స్టాక్‌హోమ్ ఆధారిత కాలర్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ ట్రూకాలర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల యూజర్లను ట్రూకాలర్ సొంతం చేసుకుంది. ఒక్క భారత్‌లోనే ఏకంగా 220 మిలియన్ల యూజర్లు ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 50 మిలియన్ల కొత్త యూజర్లు ట్రూకాలర్‌లో చేరారు.
చదవండి: కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోన్న ట్రూకాలర్..!
11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ట్రూకాలర్ యాప్ బహుళ భాషలకు మద్దతునిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. సుమారు 220 మిలియన్ల యూజర్లతో భారత్ ట్రూకాలర్ అతి పెద్దమార్కెట్‌గా నిలుస్తోంది. కాల్ ఐడెంటిఫికేషన్, స్పామ్ బ్లాకింగ్ ప్రధాన లక్షణాలతో పాటు ట్రూకాలర్ స్మార్ట్ ఎస్‌ఎమ్‌ఎస్, ఇన్‌బాక్స్ క్లీనర్, ఫుల్-స్క్రీన్ కాలర్ ఐడీ, గ్రూప్ వాయిస్ కాలింగ్ ఇతర ఫీచర్లను యూజర్లకు ట్రూకాలర్ అందిస్తోంది.
ట్రూకాలర్ 300 మిలియన్ల యూజర్ల మైలురాయిపై ట్రూకాలర్ సీఈవో, సహా వ్యవస్థాపకుడు అలాన్ మామెడి మాట్లాడుతూ...చిన్న ప్లాట్‌పాంగా మొదలై 300 మిలియన్ల ఆక్టివ్ యూజర్లను ట్రూకాలర్ సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలను తెలిపారు.
చదవండి: భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే.?
Comments
Please login to add a commentAdd a comment