user base
-
జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న ట్రూకాలర్..!
స్టాక్‌హోమ్ ఆధారిత కాలర్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ ట్రూకాలర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల యూజర్లను ట్రూకాలర్ సొంతం చేసుకుంది. ఒక్క భారత్‌లోనే ఏకంగా 220 మిలియన్ల యూజర్లు ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 50 మిలియన్ల కొత్త యూజర్లు ట్రూకాలర్‌లో చేరారు. చదవండి: కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోన్న ట్రూకాలర్..! 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ట్రూకాలర్ యాప్ బహుళ భాషలకు మద్దతునిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. సుమారు 220 మిలియన్ల యూజర్లతో భారత్ ట్రూకాలర్ అతి పెద్దమార్కెట్‌గా నిలుస్తోంది. కాల్ ఐడెంటిఫికేషన్, స్పామ్ బ్లాకింగ్ ప్రధాన లక్షణాలతో పాటు ట్రూకాలర్ స్మార్ట్ ఎస్ఎమ్ఎస్, ఇన్‌బాక్స్ క్లీనర్, ఫుల్-స్క్రీన్ కాలర్ ఐడీ, గ్రూప్ వాయిస్ కాలింగ్ ఇతర ఫీచర్లను యూజర్లకు ట్రూకాలర్ అందిస్తోంది. ట్రూకాలర్ 300 మిలియన్ల యూజర్ల మైలురాయిపై ట్రూకాలర్ సీఈవో, సహా వ్యవస్థాపకుడు అలాన్ మామెడి మాట్లాడుతూ...చిన్న ప్లాట్పాంగా మొదలై 300 మిలియన్ల ఆక్టివ్ యూజర్లను ట్రూకాలర్ సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలను తెలిపారు. చదవండి: భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే.? -
ఒకప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్.. ఇప్పుడు స్నాప్‌చాట్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజాలుగా ఉన్న ఫేస్బుక్, ట్విట్టర్ బాటలోనే పయణిస్తోంది ఫోటో మేసేజింగ్యాప్ స్నాప్ చాట్. అనతి కాలంలోనే ఇండియాలో యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తనదైన ముద్ర వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ వినియోగదార్ల సంఖ్య 10 కోట్లు దాటిందని ఆ కంపెనీ సీఈవో ఇవాన్ స్పైగల్ తెలిపారు. ‘ ఇండియాలో యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేశామని తెలిపారు. ముఖ్యంగా లోకల్ ఫీల్ తెచ్చేందుకు కంటెంట్ కోసం భారీగా ఖర్చు చేశామన్నారు. ఆ ప్రయమ్నం ఫలించిందని. అందువల్లే ఈ ఏడాది ఆరంభంలో ఆరు కోట్లు ఉన్న యూజర్ల సంఖ్య ప్రస్తుతం పది కోట్లకు చేరింది’ అని వివరించాడు. స్నాప్‌చాట్ వేదికపై ప్రకటనదార్ల సంఖ్య 2020లో 70% పెరిగిందని కూడా ఇవన్ స్పైగల్ వెల్లడించారు. ఇండియాలో యూజర్ బేస్ పెరగడంతో స్నాప్‌చాట్‌ని వ్యాపార భాగస్వామిగా ఎంచుకునేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆగ్యుమెంటెంట్ రియాల్టీని ఉపయోగిస్తూ షాపింగ్‌లో కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌చాట్‌లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. అంతేకాదు జోమాటో, షుగర్ కాస్మోటిక్స్, మైగ్లామ్ కంపెనీలు కూడా స్నాప్‌చాట్‌తో కలిసి పని చేస్తున్నాయి. -
జియో కస్టమర్లు వాడే డేటా ఎంతంటే..
ఆరంభంతోనే ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రిలయన్స్ టెలికం కంపెనీ జియో... లాభాల జోరును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. యూజర్ బేస్‌ను కూడా అదే స్థాయిలో పెంచుకుంటూ వెళ్తోంది జియో. 2018 క్యూ1లో జియో తన యూజర్ బేస్‌ను 186.6 మిలియన్లకు పెంచుకున్నట్టు శుక్రవారం వెల్లడించిన ఫలితాల్లో పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 26.5 మిలియన్ల యూజర్లను జియో తన సొంతం చేసుకున్నట్టు తెలిపింది. క్వార్టర్ ఫలితాల సందర్భంగానే జియో తన ఆర్పూను(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్), డేటా వాడకాన్ని కూడా వెల్లడించింది. నెలలో ఒక్కో కస్టమర్ సగటున 9.7జీబీ డేటాను వాడుతున్నట్టు జియో తెలిపింది. అంటే మొత్తంగా 2018 క్యూ1లో 506 కోట్ల జీబీ డేటాను సబ్స్క్రైబర్లు వాడినట్టు తెలిపింది. అదేవిధంగా వాయిస్ కాల్స్ పరంగా కూడా ఈ కాలంలో 37,218 కోట్ల నిమిషాల కాలింగ్ ట్రాఫిక్ నమోదైనట్టు తెలిపింది. అంటే ప్రతి జియో 4జీ సబ్‌స్క్రైబర్ నెలకు 716 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను, సగటున 13.8 గంటల వీడియోలను వీక్షించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా జియో యూజర్‌బేస్ భారీగా పెరగడం కంపెనీకి ఎంతో సహకరిస్తున్నట్టు తెలిపింది. ఆర్పూ కూడా జనవరి-మార్చి కాలంలో రూ.137.1గా నమోదైందని, అయితే ఇది గత మూడు నెలల కాలంతో పోలిస్తే తక్కువేనని రిలయన్స్ వెల్లడించింది. జియో ప్రధాన ప్రత్యర్థి ఎయిర్టెల్ ఆర్పూ కూడా ఈ సారి పడిపోయిన సంగతి తెలిసిందే. 2018 మార్చి కాలంలో ట్రాయ్‌కి చెందిన మైస్పీడ్ అనాలటిక్స్ యాప్ ద్వారా నిర్వహించిన టెస్ట్‌లో తమది గత 15 నెలల కాలంలో ఫాస్టెస్ట్ నెట్‌వర్క్‌గా పేరు గడించినట్టు జియో పేర్కొంది. అంతేకాక కాల్ డ్రాప్ రేటు కూడా అత్యంత తక్కువగానే నమోదైంది. -
4జీతో నాలుగేళ్లలో రూ.79,000ఆదాయం: అసోచామ్
న్యూఢిల్లీ: హై స్పీడ్ 4జీ కనెక్షన్లు 2020 నాటికి దేశ మొత్తం యూజర్ బేస్‌లో 17 శాతానికి చేరే అవకాశం ఉందని అసోచామ్కేపీఎంజీ అధ్యయన పత్రం ఒకటి తెలిపింది. ఇదే కాలానికి ఆదాయం రూ.79,580 కోట్లకు పెరుగుతుందని కూడా వెల్లడించింది. పవరింగ్ డిజిటల్ ఇండియా పేరుతో ఈ అధ్యయన పత్రం రూపొందింది. డిజిటల్ ఇండియా, స్మార్ సిటీస్ వంటి కీలక చొరవల నుంచి అధిక స్పీడ్ ఇంటర్నెట్ సేవలకు మంచి డిమాండ్ ఉంటుందని అధ్యయనం తెలిపింది. దీనితోపాటు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, వేగంగా సామాజిక పథకాల అమల్లో కూడా 4జీ సేవలు కీలకం కానున్నట్లు వెల్లడించింది. అయితే రిలయన్స్ జియో గానీ లేక ప్రస్తుతం సేవలు అందిస్తున్న ఇతర ఆపరేటర్లపేరుకానీ ప్రస్తావించని అధ్యయన పత్రం, ఉమ్మడి లక్ష్యాల దిశగా పనిచేయడానికి పరిశ్రమలోని వివిధ వర్గాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొంది. వ్యాపార విస్తరణకు ఆపరేటర్లు అందరికీ తగిన అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే తగిన ధరలవైపే వినియోగదారులు మొగ్గుచూపుతారని నివేదిక పత్రంలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. -
మొబైల్ కంపెనీలన్నింటితో జియో భాగస్వామ్యం!
న్యూఢిల్లీ : ఇప్పుడా అప్పుడా అంటూ 4జీ సర్వీసుల కమర్షియల్ లాంచింగ్ తేదీతో ఇతర టెలికాం ఆపరేటర్ల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, స్మార్ట్ ఫోన్ల తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటూ మరింత షాకిలిస్తోంది. జియో సర్వీసుల కమర్షియల్ లాంచింగ్ నాటికి స్మార్ట్ ఫోన్ తయారీదారులందరితోనూ భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రయత్నాలు ప్రారంభించేసింది. హ్యాండ్ సెట్ కంపెనీల భాగస్వామ్యంతో యూజర్లలందరికీ మూడు నెలల ఉచిత డేటా, వాయిస్ సర్వీసులను రిలయన్స్ అందించాలనుకుంటోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రారాజుగా ఉన్న శాంసంగ్ తో ఈ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఇతర టెలికాం ఆపరేటర్లకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. రిలయన్స్ జియో పోటీని తట్టుకోవడానికి ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియాలు డేటా ప్యాక్ లపై భారీగా ఆఫర్లను ప్రకటించేశాయి. మరో రెండు రోజుల్లో వొడాఫోన్ సైతం తన కస్టమర్లకు డేటా ప్యాక్ లపై శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ కంపెనీ భాగస్వామ్యంతో ఇటు జియో సర్వీసుల కార్యకలాపాలు పెరగడంతో పాటు, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పెరుగుతాయని ప్లాన్ కు సంబంధించిన టాప్ ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. ఈ ప్లాన్ తో రిలయన్స్ కంపెనీ తన కస్టమర్ బేస్ ను పెంచుకోనుంది. రిలయెన్స్ తన కంపెనీ ఉద్యోగుల కోసం గతేడాదే జియో సేవలను ప్రారంభించింది. ఈ ఆగస్టులో కమర్షియల్ గా లాంచ్ అయ్యేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల కొనుగోలు చేసినవారికి 4జీ జియో సిమ్ ను రిలయన్స్ ఆఫర్ గా అందిస్తోంది. లైఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు, ఉద్యోగులు, బిజినెస్ పార్టనర్లు మొత్తం కలిపి ఇప్పటికే కంపెనీకి 1.5 మిలియన్ పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ సేవలను లాంచ్ చేసిన రెండేళ్లలో 90శాతం జనాభాకు తన సేవలను అందించి, తన కవరేజ్ ను విస్తరించాలని రిలయన్స్ యోచిస్తోంది. ఇప్పటికే రిలయెన్స్ జియో 70శాతం తన సేవలను విస్తరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 30 మిలియన్ సబ్ స్క్రైబర్లను రిలయెన్స్ జియో చేరుకుంటుందని, 1బిలియన్ డాలర్ల రెవెన్యూను ఆర్జిస్తుందని మోర్గాన్ స్టాన్లి రిపోర్టు పేర్కొంటోంది.