
సాక్షి, సిద్దిపేట: ప్రతిభకు పేదరికం అడ్డుకాదు. చేయాలనే తపన ఉండాలే కానీ ఏది అసాధ్యం కాదు. కొంత ఆవిష్కరణలు ఎన్నో సృష్టించవచ్చు. సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన ఎడ్ల శంకర్ సాదాసీదా మెకానిక్. మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన ఇతనికి తమ కులవృత్తుల వారికి ఏదో చేయాలనే ఆలోచన తట్టింది. తనకున్న అనుభవంతో ప్రతిభకు పదును పెట్టి చేపలు పట్టేందుకు వినూత్నంగా పడవ తయారు చేశాడు. పాత బైక్ హ్యాండిల్, ఇంజిన్, ఫ్యాన్ రెక్కలతో నీళ్లలో తిరుగుతూ చేపలు పట్టేందుకు వీలుగా బోట్‌ను తయారు చేశాడు.
చదవండి: అతడికి ఏమైంది..?