
స్టాక్‌హోమ్ : వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్‌కు చెందిన హైకేల్ హోటాన్‌లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. హెపటైటిస్ సి వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టినందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు.
హైపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని రకాల మందులు వాడడం ద్వారా సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన అరోగ్య సమస్యల్లో ఇది ఒకటి. దీని వలన ఎంతో మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జె.హార్వే, మైకేల్ హోటాన్, చార్లెస్ ఎం.రైజ్ పరిశోధన వలన సులభంగా హైపటైటిస్‌కు మందుకు కనుగొనడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలకు వైద్యులు కాపాడగల్గుతున్నారు. వైద్యరంగంలో చేసిన సేవలకు గుర్తింపుకుగాను ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని వీరికి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment