గుడ్‌ న్యూస్‌: జియో మెంబర్‌షిప్‌ గడువు పొడిగింపు? | Reliance Jio Prime Membership deadline to be extended beyond March 31? | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌: జియో మెంబర్‌షిప్‌ గడువు పొడిగింపు?

Published Mon, Mar 27 2017 12:13 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

గుడ్‌ న్యూస్‌: జియో మెంబర్‌షిప్‌ గడువు పొడిగింపు? - Sakshi

గుడ్‌ న్యూస్‌: జియో మెంబర్‌షిప్‌ గడువు పొడిగింపు?

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తాజా పథకం ప్రైమ్‌ మెంబర్‌షిప్‌  ఇంకా తీసుకోని  జియో ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.   ఈ పథకం రిజిస్టర్‌ గుడువును జియో  పెంచే అవకాశం ఉందట.  మార్చి 31 తో ముగియనున్న  ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ రిజిస్ట్రేషన్‌ గడువును ఆర్‌ఐఎల్‌  పెంచనుందట.   ఈ గడువు మరో నాలుగు రోజుల్లోముగియనుండగా  మరింత సమయం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. తన  కస్టమర్ల సౌలభ్యంకోసం ఈ గడువును మరో నెలపాటు పొడిగించే అవకాశం ఉందని సమాచారం.

కాగా ఉచిత డాటా  ప్రకనటతో టెలికాం మార్కెట్‌ లో సునామీ సృష్టించిన రిలయన్స్‌ జియో తాజాగా  టారిఫ్‌లను ప్రకటించింది.  ముఖ్యంగా వన్‌టైం ఫీజు  రూ. 99 తో  ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ రిజిస్ట్రేషన్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.  ఈ నమోదు  కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చిలో 31న ముగియనుంది. దీని ద్వారా  ప్రస్తుతం అమల్లో ఉన్న  ఆఫర్లను  వినియోగదారులు 2018వరకు పొందవచ్చని తెలిపింది.  మరోవైపు గత ఫిబ్రవరిలో  ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ   ఏప్రిల్‌ నెలనుంచి   ప్రత్యర్థులతో పోలిస్తే తమ వినియోగదారులు  20 శాతం ఎక్కువ డేటా సహా, ఇతర ఆఫర్లను అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ వార్తలపై  రిలయన్స్‌ జియో అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement