ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా మరో ఏడాది వరకు ఫ్రీగా ఆటో రెన్యూవల్ అయ్యే అవకాశాన్ని కల్పించింది.

తాజా నిర్ణయం ప్రకారం జియో యూజర్లు ప్రైమ్ సభ్యత్వం కింద ఏడాది పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు. ఇప్పటికే 2016లో జియో కార్యకలాపాలు ప్రారంభించిన జియో 2017లో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. అలాగే రెండుసార్లు ఈ  ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ గడువును పెంచింది. ఆరు నెలల వరకు ఉచిత కాల్స్, డేటా సేవలు అందించింది. అనంతరం ఉచిత సేవలను స్వస్తి పలికి రూ.99 ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. అయితే ఇప్పటికే సభ్యత్వాన్ని రెండుసార్లు పొడిగించింది.

  ప్రైమ్ మెంబర్‌షిప్ ఆటో రెన్యూవల్‌ను ఇలా చెక్ చేసుకోండి

- మీ స్మార్ట్‌ఫోన్‌లోని మై జియో యాప్‌ను ఓపెన్ చేయండి.

- మెనూ ఆప్షన్ లెఫ్ట్ కార్నర్‌ను ట్యాప్ చేయండి.

  మీ ప్లాన్‌ ఆటోమేటిగా అప్‌డేట్‌ అయితే... మై ప్లాన్స్‌ సెక్షన్‌లో జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్ ​యాక్టివేట్‌ చేయబడింది అనే మెసేజ్‌  కనిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement