
స్టాక్‌హోమ్ : వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు 2019 సంవత్సరానికి సంబంధించి నోబెల్ పురస్కారాలు అందుకోనున్నారు. విలియంకెలిన్, పీటర్ రాట్‌క్లిఫ్, గ్రెగ్ సెమెన్జాకు వైద్యరంగంలో నోబెల్ బహుమతిని నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకు వీరిని నోబెల్ వరించింది. ఆక్సిజన్‌ను కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై ఈ ముగ్గురు సాగించిన విశేష పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది.