నాటు పడవలు నడపాలంటే, తెడ్లు వేయాలి. మరపడవలు నడపాలంటే, ఇంధనం కావాలి. ఎలక్ట్రిక్ పడవలను నడపాలంటే, రీచార్జబుల్ బ్యాటరీలు కావాలి. ఈ పడవను నడపాలంటే, ఎండ చాలు. ఇది పూర్తిగా సౌరశక్తితో నడిచే పడవ. దీని పైకప్పు మీద అమర్చిన సౌరఫలకాలు ఇందులోని 200 వాట్ల విద్యుత్తును నిరంతరం బ్యాటరీకి చార్జ్ చేస్తుంటాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 1.3 కిలోవాట్లు. కాబట్టి పొద్దుగూకినా, ప్రయాణానికి ఇబ్బందేమీ ఉండదు.
పదిహేనుడు అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉండే ఈ పడవలో ఆరుగురు వరకు ఏకకాలంలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. నదులు, సరస్సుల్లో విహారయాత్రలకు పూర్తిగా అనువుగా ఉండే ఈ పడవ గంటకు ఆరు నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అమెరికన్ కంపెనీ ‘గోసన్’ ఇటీవల ఈ సోలార్ పడవను మార్కెట్‌లోకి తెచ్చింది. ఇందులోని హంగులు సౌకర్యాలను బట్టి దీని ధర 7,950 నుంచి 12,750 డాలర్ల వరకు (రూ.6.60 లక్షల నుంచి 10.59 లక్షల వరకు) ఉంటుంది.
(చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...)
Comments
Please login to add a commentAdd a comment