స్టాక్‌హోమ్: స్వీడిష్ కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీస్ మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన క్లాస్ బీ షేర్లను నాస్‌డాక్ స్టాక్‌హోమ్‌లో లిస్ట్ చేయడానికి ప్లాన్ వేస్తోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ట్రూకాలర్ లిస్టింగ్ 2021 నాల్గో త్రైమాసికంలో పూర్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీవోలో భాగంగా 116 మిలియన్ డాలర్లను సేకరించాలని కంపెనీ యోచిస్తోంది.
చదవండి: Jeff Bezos:జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..!
ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ మామెడి మాట్లాడుతూ...కనీసం రెండు సంవత్సరాల పాటు ఐపీవోపై ట్రూకాలర్ పనిచేస్తోందని వెల్లడించారు. సీక్వోయా క్యాపిటల్ , అటామికో కంపెనీలు ట్రూకాలర్ ఇన్వెస్టర్లుగా నిలిచాయి. ఒక నివేదిక ప్రకారం ట్రూకాలర్ సుమారు 95 మిలియన్ డాలర్లను సేకరించింది. గత ఆరు సంవత్సరాల నుంచి పలు ఇన్వెస్టర్ల నుంచి 100 మిలియన్ డాలర్లను సేకరించడంతో ట్రూకాలర్ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల ఆక్టివ్ యూజర్లు ట్రూకాలర్ సొంతం. ఇటీవలి కాలంలో ఆపిల్, గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కాలర్ ఐడి ఫీచర్‌ను మెరుగుపరిచినప్పటికీ, స్పామ్ కాల్‌లను అరికట్టడానికి అనేక ఇతర చర్యలు తీసుకున్నప్పటికీ, ట్రూకాలర్ వాటిని పరిష్కరించలేకపోయింది. భారత్‌ను అతి పెద్ద మార్కెట్‌గా ట్రూకాలర్ పరిగణిస్తోంది.
చదవండి: MediaTek : భారీ రిక్రూట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తోన్న మీడియాటెక్..!
Comments
Please login to add a commentAdd a comment