దేశంలో గత ఏడాది 41.5 శాతం కుటుంబాల ఆదాయంలో ఎటువంటి మార్పులేదు
36.0 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగింది
22.6 శాతం కుటుంబాల ఆదాయం తగ్గింది
78.5 శాతం కుటుంబాల్లో వినియోగం పెరిగింది
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల సెంటిమెంట్స్ సర్వే వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో గత ఏడాది 41.5 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయంలో ఎటువంటి మార్పులేదు. 36.0 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగింది. 22.6 శాతం గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల సెంటిమెంట్స్ సర్వేలో ఈ విషయాలు గుర్తించినట్లు నాబార్డు వెల్లడించింది.
వివిధ రాష్ట్రాల్లో గ్రామాల్లోని కుటుంబాల ఆదాయం, వినియోగం, ఆర్థిక పొదుపు, రుణాలు, మూలధన పెట్టుబడులకు సంబంధించి సర్వే చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను అంచనా వేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగ డిమాండ్ ఉత్సాహంగా ఉందని సర్వే తెలిపింది. పొదుపు చేయడంలో గ్రామీణ కుటుంబాల్లో ఎటువంటి మార్పులేదని, మూలధన పెట్టుబడి పెట్టిన కుటుంబాల శాతం పెరిగిందని సర్వేలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment