Stockholm
-
అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం
‘ఈ స్పృహ ఈనాటిది కాదు. దీనికి యాభయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. మానవకారక కాలుష్యాల వల్ల ముంచుకొస్తున్న ముప్పు పర్యావరణ మార్పు దుష్ఫలితాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం చేయాలన్నది ఒప్పందం. అంతే తప్ప, ఆ పేరుతో పెట్టుబడుల్ని సాయంగా చూపి వ్యాపారం చేయడం కాదని ఇవాళ మనం నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. పదమూడేళ్ల కింద (2011 కోపెన్‌హాగెన్) మీరే అంగీకరించి, సంసిద్ధత ప్రకటించినట్టు ఏటా ఇవ్వాల్సిన లక్ష కోట్ల డాలర్ల పర్యావరణ ఆర్థిక సహాయాన్ని మీ మీ వ్యాపారాల వృద్ధికి బంగారు బాట చేసుకోకండి’ అని తాజాగా భారత్ స్పష్టం చేసింది. అజర్‌బైజాన్‌లోని ‘బాకు’లో ‘కాప్–29’ సదస్సు జరుగుతున్న సందర్భంలో భారత్ ఈ ప్రకటన వెలువరించింది. ఇవాళ 140 కోట్ల మానవ వనరుల శక్తిగా, మార్కెట్ ప్రపంచానికి గమ్యస్థానంగా ఉన్న భారత్, శాసించాల్సిన చోట నామమాత్రపు పాత్రకే పరిమితమౌతోంది. కారణం, పర్యావరణ స్పృహ, దూరదృష్టి, ప్రపంచ దృక్పథం కలిగిన నాయకత్వం లేకపోవడమేనన్నది కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవం. యాభై ఏళ్ల కింద, నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చూపిన పర్యావరణ దృక్పథం, చేసిన ఆలోచనలు కాలం కన్నా ఎంతో ముందున్నాయి. తదుపరి అయిదారు దశాబ్దాల్లో అభివృద్ధి– పర్యావరణ పరిరక్షణ మధ్య తలెత్తబోయే ఘర్షణను గుర్తించారు. ఇదే విషయమై సంపన్న–పేద దేశాల మధ్య బంధాలకు సరికొత్త నిర్వచనాల అవసరాన్ని ఆమె సహేతుకంగా అంచనా వేశారు. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అవసరాలకూ, దామాషాకూ మించి కొల్లగొట్టడాన్ని పర్యావరణ నేరంగానే చూశారామె! విఘాతం కలిగించిన వారే మూల్యం/ నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచనకు ఆమె నాడే బీజం వేశారు. భారతదేశపు పర్యావరణ దృక్పథానికి, భావధారకు మూలాలు 1971–72 నాటి పాలకుల ఆలోచనల్లో, కేంద్ర ప్రభుత్వ చర్యల్లో కనిపిస్తాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న వివిధ నిర్ణయాలు, చేపట్టిన పలు చర్యలు దీన్ని ధ్రువీకరిస్తాయి. స్వీడన్ వినతి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో మొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు స్టాక్‌హోమ్‌లో 1972 జూన్‌లో జరిగింది. కానీ, అంతకు ముందే 1972 ఫిబ్రవరిలోనే ‘పర్యావరణ ప్రణాళిక–సమన్వయ జాతీయ కమిటీ’ (ఎన్సీఈపీసీ) భారత్‌లో ఏర్పాటయింది. దీని ఏర్పాటుకు ఇంది రాగాంధీ చొరవ కారణం. ఆ కమిటీయే 1985లో కేంద్ర ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ’ శాఖగా రూపాంతరం చెందింది. 1971 డిసెంబరులో ఆమె సిమ్లాలో ఉన్నారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తర్వాతి పరిణామాల్లో... పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఆమె దౌత్య చర్చలు జరుపుతున్నారు. అంతటి ఒత్తిడిలోనూ, సిమ్లా నుంచే ఆమె బిహార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అభివృద్ధి పేరుతో చేపట్టిన ఒక ప్రాజెక్టుకు అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదలాయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందనీ, అది పర్యావరణానికి హాని చేసే తప్పుడు చర్య అవుతుంది కనుక ఉపసంహరించుకోవాలనీ ఆ లేఖలో పేర్కొన్నారు.దక్షిణ ప్రపంచానికి గొంతిచ్చిన వైనంస్టాక్హోమ్ పర్యావరణ వేదికను ఇందిరాగాంధీ ఎంతో వ్యూహాత్మకంగా, ప్రభావవంతంగా వాడుకున్నారు. అక్కడ ఆమె ఒక అరుదైన ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఆతిథ్య స్వీడన్ కాకుండా ఆమె ఒక్కరే దేశాధినేత హోదాలో ‘ప్లీనరీ ప్రసంగం’ చేశారు. ‘ఆ సదస్సు తర్వాత పదేళ్లకు పైగా ఆ ఊపు ఆమెలో కనిపించింది. దాని ఫలితంగానే, ఇప్పటికీ దేశంలో గొప్ప రక్షణాయుధాలుగా ఉన్న పలు ప్రగతిశీల అటవీ, వన్యప్రాణి–సహజవనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఆ కాలంలోనే వచ్చాయ’ని ఆమె సమకాలికులైన ప్రభుత్వాధికారులు ఆయా సందర్భాల్లో వ్యాఖ్యానించేవారు. స్వల్ప జనాభా ఉన్న సంపన్న దేశాలు సౌఖ్యాలకు మరిగి, అసాధారణ స్థాయిలో ప్రకృతి సహజ వనరుల్ని కొల్లగొడుతూ చేస్తున్న పర్యావరణ హానిని ఆమె సోదాహరణంగా ఎండ గట్టారు. అభివృద్ధి–పర్యావరణ ఘర్షణను విడమర్చారు. కాలుష్య నివారణ కోసం విధించే కట్టుబాట్లు వెనుకబడ్డ దేశాల ప్రగతికి ప్రతిబంధకం అయ్యే తీరును ఎత్తిచూపడమే కాక ‘కాలుష్య కారకులే నష్టాల మూల్యం చెల్లించాల’నే వాదనను తెరపైకి తెచ్చి, మూడో ప్రపంచ దేశాల గొంతుకయ్యారు. ‘పర్యావరణ వాదననే మనం నెత్తికెత్తుకుంటే... యుద్ధం, పేదరికం వంటి సంక్షోభాలు అప్రాధాన్యమవుతాయేమో?’ అంటూ సదస్సు చైర్మన్‌గా ఉన్న యూఎన్ ప్రతినిధి మౌరిస్ స్ట్రాంగ్ వ్యక్తం చేసిన భయాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘ప్రకృతి పరిరక్షణ’ అనేది అభివృద్ధి–పేదరిక నిర్మూలన బాధ్యతకు వ్యతిరేకం కాదనీ, అదే వారి జీవనప్రమాణాల వృద్ధికి దోహదపడుతుందనీ ఆమె అదే వేదిక నుంచి స్పష్టం చేశారు. సంపద, హోదా, అధికార పరంగా మనమెంత బలిష్టులమైనా, పర్యావరణ మార్పు విపరిణామాలకు ప్రభావితులం కాకుండా తప్పించు కోజాలమని ఆనాడే హెచ్చరించారు.పర్యావరణ స్పృహగల వారిప్పుడు వాడుతున్న ‘ఒకే పృథ్వి’ ‘జీవులున్న ఏకైక గ్రహం’ వంటి మాటల్ని ఇందిరా గాంధీ 70లలోనే వినియోగించారు. ‘ప్రపంచం ఏ మూల నుంచో తరచూ సమాచారం అందుతోంది, దేశం వెనుక దేశం అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి తెగిస్తోంది, ఇలా సాగితే దీనికి ముగింపేమిటి?’ అని ఆమె ప్రశ్నించారు. సాటి మనుషుల్ని రక్షించడం, దోషుల్ని శిక్షించడమే కాదు, సకల జీవుల పట్ల కరుణతో ఉండాలని బుద్ధుడు, అశోకుడు 2 వేల ఏళ్ల కింద ఏర్పరచిన బాట, భారతీయ సంస్కృతిని ఆమె స్టాక్‌హోమ్ వేదిక నుంచి జగతికి వినిపించారు. అతి పురాతనమైన రుగ్వేదాన్ని ఉటంకిస్తూ ఇందిరాగాంధీ ఆనాడు స్టాక్‌హోమ్‌లో చెప్పిన ‘ప్రకృతి నుంచి తీసుకున్నంత, తిరిగి వెనక్కి ఇవ్వటం మానవ ధర్మం’ అన్న మాట, మనమంతా ఆచరించాల్సిన అక్షరసత్యం!- దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్(నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి) -
భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
2024 సంవత్సరానికిగానూ భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జోసెఫ్ హాప్ఫీల్డ్, జెఫ్రీ ఎవరెస్ట్ హింటనల్‌కు ఈ పురస్కారం దక్కింది. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకుగానూ వీరిద్దరికి ఈ ఏడాది నోబెల్ ప్రకటిస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.కాగా గతేడాది భైతిక శాస్తంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. 1901 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. ఇక సోమవారం మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
రిల్టన్ కప్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న తమిళ కుర్రాడు
స్టాక్‌హోమ్: తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ఎం.ప్రణేశ్ భారత 79వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. స్టాక్‌హోమ్‌లో జరిగిన రిల్టన్ కప్‌లో విజేతగా నిలిచిన ప్రణేశ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు గ్రాండ్‌మాస్టర్ హోదా కూడా సాధించాడు. ఈ టోర్నీకి ముందే అతను మూడు జీఎం నార్మ్‌లు పొందగా, ఇప్పుడు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు (లైవ్) కూడా దాటాడు. ‘ఫిడే’ సర్క్యూట్లో తొలి టోర్నీ అయిన రిల్టన్ కప్‌లో ప్రణేశ్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 136 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 9 గేమ్‌లలో అతను 8 గెలిచి ఒకటి ఓడాడు. తెలంగాణకు చెందిన రాజా రిత్విక్ 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ చెస్ కోచ్ ఆర్బీ రమేశ్ వద్ద ప్రణేశ్ శిక్షణ పొందుతున్నాడు. ‘అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రణేశ్‌కు నా అభినందనలు. మంచి స్కోరుతో అతను విజేతగా నిలిచాడు. మన దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది’ అని దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పందించారు. -
నోబెల్ 2022: ఫిజిక్స్‌లో ముగ్గురికి ప్రైజ్
స్టాక్‌హోమ్: భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ఈ ప్రకటన చేసింది. భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లౌజర్, ఆంటోన్ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్ దక్కింది. చిక్కుబడ్డ ఫోటాన్లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెయిన్ ఆస్పెక్ట్ కాగా.. జాన్ ఎఫ్. క్లౌజర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇక ఆంటోన్ జెయిలింగర్ ఆస్ట్రియాకు చెందిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Physics to Alain Aspect, John F. Clauser and Anton Zeilinger. pic.twitter.com/RI4CJv6JhZ — The Nobel Prize (@NobelPrize) October 4, 2022 చిక్కుకుపోయిన క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహించారు ఈ ముగ్గురు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ ముగ్గురి సాధన ఫలితాలు.. క్వాంటం సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి అని నోబెల్ కమిటీ ప్రకటించింది. ► కిందటి ఏడాది కూడా ఫిజిక్స్‌లో ముగ్గురికే సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ► 1901 నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో నలుగురు గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడమ్ క్యూరీ(1903), మారియా జియోప్పెర్ట్ మయర్(1963), డొన్నా స్ట్రిక్‌ల్యాండ్(2018), ఆండ్రియా గెజ్(2020) ఈ లిస్ట్‌లో ఉన్నారు. ► ఇక ఫిజిక్స్‌లో చిన్నవయసులో నోబెల్ ఘనత అందుకుంది లారెన్స్ బ్రాగ్. కేవలం పాతికేళ్ల వయసుకే ఇతను 1915లో ఫిజిక్స్ నోబెల్ అందుకున్నాడు. -
ప్రపంచ సైనిక బడ్జెట్ 2 ట్రిలియన్ డాలర్లు
లండన్: ప్రపంచదేశాలు సైనికపరంగా చేస్తున్న వ్యయం మొట్టమొదటిసారిగా ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్లను మించిపోయింది. స్వీడన్‌కు చెందిన సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) ఈ మేరకు వెల్లడించింది. ఈ ఖర్చులో అమెరికా, చైనా, భారత్ టాప్ త్రీ స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ‘‘2021లో ప్రపంచ సైనిక వ్యయం 0.7% పెరిగి 2,113 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 62% వాటా అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యాలదే. అమెరికా, చైనా వాటాయే ఏకంగా 52%! 2021లో అమెరికా 801 బిలియన్ డాలర్లు, చైనా 293 బిలియన్ డాలర్లు, భారత్ 76.6 బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చించాయి. ఆసియా–ఓసియానియా ప్రాంత దేశాల సైనిక వ్యయం 586 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్–చైనాల వాటాయే ఏకంగా 63%! అయితే ఇది 2020 కంటే 1.4% తక్కువ’’ అని వెల్లడించింది. -
ఈ పడవ నీటిలోనే కాదు..గాల్లో కూడా నడుస్తుంది...!
ఔను మీరు చూసింది నిజమే...ఈ పడవ నీళ్లలోనూ గాలిలోనూ నడుస్తోంది. స్టాక్‌హోమ్‌కు చెందిన పడవల తయారీ సంస్థ కాండెలా ప్రత్యేకమైన పడవను ఆవిష్కరించింది. గత నెలలో సీ -8 ఎలక్ట్రిక్ హైడ్రోఫాయిల్ బోట్ పేరిట కాండెలా లాంచ్ చేసింది. ఈ పడవ పూర్తిగా విద్యుత్ శక్తితో నడవనుంది. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ లాంచ్ అయిన ఆరు వారాల్లో ఇప్పటికే 60 యూనిట్లకు పైగా కాండెలా విక్రయించింది. చదవండి: ఎలోన్ మస్క్ దెబ్బకు రాకెట్ వేగంతో పెరిగిన గృహ ధరలు గాల్లో ఎలా ఎగురుతుందంటే...! కాండెలా రూపొందించిన బోట్ నీటి ఉపరితలానికి కొంత ఎత్తులో హైడ్రోఫాయిల్స్ సహయంతో గాలిలో నడుస్తోంది. పడవ దిగువ భాగంలో హైడ్రోఫాయిల్స్ను ఏర్పాటు చేశారు. ఈ హైడ్రోఫాయిల్స్కు మోటార్లను అమర్చడంతో నీటి ఉపరితలం నుంచి 3 నుంచి 4 అడుగుల ఎత్తులో బోట్ ప్రయాణిస్తుంది. ఈ బోట్స్ అలలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుందని కాండెలా పేర్కొంది. పడవలో లగ్జరీ ఫీచర్లు..! ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ పూర్తిగా నలుగురు వ్యక్తులు విలాసవంతంగా ప్రయాణించవచ్చును. పడవలో సోఫాతో కూడిన దిగువ డెక్ క్యాబిన్ వంటి ఫీచర్లు మరిన్ని సౌకర్యాలతో నిండి ఉంది. ఇందులో ఉండే సోఫాను బెడ్‌గా కూడా వాడుకోవచ్చును. ప్రీమియం సౌండ్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్, 15.4-అంగుళాల హై-రిజల్యూషన్ టచ్‌స్క్రీన్‌ను క్యాబిన్లో అమర్చారు. కాండెలా రూపొందించిన సీ-8 పడవ గరిష్టంగా 30 నాట్ల వేగంతో ప్రయాణించనుంది. 45 kWh బ్యాటరీ సహాయంతో గరిష్టంగా 50 నాటికల్ మైళ్లు (92 కిమీ) ఈ పడవ ప్రయాణిస్తోంది. Just had the most amazing experience in Stockholm where @CandelaBoat let me take out one of their flying electric boats. So easy to fly, it makes me look like a pro. It doesn’t get any cooler than this! Full article and video soon on @ElectrekCo pic.twitter.com/RhrIIckYig — Micah Toll (@MicahToll) September 14, 2021 చదవండి: -
సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న అబ్దుల్ రజాక్ గుర్నా
స్టాక్‌హోమ్: సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను నోబెల్ బహుమతి వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకుగానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. (చదవండి: 2021 నోబెల్ బహుమతి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం) BREAKING NEWS: The 2021 #NobelPrize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents.” pic.twitter.com/zw2LBQSJ4j — The Nobel Prize (@NobelPrize) October 7, 2021 అబ్దుల్ రజాక్ గుర్నా.. 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్ వలసవెళ్లారు. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక 21వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు రజాక్. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 2005లో రజాక్ రాసిన ‘డిసర్షన్’ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. చదవండి: వాతావరణంపై పరిశోధనలకు పట్టం -
వాతావరణంపై పరిశోధనలకు పట్టం
స్టాక్‌హోమ్: వాతావరణం వంటి అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ అవార్డును స్యూకోరో మనాబే (90), క్లాస్ హాసెల్మాన్ (89), జియోర్గియో పరిసీ (73) అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. మానవ చర్యలు భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకునేందకు పునాదులేసినందుకు స్యూకోరో మనాబే, క్లాస్ హాసెల్‌మాన్‌లకు అవార్డులో సగభాగం నగదు బహుమతి లభించగా.. సంక్లిష్ట వ్యవస్థల్లోనూ ఒక పద్దతిని కనుక్కునేందుకు సహకరించిన జియోర్గియో పరిసికు మిగిలిన సగం నగదు దక్కనుంది. భూ వాతావరణం సంక్లిష్టమైందనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. ఎక్కడో దక్షిణ అమెరికా తీరప్రాంతంలోని సముద్ర ఉపరితల జలాలు కొంచెం వేడెక్కితే దాని ప్రభావం ఎల్‌నినో రూపంలో భారత్‌లో వ్యక్తమవుతుంది. రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతుంటాయి. సముద్రాల్లోని జల ప్రవాహాలు మొదలుకొని వాణిజ్య వాయువులు, కొండలు, గుట్టలు, ఉష్ణోగ్రతల్లో తేడాలు, జీవజాతులు, అటవీ విస్తీర్ణంలో మార్పులు ఇలా.. వందలాది అంశాల ఆధారంగా పనిచేసే వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ప్రిన్స్టన్ యూనివర్శిటీకి చెందిన స్యూకోరో మనాబే 1960లలోనే ప్రయోగాలు చేశారు. వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువైతే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయో మనాబే పరిశోధనల ద్వారా తెలిసింది. మనాబే సొంతంగా భూ వాతావరణానికి సంబంధించిన భౌతిక నమూనాలను సిద్ధం చేసి.. అందులో రేడియో ధార్మికత సమతౌల్యం, గాలి నిట్టనిలువుగా పైకి ఎలా వెళుతుంది? వంటి అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. వీటి ఫలితంగా ప్రస్తుతం వాతవరణాన్ని అంచనా వేసేందుకు అవసరమైన క్లైమెట్ మోడల్స్ సిద్ధమయ్యాయి. మనాబే పరిశోధనలు ఒకవైపున ఉంటే...పదేళ్ల తరువాత జర్మనీలోని మ్యాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీటిరియాలజీకి చెందిన క్లాస్ హాసెల్మాన్ స్థానిక వాతావరణం, ప్రపంచం మొత్తమ్మీది వాతావరణాలకు మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఓ మోడల్‌ను తయారు చేశారు. తద్వారా స్థానిక వాతావరణంలో ఎంత గందరగోళంగా ఉన్నా ప్రపంచ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో క్లైమెట్ మోడల్స్ ఎలా నమ్మదగ్గవో క్లాస్ హాసెల్మాన్ మోడల్ ద్వారా స్పష్టమైంది. ఈ పద్ధతుల వల్ల వాతావరణంలోకి కార్బన్‌డైయాక్సైడ్ ఎక్కువగా చేరడం వంటి మానవ చర్యల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోందని (భూతాపోన్నతి) రుజువు చేయడం వీలైంది. గణితం, జీవశాస్త్రం, నాడీ శాస్త్రం, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు పరిసీ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. వీటిల్లో చాలా అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒక పద్ధతిని అనుసరించకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా.. అంతర్గతంలో వాటిల్లోనూ ఒక క్రమపద్ధతి ఉంటుందని గుర్తించారు జియోర్గియో పరిసీ. వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరం: పరిసీ భూ వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్ వంటి విషవాయువుల మోతాదు పెరిగిపోవడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు మానవాళి వేగంగా.. గట్టి సంకల్పంతో తక్షణం చర్యలు చేపట్టాలని ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు అందుకున్న వారిలో ఒకరైన జియోర్గియో పరిసీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడు చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన అవార్డు ప్రకటించిన తరువాత మాట్లాడుతూ స్పష్టం చేశారు. అంతకుముందు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో నోబెల్ అవార్డు కమిటీ ప్రతినిధి గోరాన్ హాన్సన్... క్లాస్ హాసెల్మాన్, స్యూకోరో మనాబేలతోపాటు జియోర్గియో పరిసీలు ముగ్గురికి ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హాన్సన్ మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది గుర్తించిన ఆవిష్కరణలు వాతావరణానికి సంబంధించిన మన విజ్ఞానం గట్టి శాస్త్రీయ పునాదులపై ఏర్పడిందన్న విషయం స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది అవార్డు గ్రహీతలందరూ సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు సాయపడ్డవారే’ అని వ్యాఖ్యానించారు. -
కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోన్న ట్రూకాలర్..!
స్టాక్‌హోమ్: స్వీడిష్ కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీస్ మరో కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన క్లాస్ బీ షేర్లను నాస్డాక్ స్టాక్‌హోమ్‌లో లిస్ట్ చేయడానికి ప్లాన్ వేస్తోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ట్రూకాలర్ లిస్టింగ్ 2021 నాల్గో త్రైమాసికంలో పూర్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీవోలో భాగంగా 116 మిలియన్ డాలర్లను సేకరించాలని కంపెనీ యోచిస్తోంది. చదవండి: Jeff Bezos:జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ మామెడి మాట్లాడుతూ...కనీసం రెండు సంవత్సరాల పాటు ఐపీవోపై ట్రూకాలర్ పనిచేస్తోందని వెల్లడించారు. సీక్వోయా క్యాపిటల్ , అటామికో కంపెనీలు ట్రూకాలర్ ఇన్వెస్టర్లుగా నిలిచాయి. ఒక నివేదిక ప్రకారం ట్రూకాలర్ సుమారు 95 మిలియన్ డాలర్లను సేకరించింది. గత ఆరు సంవత్సరాల నుంచి పలు ఇన్వెస్టర్ల నుంచి 100 మిలియన్ డాలర్లను సేకరించడంతో ట్రూకాలర్ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల ఆక్టివ్ యూజర్లు ట్రూకాలర్ సొంతం. ఇటీవలి కాలంలో ఆపిల్, గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కాలర్ ఐడి ఫీచర్‌ను మెరుగుపరిచినప్పటికీ, స్పామ్ కాల్‌లను అరికట్టడానికి అనేక ఇతర చర్యలు తీసుకున్నప్పటికీ, ట్రూకాలర్ వాటిని పరిష్కరించలేకపోయింది. భారత్‌ను అతి పెద్ద మార్కెట్‌గా ట్రూకాలర్ పరిగణిస్తోంది. చదవండి: MediaTek : భారీ రిక్రూట్మెంట్కు ప్లాన్ చేస్తోన్న మీడియాటెక్..! -
కూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం
Sweden Plane Crash స్వీడన్లో చిన్నసైజు విమానం కూలిన దుర్ఘఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్ సహా ఎనిమిది మంది స్కై డైవర్లు ఉన్నట్లు సమాచారం. గురువారం స్టాక్‌హోంకి వంద మైళ్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్వీడన్ జాయింట్ రెస్క్యూ కో ఆర్టినేషన్ సెంటర్ ప్రతినిధులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. విమానం దిగే టైంలోనే ఘటన జరిగిందని భావిస్తున్నారు. కాగా, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్వీడన్ ప్రభుత్వం.. బాధితుల కుటుంబాలను ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 2019లో ఇలాగే ఓ చిన్న విమానం స్కై డైవర్లతో వెళ్తుండగా.. ఈశాన్య స్వీడన్‌లోని ఉమేయాలో ఘోర ప్రమాదానికి గురైంది. -
‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు
స్టాక్‌హోమ్: పెళ్లి అనేది నూరేళ్ల పంట. వివాహం అనేది ప్రతి జంట జీవితంలో ప్రత్యేకమైన రోజు. అయితే కొంతమంది కాబోయే దంపతులకు ప్రణాళిక ప్రకారమే అన్నీ జరుగుతాయా అనే ఆందోళన ఉంటే..మరికొందరు ఆనందంగా ఉంటారు. అయితే తాజాగా స్వీడన్‌కి చెందిన ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివాహ వేడుకలో పెళ్లి కొడుకు ‘క్యూబూల్ హై’( నేను అంగీకరిస్తున్నాను) అని చెప్పిన వెంటనే వధువు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆనందంతో ఎగిరి గంతేసింది. వరుడిని హత్తుకుని ముద్దు పెట్టుకుంది. కాగా ఈ వీడియోలో వివాహానికి వచ్చిన అతిథలు చుట్టూ వరుసలో కూర్చున్నారు. అయితే వధువు మొదట తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి సంశయించినా...బంధువుల ప్రోత్సాహంతో తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను ‘‘నిత్యం సంతోషంగా ఉండే భార్య’’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..15 వేల మంది నెటిజన్లు వీక్షించారు. వధువు ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నూతన వధూవరులు సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "మీ ఇద్దరికీ అభినందనలు" అంటూ వ్యాఖ్యానించారు. అయితే మరో నెటిజన్ "ఇప్పుడు రక్తం పీల్చడానికి లైసెన్స్ పొందండి." అంటూ చమత్కరించారు. View this post on Instagram A post shared by |~|@m€€[) (@romantic_cute_prince) (చదవండి: ధనవంతులు ఎక్కువగా ఇష్టపడే దేశం తెలుసా?) -
కాళరాత్రి నరకం: సజీవంగా పాతిపెట్టి..
స్టాక్‌హోమ్ : జాలి, దయ అనేవి అణువంత కూడా లేకుండా ఇద్దరు మగ పిల్లలపై అతి దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు దుండగులు. వారిని కిడ్నాప్‌చేసి, విచక్షణా రహితంగా కొట్టి, అత్యాచారం జరిపి, సజీవంగా పాతిపెట్టారు. చివరకు దుండగుల నుంచి తప్పించుకున్న పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. గత ఆగస్టు నెలలో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఫొటోలను పోలీసులు గురువారం విడుదల చేశారు. అయితే నిందితుల పేర్లను మాత్రం తెలుపలేదు. చిన్నారులను పాతి పెట్టిన గొయ్యి కేసుకు సంబంధించిన వివరాలు... ఆగస్టు 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు మగ పిల్లలు శ్మశానానికి దగ్గరలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఇద్దరు వ్యక్తులు వారిని సమీపించి డ్రగ్స్ కొంటారా అని అడిగారు. ఇద్దరు పిల్లలు వద్దని చెప్పి, అక్కడినుంచి ముందుకు సాగారు. అయితే వారిని వెంబడించిన దుండగులు కత్తితో బెదిరించి అక్కడికి దగ్గరలోని అడవిలోకి లాక్కెళ్లారు. చిన్నారుల కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకుని, ఎదురు తిరిగితే వారిని చంపుతామంటూ బెదిరించారు. విచక్షణా రహితంగా కొట్టి, శ్మశానంలోకి తీసుకెళ్లారు. అక్కడ వారి బట్టలు విప్పించారు. సెల్ఫోన్లు లాక్కొని దూరంగా పడేశారు. సంఘటనా స్థలం వద్ద చిన్నారుల దుస్తులు చివరకు వారి గొయ్యిని వారే తవ్వుకునేలా చేశారు. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఇద్దర్నీ గొయ్యిలో పాతిపెట్టారు. దుండగులు పక్కకు వెళ్లిపోయిన సమయంలో చిన్నారులు గొయ్యిలోనుంచి బయటపడి, అక్కడినుంచి తప్పించుకున్నారు. బట్టలు లేకుండా రోడ్లపై పరిగెత్తసాగారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారులు అందించిన వివరాలతో నిందితుల్ని త్వరగానే అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. -
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్ : వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్‌కు చెందిన హైకేల్ హోటాన్‌లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. హెపటైటిస్ సి వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టినందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు. హైపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని రకాల మందులు వాడడం ద్వారా సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన అరోగ్య సమస్యల్లో ఇది ఒకటి. దీని వలన ఎంతో మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జె.హార్వే, మైకేల్ హోటాన్, చార్లెస్ ఎం.రైజ్ పరిశోధన వలన సులభంగా హైపటైటిస్‌కు మందుకు కనుగొనడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలకు వైద్యులు కాపాడగల్గుతున్నారు. వైద్యరంగంలో చేసిన సేవలకు గుర్తింపుకుగాను ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని వీరికి ప్రకటించారు. -
'మా యాప్‌ను నిషేధించడం అన్యాయం'
స్టాక్‌హోమ్ : ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ యాప్ ఎంతో ఫేమస్. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్ ప్రత్యేకత. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ట్రూకాలర్ .. కాలర్ ఐడీ.. స్పామ్ డిటెక్షన్, మెసేజింగ్, ఇతర డయలర్ సేవలను అందిస్తున్నది. తాజాగా చైనాతో సరిహద్దు వివాదం తర్వాత 89 రకాల సోషల్ మీడియా యాప్‌లను బ్యాన్ చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటిలో ట్రూకాలర్ యాప్ కూడా ఒకటి. దీనిపై ట్రూ కాలర్ యాప్ యాజమన్యం గురువారం స్పందిస్తూ .. మా యాప్‌ను నిషేధించడం అన్యాయం అని పేర్కొంది. కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ను నిషేధిత దరఖాస్తుల జాబితాలో చేర్చడంపై ఆ సంస్థ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ జాబితాలో ఇప్పటికే ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ వంటి చైనీస్ యాప్ లు మాత్రమే కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, జూమ్, రెడ్డిట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉన్నాయి. జాతీయ భద్రతా సమస్యలపై ఈ యాప్‌లను తొలగించాలని భారత సైన్యం తన సిబ్బందికి సూచించింది. 'తమ సిబ్బంది కోసం భారత ఆర్మీ నిషేధించిన 89 యాప్ ల జాబితాలో ట్రూకాలర్ ఉన్నదని తెలుసుకుని నిరాశకు గురయ్యాం. ఇది చాలా అన్యాయం. ట్రూకాలర్ అనేది స్వీడన్ కేంద్రంగా పని చేస్తున్న యాప్.ట్రూకాలర్ యాప్ ను నిషేధిత యాప్ ల జాబితాలో ఉంచాడానికి ఎలాంటి కారణాలు లేవు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తాం. ట్రూకాలర్ ఇండియాలో 170 మిలియన్లకు పైగా ప్రజలకు కీలకమైన సేవలను అందిస్తున్నది. నిత్యం వందల మిలియన్ల స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించి బ్లాక్ చేస్తుంది' అని ట్రూకాలర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్ : వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు 2019 సంవత్సరానికి సంబంధించి నోబెల్ పురస్కారాలు అందుకోనున్నారు. విలియంకెలిన్, పీటర్ రాట్క్లిఫ్, గ్రెగ్ సెమెన్జాకు వైద్యరంగంలో నోబెల్ బహుమతిని నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకు వీరిని నోబెల్ వరించింది. ఆక్సిజన్‌ను కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై ఈ ముగ్గురు సాగించిన విశేష పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది. -
భారత్ వద్ద పెరుగుతున్న అణ్వాయుధాలు
స్టాక్‌హోమ్: భారత్ వద్ద అణ్వాయుధాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. చైనా, పాకిస్తాన్‌లు కూడా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలపై స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేసి సోమవారం నివేదిక విడుదల చేసింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య గతేడాది తగ్గిందని, అయితే వాటిని ఆయా దేశాలు ఆధునీకరిస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. 2019 సంవత్సరాదిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాల వద్ద మొత్తం 13,865 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 600 అణ్వాయుధాలు తగ్గాయని తెలిపింది. అదే సమయంలో చైనా, భారత్, పాకిస్తాన్‌లు ఆయుధాల సంఖ్యను పెంచుకుంటున్నాయని పేర్కొంది. ‘తక్కువే కానీ.. కొత్త ఆయుధాలను ప్రపంచం ఇప్పుడు చూస్తోంది’అని ఆ సంస్థ డైరెక్టర్ షానన్ కైల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు తగ్గడానికి కారణం అమెరికా, రష్యాలే అని చెప్పారు. ఈ రెండు దేశాలు ‘న్యూ స్టార్ట్’(స్ట్రాటెజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ) ఒప్పందంపై 2010లో సంతకం చేశాయి. దీని ప్రకారం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి నుంచి ఉన్న పాత ఆయుధాలను ఈ రెండు దేశాలు వదిలించుకుంటున్నాయి. న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు 2021 నాటికి ముగిసిపోతుందని, దీని పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1980లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అణ్వాయుధాలు ఉండేవని, దాదాపు అప్పుడు 70 వేల ఆయుధాలు ప్రపంచ దేశాల వద్ద ఉండేవని.. అప్పటి నుంచి ఆయుధాల సంఖ్య తగ్గుతూ వస్తోందని కైల్ వివరించారు. -
గోడను ఢీకొన్న ఎయిర్ఇండియా విమానం
స్టాక్‌హోమ్ : స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం ఎడమ రెక్క ఆర్లాండా విమానాశ్రయంలోని టర్మినల్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. విమానం రెక్క టర్మినల్ గోడను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుదుపుకు గురైందని, ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
నోబెల్ : 55 ఏళ్లలో ఫిజిక్స్‌లో తొలిసారి మహిళకి...
స్టాక్‌హోమ్ : 55 ఏళ్లలో తొలిసారి.. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ పురస్కారాన్ని ఓ మహిళా కూడా అందుకున్నారు. నేడు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారాన్ని లేజర్ ఫిజిక్స్‌లో సంచలనాత్మకమైన ఆవిష్కరణలు చేసినందుకు గాను, ఆర్థూర్ ఆష్కిన్‌కు, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు జెరార్డ్ మౌరో, డోన్నా స్క్రిక్లాండ్లకు సమిష్టిగా అందజేస్తున్నట్టు ‘ది రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ నేడు ప్రకటించింది. 55 ఏళ్లలో తొలిసారి ఈ పురస్కారాన్ని అందుకున్న మహిళ స్క్రిక్లాండ్. మహిళా భౌతిక శాస్త్రవేత్తలందరూ ఎంతో సంబరం చేసుకోవాల్సినవసరం వచ్చిందని, వారిలో నేను ఒకదాన్ని అని స్టాక్‌హోమ్‌లో నోబెల్ పురస్కారం ప్రకటన తర్వాత న్యూస్ కాన్ఫరెన్స్‌లో స్క్రిక్లాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిజిక్స్‌లో నోబెల్ అవార్డు అందుకున్న మహిళల్లో స్క్రిక్లాండ్ మూడో మహిళ. అంతకముందు 1903లో మేరి క్యూరికి, 1963లో మారియ గోపెర్ట్ మేయర్‌కు ఈ పురస్కారం దక్కింది. స్క్రిక్లాండ్ షేర్ చేసుకున్న శాస్త్రవేత్తలో ఆష్కిన్ది అమెరికా కాగా, మౌరు ఫ్రెంచ్కు చెందిన వారు. ఇక స్క్రిక్లాండ్ కెనడియన్ మహిళ. వీరు మొత్తం తొమ్మిది మిలియన్ల స్వీడిష్ క్రోనర్ అంటే రూ.7,34,33,374ను పొందనున్నారు. -
స్వీడన్ లో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
స్టాక్‌హోంలో స్టోర్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు స్టాక్‌హోం: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వీడన్ రాజధాని స్టాక్‌హోం శుక్రవారం సాయంత్రం ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. స్థానిక మీడియా కథనం మేరకు సెంట్రల్ స్టాక్‌హోంలోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్‌లోకి బీరు ట్రక్కు దూసుకుపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు. స్టాక్‌హోంలోని భారత్ రాయబార కార్యాలయం సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు దూసుకుపోగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, అలాగే ట్రక్కులోంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి ప్రజలపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మరోవైపు ప్రమాద స్థలం వద్ద కాల్పుల శబ్దాలు వినిపించాయని అయితే అవి ఎవరు జరిపారో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని స్వీడిష్ చానల్ ఎస్వీటీ పేర్కొంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రదాడికి పాల్పడినట్లు అనుమమానిస్తున్న వ్యక్తి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఉగ్రవాదుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారని, మరొకరు పారిపోయినట్లు కూడా మీడియా కథనాలు వెలువడ్డాయి. -
గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్కు నోబెల్ పురస్కారం!
స్టాక్‌హోమ్: 1960 నుంచి తన ప్రభావవంతమైన గీతాలతో ఒక తరానికి ప్రతినిధిగా, స్వరంగా నిలిచిన అమెరికన్ గీత రచయిత, పాటగాడు బాబ్ డిలాన్ను అత్యున్నత నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. అత్యున్నత సాహిత్య పురస్కారంగా భావించే నోబెల్ అవార్డును ఇప్పటివరకు కవులకు, రచయితలకు ఇస్తూ వస్తుండగా.. ఈసారి అనూహ్యరీతిలో సంగీత రంగానికి చెందిన గాయకుడికి ప్రకటించడం గమనార్హం. "బ్లోవిన్ ఇన్ ద విండ్', "మాస్టర్స్ ఆఫ్ వార్', "ఏ హార్డ్ రెయిన్స్ ఏ గాన్నా ఫాల్', "ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్', "సబ్టెరానియన్ హోస్సిక్ బ్లూ', "లైక్ ఏ రోలింగ్ స్టోన్' వంటి తన గీతాలతో బాబ్ డిలాన్ అసమ్మతిని, తిరుగుబాటును, స్వతంత్రకాంక్షను ప్రకటించారు. "డిలాన్లో ఒక ఐకాన్ ఉన్నారు. సమకాలీన సంగీతంపై ఆయన ప్రభావం అపారం' అని స్వీడిష్ అకాడెమీ పేర్కొంది. నోబెల్ పురస్కారం కింద డిలాన్‌కు ఎనిమిది మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (9.30లక్షల డాలర్లు.. రూ. 6.22 కోట్లు) బహుమానం లభించనుంది. 50 ఏళ్లకుపైగా కొనసాగుతున్న తన గీత ప్రస్థానంలో ఇప్పటికే డిలాన్ గీతాలు రచిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రపంచ పర్యటనలు చేపడుతున్నారు. ప్రస్తుతం జీవిస్తున్న వారిలో ఆయన అత్యున్నత కవి (గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్) అయి ఉంటారు’ అని అకాడెమీ సభ్యుడు పెర్ వాస్ట్బర్గ్ పేర్కొన్నారు. డిలాన్‌కు నోబెల్ ప్రకటించడంలో ప్యానెల్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుందని అకాడెమీ శాశ్వత కార్యదర్శి సరా డెనియస్ పేర్కొన్నారు. డైనమేట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ప్రతి సంవత్సరం విజ్ఞానం, సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసినవారికి పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. -
స్టాక్‌హోమ్ సిండ్రోమ్
అవును, అది జరిగిపోయింది. జడ్జీల నియామకానికి కొల్లీజియం వ్యవస్థ అవతరించింది. అది అత్యున్నత న్యాయస్థానంవారి ముద్దుబిడ్డ! ఆవ్యవస్థను విమర్శించాలన్నా, లోపాలు కనిపెట్టాలన్నా అది వృథా ప్రయాస. ఎందుకంటే దానిమీద అప్పీలుచేసుకునే అవకాశం లేదు. సుప్రీంకోర్టుపైన ఏ కోర్టూ లేదు. ఆ వ్యవహారం అంతటితో ఆగిపోవలసిందే! అందుకోసం అందరూ ఆ వ్యవస్థను అంగీకరించవలసిందేనన్నఅభిప్రాయానికి వచ్చినట్లు కనపడుతున్నది. అది రాజ్యాంగబద్ధంకాదని తెలిసినా చెయ్యగలిగిందేమీలేదు. తప్పదనుకున్నప్పుడు ఒప్పుకుంటే పోతుందిగదా!తప్పులున్నాయనుకుంటే సరిదిద్దుకుని వాడుకోవాలి గాని ఒద్దంటే లాభమేమిటి? చొక్కా చిరిగితే కుట్టుకుని తొడుక్కోవటం లేదూ? కొల్లీజియం విధానంలోపారదర్శకత లేదని విస్మరించలేము. ఆపారదర్శకత ఏవిధంగా సాధించాలో ఆలోచించాలి. అది విజ్ఞులైన పౌరుల లక్షణం. అందుకే న్యాయశాస్త్రపారంగతులు వివిధమార్గాలను ప్రతిపాదిస్తున్నారు. రాజ్యాంగపరంగా తమకున్న హక్కులను హరించిన కొల్లీజియంను ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అన్నిపార్టీలసహకారంతో తాము అంగీకరించి పంపిన న్యాయాధికారుల నియామక చట్టాన్ని కోర్టువారు తమ అధికారాన్ని గుర్తించలేదన్నసాకుతో కొట్టివేస్తే పార్లమెంటుకూడా సరేనని తల ఊపింది. రాజ్యాంగాన్నికాపాడి అనుసరించవలసిన బాధ్యత ఉన్నవారు ఆ రాజ్యాంగాన్ని విస్మరించి, అధిగమించి అధికారాలను చేజిక్కించుకున్నారంటే అర్థమేమిటి? రాజ్యాంగంఉన్నదెందుకు? ప్రజాస్వామ్యమంటే అర్థమేమిటి? ఐనా అన్నివ్యవస్థలుఅందుకంగీకరించిన వంటే మనం ఇప్పుడు స్టాక్‌హోమ్ సిండ్రోమ్ ప్రభావంలోఉన్నామా? అవును, అవి సిండ్రోమ్ ప్రభావ లక్షణాలే! 1973 లో ఇద్దరు సాయుధ దుండగులు స్టాక్‌హోమ్‌లో ఒక బాంకు ని దోచుకోవటానికి ప్రయత్నించారు. అక్కడున్న రక్షక సిబ్బందిని, పోలీసులను కాల్చివేశారు. నిర్భయంగా డబ్బుని దోచుకుని సంచులలో పెట్టుకున్నారు. అంతలో పోలీసు బలగాలు చేరాయి. దుండగులు డబ్బుని ప్రక్కనపెట్టి ఆత్మరక్షణకు తయారయ్యారు. బాంకు ఉద్యోగులను బందీలుగా పట్టుకుని పోలీసులు తమను కాల్చకుండా కాపాడుకున్నారు. నలుగురు ఉద్యోగులను పట్టుకుని వారిమీద తుపాకులు గురిపెట్టి, వారిని స్ట్రాంగ్ రూంలోకి నెట్టిద్వారం దగ్గర నిలుచున్నారు. పోలీసులు వారినేమీ చెయ్యగల స్థితిలోలేరు. ఆపరిస్థితి ఆరురోజులు సాగింది. బందీలు ఎక్కడ ఉన్నారో, ఏస్థితిలో ఉన్నారో తెలుసుకోవటానికి పైకప్పులో రంధ్రం చేసి చూడవలసి వచ్చింది. వారంతా ఒకమూల బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. వారిమీదకు తుపాకులు గురిపెట్టి ఉన్నవి. దుండగులను హతమార్చాలన్న విషయం ప్రక్కనపెట్టి బందీలను సురక్షితంగా బయటకు తేవటం ఎలాగన్న సమస్య పోలీసులకు వచ్చింది. వారికి ఆహారాన్ని అందించటానికి దుండగులు ఒప్పుకున్నారు. ఎదురుగా ఉన్నబందీలతో మాటకలపక తప్పలేదు. దుండగులు ఏక్షణాన్నయినా తమను కాల్చివెయ్యవచ్చునని బందీలకు భయంగానే ఉన్నది. అయినా వారేమీ చెయ్యలేదు. పైగా కబుర్లు చెపుతున్నారు. ఏదో కృతజ్ఞతా భావం తొంగిచూచింది. ఆరవరోజుకి పోలీసుల ప్లాను ఫలించింది. దుండగుల దృష్టి మళ్ళించి వారిమీద దాడిచేసి, ఆయుధాలను వదిలించి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బలప్రయోగం తప్పదుగదా! ఆరురోజులపాటు తమ సహనాన్నిపరీక్షించి, తమ సామర్థ్యాన్ని పరిహసించిన వారిమీద పోలీసులకు కసిగానే ఉంటుంది. ఆస్థితిలో బందీలుగా ఉండి విడుదలైనవారు దుండగుల మీద బలప్రయోగం చెయ్యవద్దని పోలీసులను బ్రతిమాలటం మొదలు పెట్టారు. పోలీసులకు అది అర్థం కాలేదు. తమనుబందీలుగా పట్టుకుని భయపెట్టినవారిపైన బందీలకెందుకింత సానుభూతి? మానసిక శాస్త్రజ్ఞలు దానినే "సిండ్రోమ్" అన్నారు. అది స్టాక్‌హోమ్ లో జరిగింది గనుక "స్టాక్‌హోమ్ సిండ్రోమ్" అన్నారు. ఆవిధమైన సానుభూతి కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనది ఆ పరిస్థితి నుంచి తాము తప్పించుకోలేమన్న నమ్మకం. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ప్రాణాపాయమే జరుగవచ్చు. తరువాత తమను ఏక్షణమైనా నిర్జించగలిగిన దుండగులు తమకు ఏమీ హాని కలిగించకుండా ఉండటం. తమకు కావలసిన కనీస సౌకర్యాలకు లోటులేకుండా చూసుకున్నారు. ఆ కారణంగా వారిమీద సద్భావం కలుగుతుంది. ఆ లక్షణాల సముదాయమే సిండ్రోమ్. ఇప్పుడు మనమంతా ఆవిధమైన లక్షణాలనే ప్రదర్శిస్తున్నామా? పైన చెప్పినట్లుగా, కొల్లీజియం వ్యవస్థను కాదనలేము. అది అత్యున్నత న్యాయస్థానంనిర్ణయం. అది నీకు నచ్చకపోయినా, దానిలో లోపాలున్నా నీవు చెయ్యగలిగిందేమీలేదు. ఒకవేళ దానిని అధిగమించటం కోసం పార్లమెంటు ఏదైనా చట్టం చేసినా, దానిని కోర్టు కొట్టివెయ్యవచ్చు. న్యాయాధికారుల నియామకం చట్టాన్ని ఆవిధంగానే కొట్టివేశారు - కేవలం న్యాయాధికారుల ఆధిక్యతను నిర్ద్వందంగా ఒప్పుకోవటంలేదని ఆకారణంతో ఏ చట్టాన్నైనా కొట్టివెయ్యవచ్చు.అది రాజ్యాంగ విరుద్ధమని ఎవరైనా అనుకోవచ్చు. కాని దానిని కోర్టు సమర్థించేటంత వరకు అది అనుసరణీయమే అవుతుంది. దానిని అంగీకరించవలసిందే, పాటించవలసిందే! ఇన్నిఅధికారాలున్న సుప్రీం కోర్టు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్నివిస్మరించిందని అనలేము. కొల్లీజియం నిర్ణయాలు తీసుకునే పద్ధతిని నిర్వచించేఅవకాశం ప్రభుత్వానికే ఇచ్చారు. నిజానికి కొల్లీజియం ని సృష్టించినన్యాయాధికారులకు ఆమాత్రం చేతగాక కాదు. కాని ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండాచేశారన్న నింద రాకుండా ఉండాలని ఆబాధ్యతను ప్రభుత్వానికి అప్పగించారు.ప్రభుత్వం కూడా ఆమాత్రానికే సంతోషించి విధివిధానాలను రూపొందించింది. కానిఅవేవీ కోర్టువారికి నచ్చలేదు. ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ ప్రతిష్టంభనకు కారణమేమిటి? ఎవరైనా ఒక అబద్ధం ఆడితే, దానిని కప్పిపుచ్చుకోవటానికి పదిఅబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఒకతప్పు చేస్తే, దానిని సమర్థించుకోవటంకోసం ఇంకా పది తప్పులు చెయ్యవలసి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే ఇప్పుడుజరుగుతున్నది. రాజ్యాంగాన్ని రక్షించి పాటించవలసిన వ్యవస్థ దానిని కాదని అతిక్రమించి, అందులోలేని అధికారాలను తమకుతాముగా ఆపాదించుకోవటం మౌలికమైన తప్పు. జడ్జీలనియామకంలో ప్రభుత్వం తప్పులు చేస్తున్నదని ఆ అధికారాన్ని తాములాక్కున్నారు. కాని వారుకూడా మానవ మాత్రులేగదా! అవే తప్పులు వారుకూడా చేస్తున్నారని బయటపడింది. దానిని కప్పిపుచ్చి, రాజ్యాంగసమ్మతం కాని వ్యవస్థను రక్షించటానికి న్యాయ శాస్త్రకోవిదులంతా నడుంకట్టారు. కొల్లీజియం నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలన్నారు. నిజమే. కాని ఏవిధంగా ఆపారదర్శకతను సాధించాలి? అనేదానికి రకరకాల సలహాలు చేస్తున్నారు. జడ్జీల ఖాళీలు ప్రకటించి దరఖాస్తులు స్వీకరించి పారదర్శకంగా ఎన్నుకుని ప్రకటించాలని కొందరు సూచించారు. అంటే న్యాయాధికారులనుగూడా ప్రభుత్వాధికారుల స్థాయికి దించారన్నమాట! అలాకాక కొల్లీజియం లో జరిగే సంప్రతింపులు, తర్జనభర్జనలు బహిరంగం చెయ్యాలన్నారు కొందరు. దరఖాస్తుల పరిశీలనకు అవసరమైన వ్యవస్థ ఏదీ ప్రస్తుతం కోర్టు అధీనంలో లేదుగనుక, అటువంటి కార్యదర్శక వ్యవస్థను స్థాపించి కోర్టు అధీనంలో పెట్టాలని కొందరు సూచించారు. అందులో విశ్రాంత న్యాయాధికారులే ఉండాలని కొందరు సూచించారు. ఏమిటీ సూచనలు? ఎందుకు చేస్తున్నారు? ఎక్కడికి పోతున్నాం మనం? రాజ్యాంగబద్ధం కాని ఒకవ్యవస్థను పటిష్ఠం చెయ్యటం కోసం విజ్ఞులు, న్యాయశాస్త్రవేత్తలు ఈవిధంగా పోటీపడటమేమిటి?పారదర్శకంగా ఉన్నంత మాత్రాన ఏదైనాతప్పు ఒప్పవుతుందా? 1974లో స్టాక్‌హోమ్ సిండ్రోమ్ ప్రభావం చూపే సంఘటన మరొకటి జరిగింది. నిజానికి ఈ సిండ్రోమ్ కి ఎక్కువ ప్రచారం వచ్చింది ఈసంఘటన కారణంగానే! కాలిఫోర్నియా లోపత్రికారంగానికి అధికారులైన కుటుంబానికి వారసురాలైన ఒక అమ్మాయిని -సింబయోనియన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక ఉగ్రవాద సంస్థ అపహరించుకు పోయింది. బందీగా ఉన్న ఆ అమ్మాయికి కావలసిన అన్ని సౌకర్యాలూ అమర్చారు. తోడుగా ఉండటానికి సమవయస్కుడైన ఒక యువకుడి గూడా ఇచ్చారు. దానికి తోడు తమ ఆదర్శాలను వివరించారు. తాము దుండగులం కాదనీ, బీదలకోసం దోపిడీలు చేసి పంచి పెడుతున్నామని వివరించారు. అందుకు ఉదాహరణగా పత్రికాధిపతులను ప్రతిదినము బీదలకు అన్నదానం చెయ్యవలసిందిగా ఆదేశించటాన్ని చూపించారు. ఆ అమ్మాయికి వారిపట్ల సానుభూతి కలిగింది. తరువాత జరిగిన దోపిడీలలో ఆమె కూడా పాలుపంచుకున్నది. అది చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆతరువాత జరిగిన ఒక దోపిడిలో వారిని పట్టుకున్నారు. ఆ అమ్మాయిని కుటుంబానికి అప్పగించారు. అయినా ఆమె తనను అపహరించినవారినే ఆదర్శం గా వాదించేది. కాని కొన్నాళ్ళకు ఆపద్ధతిలోని దుష్ప్రభావాలను గుర్తించి విమర్శించటం మొదలు పెట్టింది. అంటే సిండ్రోమ్ ప్రభావం నుంచి బయటపడిందన్న మాట! ఆవిధంగా బయటపడటం సంభవమేనని సూచించింది. ఒక దుశ్చర్య చేసినవారు తమను సానుభూతితో చూచినంత మాత్రాన ఆ దుశ్చర్యను సమర్థించవలసిన అవసరం లేదని గ్రహించటం సంభవమేనని అవగాహన అయింది. దాదాపు ఇరవైఏళ్ళుపైగా కొల్లీజియం వ్యవస్థ అమలులో ఉన్నది. దానికి అందరూ అలవాటుపడి పోయారు. అది రాజ్యాంగబద్ధమైన విధానం కాదన్న విషయం మరచిపోయారు. కొల్లీజియం లో సభ్యుడైన ఒక న్యాయమూర్తి అందులోని లోపాలను ఎత్తిచూపిన తరువాతగూడా, అందులోని మౌలిక లోపాన్ని గురించి ఆలోచించకుండా దానిని ఏవిధంగా సమర్థించాలనే ఆలోచిస్తున్నారు. అలాకాక, మౌలికలోపాన్ని గుర్తించి, సవరించటానికి ఇది మంచి అవకాశంగా భావించి తగిన చర్యలు తీసుకోవటం అవసరం. అది అత్యున్నతన్యాయస్థాన నిర్ణయం గనుక సవరించేదారిలేదని సందేహించవలసిన అవసరంలేదు. విశ్రాంత న్యాయమూర్తి కె.టి.థామస్ వంటి వారు దారి చూపించారు. జడ్జీలనియామకానికి ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొట్టివెయ్యటం సమంజసం కాదని, ఆనిర్ణయాన్ని సుప్రీం కోర్టు తిరిగి పరిశీలించి సరిదిద్దవచ్చునని సూచించారు. కోర్టువారు అది ప్రతిష్ఠాభంగం అనుకోకుండా ఆసలహాను పాటించి ఈ ప్రతిష్ఠంభన నుంచి, రాజ్యాంగబద్ధం కాని పరిస్థితినుంచి దేశాన్నిరక్షించగలరని ఆశించవచ్చు. ప్రభుత్వము, పార్లమెంటు కూడా తమ రాజ్యాంగబద్ధమైనబాధ్యతలను, అధికారాలను విస్మరించకుండా, సక్రమంగా పాటించటం అవసరం. జాస్తి జవహర్లాల్ -
పరివర్తనే ప్రగతికి మెట్టు
శిక్షణతోనే ట్రాఫిక్ ప్రమాదాలకు చెక్ ఏడాదిలో నగర వ్యాప్తంగా 12 టీటీపీలు బేగంపేట టీటీపీ ప్రారంభంలో కొత్వాల్ వెల్లడి ‘స్టాక్ హోమ్’ స్ఫూర్తితో ముందుకు: ట్రాఫిక్ చీఫ్ సిటీబ్యూరో: భాగ్యనగరం విశ్వనగరి దిశగా అడుగులు వేస్తోంది. నిత్యం ప్రజా జీవనం వేగంగా పరుగులు తీస్తోంది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది వస్తూపోతుంటారు. అందమైన ఈ సిటీలో అందరినీ వేధించే సమస్య.. ‘ట్రాఫిక్’. గజిబిజి రోడ్లపై ఇష్టానుసారం దౌడుతీసే వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మానసికంగాను, శారీరకంగాను ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రగతి సాధ్యమని, అందుకు శిక్షణ అవసరమని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్సార్) కింద హీరో మోటోకార్ప్ బేగంపేటలో ఉన్న టీటీపీను అభివృద్ధి చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన దీన్ని మంగళవారం కొత్వాల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఏడాది కాలంలో నగర వ్యాప్తంగా మరో 12 ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కులు (టీటీపీ) అందుబాటులోకి తెస్తాం. రెండేళ్లల్లో నగర వ్యాప్తంగా కాప్ లెస్ జంక్షన్లను అమలు చేయనున్నాం. దీనికోసం సిటీలోని వాహనచోదకుల్లో క్రమశిక్షణను పెంచాలి. అందుకు టీటీపీలు ఉపయుక్తంగా ఉంటాయి. వాహనచోదకులు బయలుదేరే ముందే ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ స్థితిగతులను తెలుసుకుని, అనువైన మార్గం ఎంచుకోవడం కోసం మొబైల్ యాప్స్ అందుబాటులోకి తెచ్చాం. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) అమలును ప్రారంభించాం. రహదారుల్లో వాహనచోదకుల ప్రరివర్తనే ఆ దేశ క్రమశిక్షణకు నిదర్శనం’ అన్నారు. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంపొందించడానికి కాప్‌లెస్ జంక్షన్లు తీసుకువస్తున్నామన్నారు. ఇవి విజయవంతం కావాలంటే యువత, విద్యార్థుల్లో క్రమ శిక్షణను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. స్టాక్‌హోమ్ తరహాలో.. కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ చీఫ్ జితేందర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నగరంలో ఏటా ప్రతి లక్ష మందికి ఐదుగురు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఈ సంఖ్య బెంగళూరులో 8.2, చెన్నైలో 29గా ఉంది. స్టాక్ హోమ్ నగరంలో 0.7గా నమోదైంది. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని, నగరంలోనూ రోడ్డు ప్రమాదాలు, మరణాలు నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హీరో మోటోకార్ప్‌కు చెందిన మహేష్, విజయ్ సేఠి మాట్లాడుతూ.. 1989లో పబ్లిక్ గార్డెన్స్‌లో చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్క్‌ను తమ సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. అదే తరహాలో ఆయా పోలీసు విభాగాలతో కలిసి రూర్కెలా, ఢిల్లీ, లక్నో, గుర్గావ్లోనూ టీటీపీలు అభివృద్ధి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ-1 ఎల్ఎస్ చౌహాన్, అదనపు డీసీపీ సుంకర సత్యనారాయణ సహా పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. బేగంపేట టీటీపీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ) ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాసులును కొత్వాల్ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ట్రాక్‌పై శిక్షణ ప్రత్యేకం ద్విచక్ర వాహనాలు నడపటం, అందులో మెలకువలు నేర్చుకోవడానికి ఉపయుక్తంగా హీరో మోటోకార్ప్ టీటీపీని అభివృద్ధి చేసింది. దీని సేవల్ని ఎవరైనా ఉచితంగా వినియోగించుకోవచ్చు. రసూల్‌పురా చౌరస్తాలోని బేగంపేట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పక్కన నిరుపయోగంగా ఉన్న స్థలంలో ఒక్క చెట్టూ తొలగించకుండా ఈ ట్రాక్స్‌ను డిజైన్ చేశారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలూ (వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) తవ్వారు. సదరు సంస్థ కేవలం టీటీపీని అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడకు వచ్చే వారికి శిక్షణ ఇచ్చేందుకు నిపుణుల్నీ నియమించింది. ఈ టీటీపీలో ఉన్న ప్రత్యేకతలు ఇలా... బైక్ సిమ్యులేటర్ డ్రైవింగ్‌తో ఏమాత్రం పరిచయం లేనివారికి తొలుత ఈ సిమ్యులేటర్‌పై శిక్షణ ఇస్తారు. ద్విచక్ర వాహనం మాదిరిగా ఉంటుంది. ముందు మూడు కంప్యూటర్ తెరలతో ఉండే ఈ పరికరం వినియోగిస్తున్నప్పుడు రహదారిపై వెళుతున్న భావనే కలుగుతుంది. చుట్టుపక్కల వాహనాలు వెళ్తున్నట్టు, ట్రాఫిక్ సిగ్నల్స్, స్టాప్లైన్స్ అన్నీ కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. ఈ సిమ్యులేటర్‌ను వినియోగిస్తూ వాహనచోదకుడు యాక్సిడెంట్ చేస్తే.. ఆ దృశ్యాలన్నీ రికార్డు అవుతాయి. తద్వారా తాను చేసిన పొరపాటు ఏంటి? ఏ విధంగా ప్రమాదానికి కారణమైంది? తదితర అంశాలు మళ్లీ చూడవచ్చు. ఈ సిమ్యులేటర్ ద్వారా ఓ వ్యక్తికి 10 శాతం డ్రైవింగ్ వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. అనుభవం ద్వారా మరో 10 శాతం డ్రైవింగ్ నేర్చుకోవాలని భావించి టీటీపీకి వచ్చేవారికి థియరీని సైతం బోధించడానికి ప్రత్యేక ట్రైనింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇందులో తెరపై వివిధ ట్రాఫిక్ అంశాలపై అవగాహన కల్పిస్తూ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శిస్తారు. దీంతోపాటు రోడ్ సైన్స్, రహదారి నిబంధనలు, డ్రైవింగ్‌లో కచ్చితంగా పాటించాల్సిన అంశాలను బోధిస్తారు. సిమ్యులేటర్ మాదిరిగానే ఈ థియరీ సైతం మరో 10 శాతం డ్రైవింగ్‌ను నేర్పుతుంది. సిమ్యులేటెడ్ నారో ట్రాక్.. సన్నగా, అవసరమైన మేర వెడల్పు లేని రహదారుల్లోనే వాహనచోదకులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతుంటారు. డ్రైవింగ్ నేర్పే సందర్భంలోనే వాహనచోదకులకు ఇరుకైన రోడ్లలోనూ వాహనాలు నడపటం ఎలా? అనేది నేర్పడానికి అనువుగా ఇక్కడ ‘నారో ట్రాక్’ ఏర్పాటు చేశారు. దీన్ని సిమ్యులేటెడ్ నారో ట్రాక్‌గా పిలుస్తారు. ఇనుముతో చేసిన 15 మీటర్ల పొడవుతో ఉండే ఈ సన్నటి ట్రాక్‌పై వాహనం నడిపించి.. ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో నేర్పుతారు. లోపాలు చెప్పే ‘డబుల్ ఎయిట్’ ఆర్టీఏ ద్వారా లెర్నింగ్ లెసైన్స్ (ఎల్ఎల్ఆర్) తీసుకున్న తర్వాత ట్రాక్‌లో నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలకు వెళ్లినప్పుడు అక్కడ వాహనచోదకుడు ‘ఎనిమిది ఆకారం’లో ఉండే స్థలంలో బండిని నడపాల్సి ఉంటుంది. సదరు డ్రైవర్‌కు వాహనం నడపడంపై ఉన్న పట్టును తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. బేగంపేట టీటీపీలో దేశంలో తొలిసారిగా ‘డబుల్ ఎయిట్’ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇందులో ‘ఎనిమిదికి’ అదనంగా మరో ‘సున్నా’ ఆకారం చేరుతుంది. ఫలితంగా డ్రైవింగ్‌పై డ్రైవర్‌కు ఉన్న పట్టును మరింత పక్కాగా గణించి, లోపాలు సరిచేసే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 11 మీటర్ల పరిధితో దీన్ని ఏర్పాటు చేశారు.