Boats manufacturing
-
ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు!
నాటు పడవలు నడపాలంటే, తెడ్లు వేయాలి. మరపడవలు నడపాలంటే, ఇంధనం కావాలి. ఎలక్ట్రిక్ పడవలను నడపాలంటే, రీచార్జబుల్ బ్యాటరీలు కావాలి. ఈ పడవను నడపాలంటే, ఎండ చాలు. ఇది పూర్తిగా సౌరశక్తితో నడిచే పడవ. దీని పైకప్పు మీద అమర్చిన సౌరఫలకాలు ఇందులోని 200 వాట్ల విద్యుత్తును నిరంతరం బ్యాటరీకి చార్జ్ చేస్తుంటాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 1.3 కిలోవాట్లు. కాబట్టి పొద్దుగూకినా, ప్రయాణానికి ఇబ్బందేమీ ఉండదు. పదిహేనుడు అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉండే ఈ పడవలో ఆరుగురు వరకు ఏకకాలంలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. నదులు, సరస్సుల్లో విహారయాత్రలకు పూర్తిగా అనువుగా ఉండే ఈ పడవ గంటకు ఆరు నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అమెరికన్ కంపెనీ ‘గోసన్’ ఇటీవల ఈ సోలార్ పడవను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులోని హంగులు సౌకర్యాలను బట్టి దీని ధర 7,950 నుంచి 12,750 డాలర్ల వరకు (రూ.6.60 లక్షల నుంచి 10.59 లక్షల వరకు) ఉంటుంది. (చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...) -
ఈ పడవ నీటిలోనే కాదు..గాల్లో కూడా నడుస్తుంది...!
ఔను మీరు చూసింది నిజమే...ఈ పడవ నీళ్లలోనూ గాలిలోనూ నడుస్తోంది. స్టాక్‌హోమ్‌కు చెందిన పడవల తయారీ సంస్థ కాండెలా ప్రత్యేకమైన పడవను ఆవిష్కరించింది. గత నెలలో సీ -8 ఎలక్ట్రిక్ హైడ్రోఫాయిల్ బోట్ పేరిట కాండెలా లాంచ్ చేసింది. ఈ పడవ పూర్తిగా విద్యుత్ శక్తితో నడవనుంది. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ లాంచ్ అయిన ఆరు వారాల్లో ఇప్పటికే 60 యూనిట్లకు పైగా కాండెలా విక్రయించింది. చదవండి: ఎలోన్ మస్క్ దెబ్బకు రాకెట్ వేగంతో పెరిగిన గృహ ధరలు గాల్లో ఎలా ఎగురుతుందంటే...! కాండెలా రూపొందించిన బోట్ నీటి ఉపరితలానికి కొంత ఎత్తులో హైడ్రోఫాయిల్స్ సహయంతో గాలిలో నడుస్తోంది. పడవ దిగువ భాగంలో హైడ్రోఫాయిల్స్ను ఏర్పాటు చేశారు. ఈ హైడ్రోఫాయిల్స్కు మోటార్లను అమర్చడంతో నీటి ఉపరితలం నుంచి 3 నుంచి 4 అడుగుల ఎత్తులో బోట్ ప్రయాణిస్తుంది. ఈ బోట్స్ అలలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుందని కాండెలా పేర్కొంది. పడవలో లగ్జరీ ఫీచర్లు..! ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ పూర్తిగా నలుగురు వ్యక్తులు విలాసవంతంగా ప్రయాణించవచ్చును. పడవలో సోఫాతో కూడిన దిగువ డెక్ క్యాబిన్ వంటి ఫీచర్లు మరిన్ని సౌకర్యాలతో నిండి ఉంది. ఇందులో ఉండే సోఫాను బెడ్‌గా కూడా వాడుకోవచ్చును. ప్రీమియం సౌండ్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్, 15.4-అంగుళాల హై-రిజల్యూషన్ టచ్‌స్క్రీన్‌ను క్యాబిన్లో అమర్చారు. కాండెలా రూపొందించిన సీ-8 పడవ గరిష్టంగా 30 నాట్ల వేగంతో ప్రయాణించనుంది. 45 kWh బ్యాటరీ సహాయంతో గరిష్టంగా 50 నాటికల్ మైళ్లు (92 కిమీ) ఈ పడవ ప్రయాణిస్తోంది. Just had the most amazing experience in Stockholm where @CandelaBoat let me take out one of their flying electric boats. So easy to fly, it makes me look like a pro. It doesn’t get any cooler than this! Full article and video soon on @ElectrekCo pic.twitter.com/RhrIIckYig — Micah Toll (@MicahToll) September 14, 2021 చదవండి: -
డిక్సన్ టెక్- ఐడీఎఫ్సీ ఫస్ట్.. భల్లేభల్లే
ముంబై, సాక్షి: బుధవారం 10 రోజుల ర్యాలీకి బ్రేక్ పడినప్పటికీ తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా వైట్ గూడ్స్ కాంట్రాక్ట్ తయారీ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్, ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. డిక్సన్ టెక్నాలజీస్ బోట్ బ్రాండ్ కంపెనీ ఇమేజిన్ మార్కెటింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌తో ట్విన్ వైర్లెస్ స్పీకర్ల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డిక్సన్ టెక్నాలజీస్ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో వీటిని తయారు చేయనున్నట్లు వెల్లడించింది. మరోవైపు సొంత అనుబంధ సంస్థ ప్యాడ్గెట్ ఎలక్ట్రానిక్స్ ద్వారా మోటరోలాతోనూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా మోటరోలా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. ప్యాడ్గెట్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వ పీఎల్ పథకానికి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డిక్సన్ టెక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6.2 శాతం జంప్‌చేసి రూ. 15,345కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.4 శాతం లాభపడి రూ. 15,220 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 75 శాతం ర్యాలీ చేయడం విశేషం! చదవండి: (ఆన్లైన్ బ్రాండ్ బోట్‌కు భారీ నిధులు) ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) మూడో త్రైమాసికంలో రిటైల్ రుణాలలో 24 శాతం వృద్ధితో రూ. 66,635 కోట్లకు చేరినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ వెల్లడించింది. వెరసి క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో ఫండెడ్ ఆస్తులు(రుణాలు) 0.7 శాతం పెరిగి రూ. 1.1 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది. పీఎస్ఎల్ కొనుగోళ్లతో కలిపి రిటైల్ ఫండెడ్ అసెట్స్ వాటా 64 శాతానికి చేరినట్లు వెల్లడించింది. మొత్తం డిపాజిట్లు 41 శాతం పెరిగి రూ. 77,289 కోట్లకు చేరగా.. వీటిలో రిటైల్ విభాగం 100 శాతం జంప్‌చేసి రూ. 58,435 కోట్లను తాకినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 44.35 వద్ద ట్రేడవుతోంది. తద్వారా గత జనవరి 20న సాధించిన ఏడాది గరిష్టం రూ. 45.5కు చేరువైంది. చదవండి: (టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు) -
వినూత్న పడవను తయారు చేసిన సిద్దిపేట వాసి!
సాక్షి, సిద్దిపేట: ప్రతిభకు పేదరికం అడ్డుకాదు. చేయాలనే తపన ఉండాలే కానీ ఏది అసాధ్యం కాదు. కొంత ఆవిష్కరణలు ఎన్నో సృష్టించవచ్చు. సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల శంకర్ సాదాసీదా మెకానిక్. మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన ఇతనికి తమ కులవృత్తుల వారికి ఏదో చేయాలనే ఆలోచన తట్టింది. తనకున్న అనుభవంతో ప్రతిభకు పదును పెట్టి చేపలు పట్టేందుకు వినూత్నంగా పడవ తయారు చేశాడు. పాత బైక్ హ్యాండిల్, ఇంజిన్, ఫ్యాన్ రెక్కలతో నీళ్లలో తిరుగుతూ చేపలు పట్టేందుకు వీలుగా బోట్‌ను తయారు చేశాడు. చదవండి: అతడికి ఏమైంది..? -
బోట్ తయారీ కేంద్రంగా బందరు
గిలకలదిండిలో బోట్ తయారీ నిపుణులు వంద సంవత్సరాలుగా ఈ రంగంలోనే.. ఈ సంవత్సరం మూడు బోట్ల తయారీ పోర్టు నేపథ్యంలో మత్స్యకారుల్లో ఆశలు సరకుల రవాణా పెరుగుతుందన్న అంచనా బోట్ల తయారీ రంగంలోనే ఉన్నారు. కొన్ని కుటుంబాలు వారసత్వంగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాయి. గతంలో బోల్టులు లేనందున రివిట్మెంట్ ద్వారా బోట్లను నిర్మించేవారు. రివిట్మెంట్ రంగంలో స్థానికులు ఆరితేరిన వారు. ప్రస్తుతం బోల్టులతో బోట్లు తయారుచేస్తున్నారు. ప్రస్తుతం గిలకలదిండికి ఇతర జిల్లాలవారు వచ్చి చెక్క బోట్లు తయారు చేయించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో 14 బోట్లు ఇక్కడ తయారయ్యాయి. ఒక్క బోటు తయారు చేయాలంటే 50 మంది నిపుణులు మూడు నెలలపాటు కష్టపడాల్సి ఉంటుంది. బోటు తయారీకి చెక్కతో పాటు ఫైబర్, రజన, మ్యాట్‌ను ఉపయోగిస్తారు. కాకినాడ ప్రాంతంలో చేపల వేట చేసే మత్స్యకారులు కూడా గిలకలదిండిలోనే బోట్లు చేయించుకుంటారు. బోట్లు రెండు రకాలు బోట్లను ఫైబర్, చెక్కతో రెండు రకాలుగా తయారుచేస్తారు. ఫైబర్ బోట్లు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకే (వలలు కలుపుకొని) ఈ బోటు తయారవుతుంది. చెక్క బోటు కంటే ఇది చిన్నది. ఈ బోటు ద్వారా చేపల వేట చేసేవారు తెల్లవారు జామున మూడు గంటలకు సముద్రంలోకి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తారు. చెక్కబోటు తయారీకి ఉపయోగించే పాచి కర్ర (కలప)ను శ్రీకాకుళం నుంచి, ఇతర వస్తువులను కేరళ నుంచి తెప్పిస్తారు. అప్పుడప్పుడు సముద్రంలో కొట్టుకువచ్చే గుగ్గిలం కర్రను కూడా వాడతారు. పాచి కర్ర వెల అడుగు రూ.300 వరకు ఉంటుంది. ఈ కలప తేలికగా, మంచి నాణ్యతతో ఉంటుంది. గుగ్గిలం కర్ర మరింత నాణ్యంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో దొరకదు. ఒక్క బోటు తయారీకి కనీసంగా వెయ్యి అడుగుల కర్ర కావాలి. బోటు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధం కావాలంటే మొత్తం రూ.80 లక్షల వరకు ఖర్చవుతుంది. బోటు తయారీలోనే వలల ఖర్చు కలుపుతున్నారు. వలలు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతాయి. చెక్కబోటులో చేపల వేటకు వెళ్లేవారు నాలుగు నుంచి పది రోజుల పాటు సముద్రంలోనే ఉంటారు. బోటులోనే వంట చేసుకునే సదుపాయం ఉంటుంది. తయారు చేయించేది వ్యాపారులే... సముద్రంలో చేపల వేట చేసే బోట్లను తయారు చేయించేది వ్యాపారులే. అన్ని హంగులతో తయారైన బోటును మత్స్యకారులకు అద్దెకు ఇస్తారు. నాలుగు నుంచి ఎనిమిది మంది ఒక బోటులో వేటకు వెళ్లొచ్చు. ఈ ఏడాది తమ గ్రామంలో మత్స్యకారులకు 14 బోట్లు తయారు చేసి ఇచ్చామని బోటు తయారుదారు కొక్కిలిగడ్డ నాగాంజనేయులు తెలిపారు. రోజు కూలీ రూ.500 వస్తుందని వివరించారు. పోలాటితిప్ప కాలువను మరమ్మతు చేయాలి ప్రస్తుతం మత్స్యకారులు బోట్లను పోలాటితిప్ప కాలువలో లంగరేస్తున్నారు. కాలువకు ఇరువైపులా మంచి రివిట్మెంట్ కట్టిస్తే బోట్ల నుంచి సరకును దించుకునేందుకు కూడా వీలుగా ఉంటుందని, స్థానికులు కూడా ఇక్కడికొచ్చి చేపలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఎగుమతి దారుల కంపెనీలు ఈ దారిలోనే ఉన్నాయని, వారి గోడౌన్లు సమీపంలోనే ఉన్నందున కాలువను బాగుచేసి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.