ఔను మీరు చూసింది నిజమే...ఈ పడవ నీళ్లలోనూ గాలిలోనూ నడుస్తోంది. స్టాక్‌హోమ్‌కు చెందిన పడవల తయారీ సంస్థ కాండెలా ప్రత్యేకమైన పడవను ఆవిష్కరించింది. గత నెలలో సీ -8 ఎలక్ట్రిక్ హైడ్రోఫాయిల్ బోట్ పేరిట కాండెలా లాంచ్ చేసింది. ఈ పడవ పూర్తిగా విద్యుత్ శక్తితో నడవనుంది. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ లాంచ్ అయిన ఆరు వారాల్లో ఇప్పటికే 60 యూనిట్లకు పైగా కాండెలా విక్రయించింది.
చదవండి: ఎలోన్ మస్క్ దెబ్బకు రాకెట్ వేగంతో పెరిగిన గృహ ధరలు
గాల్లో ఎలా ఎగురుతుందంటే...!
కాండెలా రూపొందించిన బోట్ నీటి ఉపరితలానికి కొంత ఎత్తులో హైడ్రోఫాయిల్స్ సహయంతో గాలిలో నడుస్తోంది. పడవ దిగువ భాగంలో హైడ్రోఫాయిల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ హైడ్రోఫాయిల్స్‌కు మోటార్లను అమర్చడంతో నీటి ఉపరితలం నుంచి 3 నుంచి 4 అడుగుల ఎత్తులో బోట్ ప్రయాణిస్తుంది. ఈ బోట్స్ అలలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుందని కాండెలా పేర్కొంది.
పడవలో లగ్జరీ ఫీచర్లు..!
ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ పూర్తిగా నలుగురు వ్యక్తులు విలాసవంతంగా ప్రయాణించవచ్చును. పడవలో సోఫాతో కూడిన దిగువ డెక్ క్యాబిన్ వంటి ఫీచర్లు మరిన్ని సౌకర్యాలతో నిండి ఉంది. ఇందులో ఉండే సోఫాను బెడ్‌గా కూడా వాడుకోవచ్చును. ప్రీమియం సౌండ్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్, 15.4-అంగుళాల హై-రిజల్యూషన్ టచ్‌స్క్రీన్‌ను క్యాబిన్‌లో అమర్చారు. కాండెలా రూపొందించిన సీ-8 పడవ గరిష్టంగా 30 నాట్ల వేగంతో ప్రయాణించనుంది. 45 kWh బ్యాటరీ సహాయంతో గరిష్టంగా 50 నాటికల్ మైళ్లు (92 కిమీ) ఈ పడవ ప్రయాణిస్తోంది.
Just had the most amazing experience in Stockholm where @CandelaBoat let me take out one of their flying electric boats. So easy to fly, it makes me look like a pro. It doesn’t get any cooler than this! Full article and video soon on @ElectrekCo pic.twitter.com/RhrIIckYig
— Micah Toll (@MicahToll) September 14, 2021
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment