noble prize
-
అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
డారన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ. రాబిన్సన్లకు 2024 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వీరు ''సంస్థలు ఏవిధంగా ఏర్పాటవుతాయి, అవి ప్రజా శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి'' అనే అంశం మీద చేసిన పరిశోధనలకు ఈ బహుమతి లభించింది.ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ ప్రైజ్.. ఆల్ప్రైడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అందిస్తారు. ఈ బహుమతులను ప్రతి ఏటా డిసెంబర్ 10న గ్రహీతలకు అందిస్తారు. ఇప్పటికే భౌతిక, రసాయన, సాహిత్య, వైద్య రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఇప్పుడు తాజాగా అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం ముగ్గురుకి నోబెల్ ప్రైజ్ అందిస్తున్నట్లు వెల్లడించారు.BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Daron Acemoglu, Simon Johnson and James A. Robinson “for studies of how institutions are formed and affect prosperity.”… pic.twitter.com/tuwIIgk393— The Nobel Prize (@NobelPrize) October 14, 2024 -
మైక్రోఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు 'వైద్య' నోబెల్
-
రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్
-
ముగ్గురికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోం: కనీస వేతనాల పెంపుదల ఫలితాలను విశ్లేషించిన అమెరికాకు చెందిన డేవిడ్ కార్డ్‌కు ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్ బహుమతి లభించింది. మరో ఇద్దరు ఆర్థికవేత్తలతో కలిసి ఆయన ఈ బహుమతిని పంచుకోనున్నారు. కార్డ్‌తో పాటు అమెరికాకే చెందిన జాషువా ఆంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. బహుమతి మొత్తంలో సగాన్ని డేవిడ్ కార్డ్‌కు, మిగతా సగాన్ని జాషువా, గైడోకు అందజేస్తారు. లేబర్ మార్కెట్, వలసలు, విద్యపై కనీస వేతనాల ప్రభావాన్ని కార్డ్ విశ్లేషించారు. అలాగే ఆర్థిక శాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. సామాజికంగా ఎదురయ్యే పలు ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధానమివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్, జాషువా, ఇంబెన్స్ రుజువు చేశారని అకాడమీ ప్రశంసించింది. వీరు ఆవిష్కరించిన ‘సహజ ప్రయోగాలు’.. వాస్తవ జీవిత పరిస్థితులు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని పేర్కొంది. కనీస వేతనాల పెంపుతో ఉద్యోగాల్లోసైతం పెరుగుదల నమోదైందని అమెరికాలో డేవిడ్ కార్డ్ చేసిన అధ్యయనంతో తెలియవచ్చింది. సామాజిక శాస్త్రంలోని కార్యకారణ ప్రభావంతో సామాజిక శాస్త్రంలోని పెద్ద సమస్యలకు సైతం పరిష్కారాలు లభిస్తాయనే విషయాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు నిరూపించారని నోబెల్ అకాడమీ పేర్కొంది. గత ఏడాది అర్థిక శాస్త్రంలో పాల్ ఆర్.విుల్‌గ్రామ్, రాబర్ట్ బి.విల్సన్ సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నారు. చదవండి: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! ఏమిటీ పరిశోధన? ప్రొఫెసర్ డేవిడ్ కార్డ్ 1980వ దశకంలో అలెన్ క్రూగర్‌తో కలిసి కనీస వేతనాలపై పరిశోధన సాగించారు. ఇందుకోసం న్యూజెర్సీలోని రెస్టారెంట్లను ఎంచుకున్నారు. కనీస వేతనాన్ని 4.25 డాలర్ల నుంచి 5.05 డాలర్లకు పెంచినప్పుడు, పెంచకముందు నాటి పరిస్థితుల గురించి నిశితంగా అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయని కార్డ్ చెప్పారు. అందరూ అనుకుంటున్నట్లుగా కనీస వేతనాల పెంపు వల్ల ఉద్యోగాలేవీ పోలేదని ఆయన తెలిపారు. అయితే, తమ అధ్యయన ఫలితాలను తొలుత ఎవరూ నమ్మలేదని అన్నారు. అమెరికాలో దేశీయ ఉద్యోగాలపై వలసలు చూపే ప్రభావంపైనా ఆయన అధ్యయనం చేశారు. డేవిడ్ కార్డ్‌కు మిత్రుడైన అలెన్ క్రూగర్ గతంలోనే నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. అలెన్ క్రూగర్ 58 ఏళ్ల వయసులో 2019లో మరణించారు. BREAKING NEWS: The 2021 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded with one half to David Card and the other half jointly to Joshua D. Angrist and Guido W. Imbens.#NobelPrize pic.twitter.com/nkMjWai4Gn — The Nobel Prize (@NobelPrize) October 11, 2021 చదవండి: D-Mart: ఆకాశమే హద్దుగా డీమార్ట్ దూకుడు...! -
రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!
స్టాక్‌హోం: రసాయన శాస్త్ర విభాగంలో 2021 గాను నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడ్ష్ అకాడమీ బుధవారం రోజున ప్రకటించింది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, స్కాట్లాండ్కు డేవిడ్ డబ్ల్యుసీ మెక్‌మిలన్‌కు రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ వరించింది. ‘అసమాన ఆర్గానో కటాలిసిస్’ను అభివృద్ధి చేసినందుకు గాను వీరికి నోబెల్ పురస్కారం దక్కింది. బెంజిమిన్ లిస్ట్, మెక్‌మిలన్‌ల ఆవిష్కరణతో ఫార్మాసూటికల్ పరిశోధనలపై భారీగా ప్రభావం చూపనుంది. విజేతలకు 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ప్రస్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్కు బెంజమిన్ లిస్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మెక్‌మిలన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి రాయల్ స్వీడిష్ అకాడమీ వైద్య, భౌతిక రంగాల్లో నోబెల్ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. BREAKING NEWS: The 2021 #NobelPrize in Chemistry has been awarded to Benjamin List and David W.C. MacMillan “for the development of asymmetric organocatalysis.” pic.twitter.com/SzTJ2Chtge — The Nobel Prize (@NobelPrize) October 6, 2021 చదవండి: భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..! -
ఆహారదాతకు ‘నోబెల్ శాంతి’
కాలానుగుణంగా వచ్చే ప్రాణాంతక వైరస్‌లో, ధూర్త రాజ్యాల కారణంగా వచ్చే ప్రపంచ యుద్ధాలో కాదు... ప్రపంచ మానవాళిని అన్నివేళలా వెంటాడుతూ అత్యధిక శాతంమందిని బలితీసుకుంటు న్నది ఆకలి మహమ్మారే. కాస్త ముందో వెనకో వైరస్‌లను అరికట్టేందుకు ఔషధాలొస్తున్నాయి. కానీ ఆకలి చిరంజీవి. అదెప్పుడూ మానవాళిని వెంటాడుతూనే వుంటుంది. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కార విజేతగా ఎంపికైన ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) సంస్థ ఆ రంగంలో 59 ఏళ్లుగా విశేషకృషి చేస్తోంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా నిరుడు 88 దేశాల్లో దాదాపు పదికోట్ల మందిని ఆదుకుంది. 42 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారాన్ని, 120 కోట్ల డాలర్ల నగదును, వోచర్లను అందజేసింది. ఆవిర్భవించిన ఏడాదికే... అంటే 1962లో ఇరాన్లో భూకంపం సంభవించినప్పుడు రంగంలోకి దూకి ఆపన్నహస్తం అందించింది. ఆకలి, అలజడి– ఈ రెండూ పరస్పర ప్రభావితాలు. ఆకలితో అలమటించే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. అలజడి రేగుతుంది. దాన్ని సకాలంలో గుర్తించి సరైన చర్యలు తీసుకోనట్టయితే అది సాయుధ ఘర్షణలకో, యుద్ధానికో కారణమవుతుంది. అలాగే సంక్షుభిత సమాజంలోనైనా, సాయుధ ఘర్షణలు జరిగే ప్రాంతాల్లోనైనా ఆహార పదార్థాల కొరత, దాని పంపిణీకి అవరోధాలు ఏర్పడి ఆకలికి దారితీస్తుంది. యెమెన్లాంటిచోట అయితే తమకు లొంగిరాని ప్రాంతాన్ని దిగ్బంధించి, దానికి ఆహారపదార్థాల పంపిణీ జరక్కుండా చూసే సాయుధ ముఠాలు వుంటాయి. అలాంటిచోట వేలాదిమంది ఆకలితో అలమటించి మరణిస్తారు. తగిన పోషకాహారం లోపించి వ్యాధులబారిన పడి చనిపోతారు. నోబెల్ కమిటీ చెప్పినట్టు అలాం టిచోట ఆహార పంపిణీ నిస్సందేహంగా శాంతి సాధనకు తోడ్పడుతుంది. భూగోళంలో ఎక్కడో మారుమూల ఏదో జరిగితే మనకేమిటన్న నిర్లిప్తత క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌పీ వంటి సంస్థలు చేస్తున్న కృషి అందరికీ తెలియాల్సివుంది. నోబెల్ సీజన్లో ఇతర బహుమతుల కన్నా నోబెల్ శాంతి బహుమతిపై అందరిలో ఆసక్తి వుంటుంది. మిగిలినవన్నీ సామాన్యులకు కొరుకుడు పడని శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబం ధించినవి కావడం అందుకు కారణం. కనుకనే శాంతి బహుమతి విషయంలో మాత్రమే రకరకాల అంచనాలు వస్తాయి. అందరి అంచనాలకూ భిన్నంగా నిర్ణయించినప్పుడు దానిపై విమర్శలు కూడా వెల్లువెత్తుతాయి. ఫలానా వ్యక్తుల్ని, సంస్థల్ని ఎందుకు వదిలిపెట్టారన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఈసారి అందరూ కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ దేశాలను సమన్వయపరచుకుని పోరాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ పురస్కారం వస్తుందన్నారు. పర్యావరణ అంశాల్లో పోరాడుతున్న యువతి గ్రేటా థన్‌బర్గ్‌కు వస్తుందని మరికొందరు జోస్యం చెప్పారు. అయితే ‘అంతర్జాతీయ సంఘీ భావం, సహకారం వంటివి మునుపెన్నడూ లేనంతగా అవసరమైన వర్తమాన తరుణంలో...’ డబ్ల్యూఎఫ్‌పీకి శాంతి పురస్కారాన్ని అందజేయాలని నోబెల్ కమిటీ భావించింది. అమెరికా అధ్య క్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చినప్పటినుంచి అంతర్జాతీయ సహకారాన్ని కొట్టిపారేస్తు న్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేశారు. ఆ సంస్థ నుంచి తప్పుకుంటామని ప్రకటిం చారు. కనుక డబ్ల్యూఎఫ్‌పీకి బహుమతి ఇవ్వడం దేనికి సంకేతమో, ఎవరికి సందేశమో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలకు దేశాలు క్రమేపీ నిధులు అందజేయ డాన్ని తగ్గించుకుంటున్నాయని, ఈ బహుమతి అలాంటి దేశాల్లో పునరాలోచన కలగజేస్తుందని ఆశిస్తున్నామని కమిటీ చెబుతోంది. శాంతి పురస్కారం వివాదాస్పదం అయిన సందర్భాలు లేకపోలేదు. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, 2012లో యూరప్ యూనియన్(ఈయూ)కు వచ్చినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. ఒబామా అప్పటికే ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలోని పౌరప్రాంతాల్లో ద్రోన్ దాడులకు ఆదేశాలిచ్చారు. పర్యవసానంగా అనేకమంది సాధారణ పౌరులు మరణించారు. ఒబామాకు బహు మతి ఎందుకిస్తున్నామన్న అంశంలో నోబెల్ కమిటీకే స్పష్టత లేదు. తననే ఎందుకు ఎంపిక చేశారో ఒబామాకు తెలియదు. ‘అంతర్జాతీయ దౌత్యానికి, ప్రజల మధ్య సహ కారానికి విశేష కృషి చేసినం దుకు’ ఇస్తున్నామని అప్పట్లో కమిటీ ప్రకటించింది. అధ్యక్ష పదవికొచ్చి ఏడాది కాకుండానే అంతర్జా తీయంగా ఆయన చేసిన విశేషకృషి ఏమిటన్నది ఎవరికీ అర్థంకాలేదు. ఆ సమయంలో నోబెల్ శాంతి బహుమతి కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గెయిర్ లుండెస్టాడ్ రిటైర్మెంట్ తర్వాత 2015లో ఒక పుస్తకం వెలువరిస్తూ ఒబామా ఎంపిక తప్పిదమేనని అంగీకరించారు. ఆ పురస్కారం ఆయన్ను మరింత బలోపేతం చేస్తుందని అప్పట్లో కమిటీ భావించిందని ఆయన రాశారు. కానీ ఒబామా మద్దతుదార్లు సైతం ఆ ఎంపిక సరికాదన్నారట. చిత్రమేమంటే... 2016లో అధ్యక్ష పదవినుంచి నిష్క్రమించినప్పుడు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఒబామా కూడా ఆ పురస్కారం ఎందుకిచ్చారో తనకు తెలియదని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఎప్పటిలాగే ఈసారీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రావొచ్చని కొందరు అంచనా వేశారు. కానీ నోబెల్ కమిటీ దృష్టిలో ఆయన లేనేలేరు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ 2015లో ఖరారు చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2030 నాటికి ఆకలిని అంతం చేయడం కూడా ఒకటి. ఈ లక్ష్య సాధన సాధ్యం కావాలన్నా కరోనా అనంతర పరిస్థితుల్లో ఏర్పడ్డ పెను సంక్షోభాన్ని అధిగమించాలన్నా డబ్ల్యూఎఫ్‌పీ కన్నా మెరుగైన సంస్థ మరేదీ లేదు. ఆహా రాన్ని ఉత్పత్తి చేయడం అసాధ్యమైన... అవరోధాలు ఎదుర్కొంటున్న ప్రాంతాలన్నిటా ఆ సంస్థ తన కార్యకర్తల ద్వారా ప్రజానీకానికి అన్నదాతగా నిలుస్తోంది. అటు ఆహార పంపిణీ కార్యకలాపాలను, ఇటు శాంతి స్థాపన కృషిని మిళితం చేస్తూ పనిచేయడం ద్వారా డబ్ల్యూఎఫ్‌పీ తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. నోబెల్ శాంతి పురస్కారం దాని అవిరళ సేవలకు మణిహారం. -
వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్ : వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు 2019 సంవత్సరానికి సంబంధించి నోబెల్ పురస్కారాలు అందుకోనున్నారు. విలియంకెలిన్, పీటర్ రాట్క్లిఫ్, గ్రెగ్ సెమెన్జాకు వైద్యరంగంలో నోబెల్ బహుమతిని నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకు వీరిని నోబెల్ వరించింది. ఆక్సిజన్‌ను కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై ఈ ముగ్గురు సాగించిన విశేష పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది. -
కేన్సర్‌పై పోరాటానికి నోబెల్
స్టాక్‌హోం: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు శాస్త్రజ్ఞులను ఈ ఏడాది వైద్య నోబెల్ వరించింది. వ్యాధి నిరోధక శాస్త్రనిపుణులైన అమెరికా వైద్యుడు జేమ్స్ అలిసన్ (70), జపాన్‌కు చెందిన తసుకు హొంజో (76)లను నోబెల్ వైద్య బహుమతికి విజేతలుగా ఎంపిక చేసినట్లు జ్యూరీ సోమవారం ప్రకటించింది. కేన్సర్ రోగాన్ని నయం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో నేరుగా కేన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలిసన్, హొంజోలు మాత్రం ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా కేన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు. వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేన్సర్ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని జేమ్స్ అలిసన్, తసుకు హొంజోలు అభివృద్ధి చేశారు. బహుమతులను ప్రకటించిన అనంతరం నోబెల్ అసెంబ్లీ సభ్యులు మాట్లాడుతూ ‘వీరి చికిత్సా విధానం కేన్సర్‌ను నయం చేయడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కేన్సర్ చికిత్స విషయంలో మన దృక్పథాన్ని సమూలంగా మార్చింది’ అని శ్లాఘించారు. ‘రోగ నిరోధక శక్తి కణాలకు కేన్సర్ కణాలపై పోరాడే సామర్థ్యం ఉందనే విషయాన్ని గుర్తించిన వ్యక్తి అలిసన్. అలాగే రోగ నిరోధక కణాలపై పీడీ–1 అనే ప్రొటీన్‌ను గుర్తించి అది కూడా కేన్సర్ కణాలపై పోరాటానికి బాగా ఉపయోగపడుతుందని తసుకు హొంజో తెలియజెప్పారు’ అని నోబెల్ జ్యూరీ ఓ ప్రకటనలో తెలిపింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఆ మొత్తాన్ని అలిసన్, హొంజోలు చెరిసగం పంచుకుంటారు. అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోంలో స్వీడన్ రాజు కార్ల్–16 వీరికి బహుమతిని అందజేస్తారు. గౌరవంగా ఉంది: అలిసన్ ‘ప్రఖ్యాత నోబెల్ బహుమతి గెలుచుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉంది. నా పరిశోధన ఇంత గొప్పగా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి అందించిన చికిత్స ద్వారా కోలుకున్న రోగులను కలుసుకోవడం గొప్ప ఉద్విగ్నంగా ఉంటుంది. ప్రాథమిక విజ్ఞాన శాస్త్రానికి, కేన్సర్‌కు రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్న మా జిజ్ఞాసకు ఆ రోగులే సజీవ సాక్ష్యాలు’ అని జేమ్స్ అలిసన్ వెల్లడించారు. శరీర వ్యాధి నిరోధక శక్తిలో అత్యంత కీలకమైన టీ–సెల్స్ (తెల్ల రక్త కణాల్లో ఒక రకం)పై నిరోధక గ్రాహంగా సీటీఎల్ఏ–4 అణువు పనిచేస్తుందని 1995లో గుర్తించిన ఇద్దరు శాస్త్రజ్ఞుల్లో అలిసన్ ఒకరు. మరింత మందిని కాపాడుతా: హొంజో తసుకు హొంజో జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. నోబెల్ బహుమతిని ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించి గతంలో కన్నా అత్యంత ఎక్కువ మంది కేన్సర్ రోగులను కాపాడేందుకు తన పరిశోధనను కొనసాగిస్తానని చెప్పారు. ‘నా కృషి వల్లే రోగం నయమైందని ఎవరైనా రోగులు చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. నా గోల్ఫ్ క్లబ్లో సభ్యుడైన ఓ వ్యక్తి ఓ రోజు నా దగ్గరికి వచ్చి.. మీ వైద్యం వల్లే నేను బతికున్నాను. ఊపిరితిత్తుల కేన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. అంతకన్నా ఆనందం ఏముంటుంది?’ అని చెప్పారు. ఏమిటీ ఇమ్యునోథెరపీ? కేన్సర్ చికిత్సకు అందుబాటులోకి వచ్చిన కొత్త పద్ధతే ఈ ఇమ్యునోథెరపీ. అడ్డూఅదుçపూ లేకుండా విభజితమయ్యే కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రస్తుతం కీమోథెరపీ, లేజర్ సహా పలు రకాల చికిత్సలు వాడతున్నాం. ఇమ్యునోథెరపీలో శరీర రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలే (టీ–లింఫోసైట్స్–తెల్ల రక్తకణాల్లో ఓ రకం) కేన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా చేస్తారు. ఇమ్యునోథెరపీలో మూడు రకాలు ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ వీటిల్లో ఒకటి. ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్ కణాల మధ్య తేడాను టీ–కణాలు గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్ రిసెప్టార్లను వాడతారు. వీటిని చెక్‌పాయింట్స్ అంటారు. సాధారణంగా కేన్సర్ కణాలు కూడా మామూలు కణాల్లాగే టీ–సెల్స్‌కు సంకేతాలు పంపుతుంటాయి. దీంతో కేన్సర్ కణాలేవో, ఆరోగ్యకరమైన కణాలేవో టీ–సెల్స్ గుర్తించలేవు. ఇమ్యునోథెరపీలో కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా ఈ సంకేతాలను నిలిపివేసి టీ–కణాలు కేన్సర్ కణాలను గుర్తించేలా చేస్తారు. ఇక రెండో రకం ఇమ్యునోథెరపీలో సైటోకైన్స్‌ను వాడతారు. రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసే ప్రత్యేక రసాయనాలే ఈ సైటోకైన్స్. ఈ ప్రత్యేక రసాయనాల ద్వారా టీ–సెల్స్ అధికమై అవి కేన్సర్ కణాలపై దాడి చేస్తాయని అంచనా. చివరగా మూడో పద్ధతి... వ్యాక్సిన్లు. కొన్ని కేన్సర్ల విషయంలో ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లను ఉపయోగిస్తారు. మిగిలిన వాటిల్లో వ్యాధి సోకిన తరువాత కూడా టీ–కణాల్లో కొత్త శక్తిని నింపి కేన్సర్ కణాలపై దాడి చేసేలా చేసేందుకు వ్యాక్సిన్లు ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తారు కాబట్టి దాని ప్రభావం కొన్ని ఆరోగ్యకరమైన కణాలపై కూడా పడుతూంటుంది. ఫలితంగా విపరీతమైన నీరసం, వికారం, ఆకలి మందగించడం, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి. -
ఈ ఏడాది నోబెల్ ‘సాహిత్యం’ ఉండదు!
స్టాక్‌హోమ్: ‘మీ టూ’ ప్రకంపనల నేపథ్యంలో ఈ ఏడాది నోబెల్ సాహితీ పురస్కారాన్ని స్వీడిష్ అకాడెమీ వాయిదావేసింది. అకాడెమీ సభ్యురాలి భర్తపై లైంగిక ఆరోపణలతోపాటు వివిధ వివాదాలూ దీనికి కారణం. అకాడెమీలోని శాశ్వత సభ్యురాలు, కవయిత్రి కటరినా ఫ్రోస్టెన్సన్, తన భర్త ఫ్రెంచి జాతీయుడైన జీన్ క్లౌడ్ అర్నాల్ట్‌తో కలిసి ఓ సాహితీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు స్వీడిష్ అకాడెమీ భారీగా నిధులను అందజేస్తోంది. అయితే, ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా పలువురు మహిళలు జీన్ క్లౌడ్ అర్నాల్ట్ తమపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. దీంతోపాటు అకాడెమీ ఆస్తులను ఆర్నాల్ట్ దుర్వినియోగం చేశాడనీ, సాహితీ పురస్కారంపై లీకులిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నేపథ్యంలో 18 మంది శాశ్వత సభ్యులుండే స్వీడిష్ అకాడెమీలో లుకలుకలు మొదలయ్యాయి. -
నోబెల్ ప్రాంగణంలో వెలుగు
సముద్రం ఎందుకు ఇలా నీలంగా ఉంటుంది? రంగులేని నీరు సముద్రంలోనే నీలంగా ఎందుకుంది?ఓడ పైభాగంలో నిలబడి మెడిటరేనియన్ సముద్రాన్ని చూస్తుంటే హఠాత్తుగా ఆయనకా సందేహం వచ్చింది.గొప్ప భౌతికశాస్త్రవేత్త కాబట్టి అంత పెద్ద అద్భుతం వెనుక ఉన్న రహస్యమేదో మెదడుకు చేరువవుతున్నట్టనిపించింది కూడా. నీలాకాశాన్ని ప్రతిబింబించడం వల్లనా, ఆ నీలం?ఇదే నిజమైతే వెలుగు లేని క్షణాలలో ఈ అద్భుత జలరాశి నీలం రంగులో కాకుండా ఇంకెలా కనిపిస్తుంది? కెరటాలు వెళ్లి ఒడ్డును తాకి పతనమయ్యే వరకు కూడా నీలంగా ఉంటాయి కదా!అప్పుడే సమాధానానికి చాలా సమీపంగా కూడా వచ్చారాయన. సూర్యకిరణాలు జల కణాల మీద వికిరణం చెందడం వల్లనే ఆ జలనిధిని నీలి వర్ణం కమ్ముకుందా?!బ్రిటిష్ సామ్రాజ్యంలోని విశ్వవిద్యాలయాల సమావేశం 1921లో లండన్‌లో జరిగింది. ఆ సమావేశానికి కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున చంద్రశేఖర్ వెంకట రామన్ హాజరయ్యారు. తిరిగి వస్తుంటే ఆ మహా భౌతికశాస్త్రవేత్తకు కలిగిన ఆలోచన లివి. అప్పటికే ఈ అంశం భౌతిక శాస్త్రంలో బీజమాత్రంగా ఉంది. కలకత్తా చేరుకున్న వెంటనే పరిశోధన ప్రారంభించారాయన. ఈ పరిశోధనే ఆయనను 1930 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతికి అర్హుడిని చేసింది. మన కంటికి కనిపిస్తున్న ఈ వెలుగు చేసే ఒక అద్భుతాన్ని, ఒక విన్యాసాన్ని సీవీ రామన్ (నవంబర్ 7, 1888–నవంబర్ 21, 1970) లోకానికి బహిర్గతం చేశారు. ధ్వని తరంగాల రహస్యాన్ని కూడా ఆయన ఛేదించారు. వెలుగు వెనుక రహస్యాన్ని ఛేదించినందుకే ఆయనను నైట్‌హుడ్ కూడా వరించింది. అలా సర్ సీవీ రామన్ అయ్యారు. ఆసియాలో నోబెల్ కమిటీ నుంచి విజ్ఞాన శాస్త్రాలలో తొలి పురస్కారం అందుకున్న ఘనత సర్ సీవీ రామన్‌కే దక్కుతుంది. కానీ చిత్రమేమిటంటే, 1913లో సాహిత్య నోబెల్ అందుకున్న రవీంద్రనాథ్ టాగోర్‌కు వచ్చినంత గౌరవం, ప్రాచుర్యం తరువాత నోబెల్ అందుకున్నవారికి రాకపోవడం ఒకింత ఆశ్చర్యం. మరింత విషాదం. జీవితంలో కొద్దిగా చిరుచీకట్లు ఉన్నా, భౌతికశాస్త్రం వైపు, అక్కడ నుంచి వెలుతురు పరిశోధన వైపు ఆయన సాగించిన ప్రయాణం స్ఫూరిదాయకంగానే ఉంటుంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి గ్రామంలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర అయ్యర్. కావేరి ఒడ్డున ఉంది ఆ గ్రామం. అయ్యర్ భౌతికశాస్త్రం, గణితశాస్త్రాలలో అందె వేసిన చేయి. ఆయన భార్య పార్వతి అమ్మాళ్. పెళ్లయిన తరువాత భర్త దగ్గరే కొంచెం చదువుకుంది. అంతో ఇంతో సంగీతం వచ్చు. వీరి రెండో సంతానమే వెంకటరామన్. పెద్ద కుటుంబం. ఉద్యోగం చూస్తే బడిపంతులు. కొంచెం కష్టాలలోనే ఆ దశ జీవనం సాగింది. అలాంటి సమయంలోనే విశాఖపట్నంలో అయ్యర్‌కి భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. దానితో కుటుంబం విశాఖపట్నం చేరుకుంది. అప్పటి నుంచి కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం వచ్చింది. వంశ పారపర్యంగా వచ్చిన సంస్కృత సాహిత్యం, సంగీతం, తండ్రి నుంచి కొత్తగా లభించిన విజ్ఞానశాస్త్రం మధ్య రామన్ బాల్యం వైవిధ్యంగా గడిచింది. వెంకటరామన్ విశాఖపట్నంలోనే సెయింట్ ఎలోయిసిస్ ఆంగ్లో ఇండియన్ హైస్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ సమయంలోనే తండ్రి తెచ్చుకున్న భౌతికశాస్త్ర గ్రంథాలను రామన్ చదువుకునేవారు. తండ్రి పనిచేస్తున్న కళాశాల గ్రంథాలయం నుంచి పుస్తకాలు తెచ్చుకుని కూడా చదివేవారు. చిన్నతనం నుంచి విజ్ఞానశాస్త్రమంటే ఎంతో అభిమానం. పదకొండవ ఏటనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 13 ఏటనే ఎఫ్ఏ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. తరువాత తండ్రి వెంకటరామన్‌ను మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ (ఫిజిక్స్)లో చేర్పించారు. అప్పుడే ఓ ఘటన జరిగింది. ఇలియెట్ అనే అధ్యాపకుడు తరగతికి వచ్చి వెంకటరామన్‌ను చూశారు. ‘నువ్వు బీఏ విద్యార్థివేనా?’ అనడిగారాయన, ఎంతో అనుమానంగా.‘అవున్సార్!’ చెప్పారు వెంకటరామన్.‘నీ పేరు?’ ‘సీవీ రామన్’ నిజమే, అలాంటి అబ్బాయి బీఏ తరగతి గదిలో కనిపిస్తే ఆ అధ్యాపకుడికే కాదు, ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అప్పటికి రామన్ వయసు 14 ఏళ్లు. బీఏలో సాధించిన బంగారు పతకం, ఎంఏ (ఫిజిక్స్)లోచేరడానికి బంగారు బాటనే పరిచింది. పదార్థ విజ్ఞానం, ఎనర్జీ ఐచ్ఛికాంశాలుగా ఎంచుకున్నారు. అప్పటికే ఆయన జర్మనీ శాస్త్రవేత్త హెల్మ్‌హోజ్, బ్రిటిష్ శాస్త్రవేత్త లార్డ్ ల్యారీ పరిశోధనల పట్ల అభిమానాన్ని, ఆసక్తిని పెంచుకున్నారు. ఎమ్మేలో ఉండగానే లోకసుందరి అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు. ఎమ్మే అయిన తరువాత ఆయన ఆసక్తికి అవరోధం ఏర్పడింది. అప్పటికే రామన్ అన్నగారు సీఎస్ అయ్యర్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ఉత్తీర్ణుడయ్యారు. పెద్ద జీతం. హోదా. అందుకే అన్నగారితో పాటు, తండ్రి కూడా ఆ పోటీ పరీక్ష రాయమని సలహా ఇచ్చారు. రామన్ ఆ పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. భారత ఆర్థిక శాఖలో అసిస్టెంట్ అకౌంటెట్ జనరల్‌గా నియమితులయ్యారు. కలకత్తాలో ఉద్యోగం. కానీ దృష్టంతా భౌతికశాస్త్రం మీదనే ఉండేది.ఒక సాయంకాలం ఆఫీసు పని ముగించుకుని ట్రామ్‌కార్ మీద ఇంటికి వెళుతున్న రామన్‌కు 210, బౌ బజార్ వీధి దగ్గర ఒక బోర్డు కనిపించింది. అక్కడికక్కడే ఆయన ట్రామ్ దిగిపోయారు. ఇండియన్ అసోషియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ కార్యాలయం అక్కడే ఉన్నట్టు చెప్పే బోర్డు అది. కార్యాలయంలోకి వెళ్లి సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృత్లాల్ సర్కార్‌ను కలుసుకున్నారు. తన గురించి చెప్పుకున్నారు. డాక్టర్ సర్కార్ కూడా పగలు సహాయ అకౌటెంట్ జనరల్‌గా ఉంటున్నా, ఖాళీ సమయాలలో ఆ సైన్స్ ప్రయోగశాలలో పార్ట్‌టైమ్ శాస్త్రవేత్తగా పరిశోధనలు చేయడానికి ఆనందంగా అంగీకరించారు. ఇలా పదేళ్లు అటు ఇటు కూడా రామన్ పనిచేశారు. నిజం చెప్పాలంటే ట్రామ్‌కార్ దిగిన రామన్‌కు తాను ఎక్కవలసిన రైలు ఎదురొచ్చిందని చెప్పాలి.ఖాళీ సమయాలలో అని రామన్ చెప్పినప్పటికీ, అకౌంట్స్ కార్యాలయం నుంచి వచ్చాక గంటల తరబడి, ఎన్నో రాత్రులు ఆ ప్రయోగశాలలో పరిశోధనలు చేసేవారు. చాలా రాత్రులు అలసిపోయి, అక్కడే ఏదో టేబుల్ మీద నిద్రపోయేవారు. కొన్నిసార్లు నిరాహారంగా కూడా గడిపేవారు. ‘నేచర్’, ‘ది ఫిలసాఫికల్ మేగ్జయిన్’, ‘ఫిజిక్స్ రివ్యూ’ వంటి అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర పత్రికలలో రామన్ వ్యాసాలు ప్రచురించారు. ఒక శాస్త్రవేత్తకు సృష్టంతా పరిశోధన మయంగానే కనిపిస్తుంది కాబోలు. ఆయన చిన్నతనంలో సంగీతం బాగా విన్నారు. తంత్రీవాద్యాల నుంచి, చర్మ వాద్యాల నుంచి వెలువడే ధ్వనులలోని సంక్లిష్టతను గురించి కూడా అధ్యయనం చేశారు. అప్పటికే ప్రపంచంలో ఎంతో ఖ్యాతి పొందిన ఎకోస్టిక్స్ శాస్త్రంలో ఇదొక భాగం. అదే సమయంలో బర్మాకు బదలీ అయింది. తండ్రి పోయినట్టు వార్త కూడా వచ్చింది. ఆరుమాసాలు సెలవు పెట్టి ఇంటికి వెళ్లారు. ఆ కార్యక్రమాలు అయిపోయిన తరువాత ఆయన మద్రాసులోనే మళ్లీ సైన్స్ ప్రయోగాల కోసం మిగిలిన సమయం కేటాయించారు. 1913లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాటయింది. పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను సమావేశ పరిచి చర్చలు, సంప్రదింపులకు అవకాశం కల్పించడం ఈ సంస్థ ఉద్దేశం. దీనికి అధ్యక్షుడు నాటి కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అశుతోష్ ముఖర్జీ. భౌతికశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు సీవీ రామన్. 1914లో కాంగ్రెస్ తొలి సమావేశం జరిగింది. మొత్తానికి 1915లో రామన్ పూర్తిస్థాయి పరిశోధకునిగా స్థిర పడడానికి అవకాశం వచ్చింది. అప్పుడే కలకత్తా విశ్వవిద్యాలయంలో సైన్స్ కాలేజ్‌ను స్థాపించారు. అందులో తారకానాథ్ పాలిత్ పేరుతో ఒక విజ్ఞానశాస్త్ర పీఠం ఏర్పాటు చేశారు. ఆ పీఠానికి అధిపతిగా రామన్‌కు అవకాశం ఇచ్చారు. కానీ సహాయ అకౌటెంట్ జనరల్ కంటే జీతం ఎంతో తక్కువ. హోదా అనే ప్రశ్నే లేదు. అయినా ప్రొఫెసర్ ఉద్యోగాన్నీ, పరిశోధనలనీ ఆయన ఎంచుకున్నారు. కానీ ఒక గొప్ప ఇంకొక వెసులుబాటు మాత్రం కల్పించారు. ఉద్యోగం ఆచార్యుడే అయినా పరిశోధనలకు పరిమితం కావచ్చు. బోధన నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. మెడిటరేనియన్ సముద్రం మీద నుంచి గమనించిన వెలుగుల రహస్యం గురించి పరిశోధించిన రామన్, ఆ అంశాలను గురించి 1928లో నేచర్ పత్రికలో ప్రచురించారు. ఆయన ఎమ్మే చదువుతున్న కాలంలోనేప్రొఫెసర్లు ఇంగ్లండ్ వెళ్లి పరిశోధన చేయవలసిందని సూచించారు. కానీ ఆయన వెళ్లలేదు. మద్రాస్ సివిల్ సర్జన్ ఒక సందర్భంలో రామన్‌ను దేశం విడిచి వెళ్లవద్దని సలహా ఇచ్చారు. అక్కడి వాతావరణం నీకు పడదని కూడా చెప్పారు. ఇందుకు గట్టి ఉదాహరణ కూడా ఉంది. సీవీ రామన్ కంటే ఒక సంవత్సరం పెద్దవాడైన గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులోనే మరణించడానికి కారణం– ఇంగ్లండ్ వాతావరణానికి తట్టుకోలేకే. అలా భారతదేశంలోనే ఉండి అంతటి పురస్కారానికి అవసరమైన పరిశోధనలు చేశారాయన. అంటే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయాలంటే ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. అవకాశం ఉంటే వెళ్లడానికి అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ వెళ్లలేకపోయినంత మాత్రాన అవకాశాలు రాకుండా ఉండవని రామన్ జీవితం చెబుతోంది. ఆయనకు నోబెల్ పురస్కారాన్ని తెచ్చి పెట్టిన ‘రామన్ ఎఫెక్ట్’ (నీలి వర్ణం పరిశోధన)ను నిరూపించడానికి ఆయన ఉపయోగించిన పరికరాల ఖరీదు మూడు వందల రూపాయలు మాత్రమే. అవన్నీ ఒక డ్రాయిర్ సొరుగులో ఇమిడిపోతాయి. గొప్ప జీవితం గడిపిన రామన్ తన 82వ ఏట బెంగళూరులో తుది శ్వాస విడిచారు. - డా. గోపరాజు నారాయణరావు -
నోబెల్ అకాడమీకి సెక్స్ స్కాండల్ మరకలు!
స్టాక్‌హోమ్ : మూవీ మొఘల్ వెయిన్‌స్టెన్ వ్యవహారం బయటపడ్డాక మీటూ క్యాంపెయిన్ మూలంగా ప్రపంచం నలుమూలల ఇప్పటిదాకా జరిగినే వేధింపుల పర్వాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతులను అందించే స్వీడిష్ అకాడమీ కూడా ఆ జాబితాలో నిలవటం విశేషంగా నిలిచింది. సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తుందన్న విషయం తెలిసిందే. దాగెన్స్ నైహెటర్ అనే ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. మొత్తం 18 మంది మహిళలు అకాడమీకి చెందిన ఓ ప్రముఖుడి చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరును మాత్రం వెల్లడించకపోయినా.. హింట్లు మాత్రం ఇచ్చేసింది. స్వీడిష్ అకాడమీకి చెందిన ఆయన ఓ రచయితను వివాహం చేసుకున్నాడని.. అకాడమీ డబ్బులతోనే ఓ కల్చరల్ క్లబ్ కూడా నిర్వహిస్తున్నాడని, పైగా అకాడమీ లివింగ్ రూమ్‌లోనే వ్యవహారాలను వెలగబెట్టేవాడంటూ పేర్కొంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది. ప్రతీ ఒక్కరికీ తెలుసు... 1996 నుంచి 2017 మధ్య ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా చాలా మంది మహిళలు మీడియా ముందుకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పారు. స్టాక్ హోమ్‌లోని ఓ పోష్ అపార్ట్మెంట్లో అత్యాచారానికి గురయ్యానని ఓ మహిళ ఆరోపణలతో ఇది మొదలైంది. ఆయనెవరో ప్రతీ ఒక్కరికీ తెలుసు... కెరీర్ నాశనం అవుతుందన్న ఉద్దేశంతో చాలా మంది బయటపడటం లేదని కూడా ఆమె తెలిపారు. ఇక మీటూ లో భాగంగా ఆయన వ్యవహారంపై స్విస్ మంత్రి అలై కుంకే కూడా స్పందించటం గమనార్హం. 2015 లో పోలార్ స్టార్ అవార్డును ఆయనకు అందజేసేందుకు తనని ఆహ్వానించారని.. కానీ, రాజ కుటుంబానికి, విదేశీయులకు గుర్తింపుగా ఇచ్చే ఆ అవార్డును అలాంటోడికి అందించటం ఇష్టం లేక తాను ఆ కార్యక్రమానికి హాజరుకాలేని ఆమె చెప్పారు. ఇంత వ్యవహారం జరిగినా ఆయన పేరును ప్రకటించేందుకు ఏ ఒక్క స్విస్ మీడియా కూడా ముందుకు రావటం లేదు. దాగెన్స్ నైహెటర్ కథనంపై వెలువడ్డాక గురువారం స్వీడిష్ అకాడమీ కమిటీ సభ్యులు అత్యవసర భేటీ నిర్వహించారు. అనంతరం మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ... ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తితో ఎప్పుడో సంబంధాలు తెంచేసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. పురస్కరాల విషయంలో ఆయన ప్రభావం ఏమైనా చూపారా? అన్న అంశంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఇక అకాడమీ సభ్యులు- వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన బాధితులేనని ఓ అధికారి ఒకరు చెప్పారు. -
నోబెల్ విన్నర్ ‘నోట్లరద్దు’ ట్వీట్లు వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన రిచర్డ్ థాలెర్(72) కు నోబెల్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై సమగ్ర అధ్యయనం చేసిన ఆయన ఈ గౌరవం దక్కింది. దీంతో ట్విట్టర్లో థాలెర్‌కు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై గతంలో ఆయన చేసిన ఓ రెండు ట్వీట్లు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే క్యాష్‌లెస్ ఉద్దేశ్యాన్ని ప్రధానంగా తీసుకున్న థాలెర్ తన ట్విట్టర్లో సందేశం ఉంచారు. ‘దీనికి(నోట్ల రద్దుకు) నేను ఎప్పటి నుంచో మద్ధతు తెలుపుతున్నాను. నగదురహిత విధానానికి, అవినీతి నిర్మూలనకు ఇది ముందడుగు’ అంటూ అభినందనలు తెలియజేశాడు. అయితే కాసేపటికే ఓ వ్యక్తి కొత్తగా 2000 నోటు కూడా ప్రవేశ పెట్టబోతున్నారంటూ మరో ట్వీట్ చేశాడు. దీంతో అయ్యో.. నిజమా? అంటూ రిచర్డ్ థాలెర్ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ రెండు తెగ వైరల్ అవుతున్నాయి. డీమానిటైజేషన్ సమయంలో నోరు మెదపని మేధావులు, బీజేపీ నేతలు ఈ మధ్య వరుసగా మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తోపాటు యశ్వంత్ సిన్హా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
ఆ పురస్కారాన్నేరద్దు చేయాలి
బీజింగ్: తమ తమ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు అందజేసే నోబెల్ పురస్కారాన్ని రద్దు చేయాలని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వాదించింది. ఈ పురస్కారం మంజూరులో రాజకీయాలు ఎక్కువయ్యాయని, విజేతల్లో ఎక్కువ మంది యూరప్ లేదా అమెరికా వాళ్లుండటమే ఇందుకు నిదర్శనమని వాదించింది. చైనాలో హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి నిర్బంధాన్ని ఎదుర్కొన్న నోబెల్ గ్రహీత లియు జియబో ఈనెల 13న మరణించిన నేపథ్యంలో ఈ వ్యాసం ప్రచురితమైంది. లియు శాంతిదూత కాదని, యుద్ధపిపాసి అని డ్రాగన్ నిందించింది. పాశ్చాత్య సమాజం ఉద్దేశపూర్వకంగా ఈ వాస్తవాన్ని విస్మరించిందని విమర్శించింది. చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న దలైలామాకు నోబెల్ ఇవ్వడం ద్వారా అవార్డు కమిటీ పొరపాటు చేసిందని ఆక్షేపించింది. -
మెదడు దిక్సూచి వ్యవస్థకు నోబెల్!
స్టాక్‌హోం(స్వీడన్): పరిసరాల మధ్య మనం ఎక్కడున్నాం? మన స్థానాన్ని కచ్చితంగా ఎలా అంచనా వేసుకుంటున్నాం? పరిసరాల చిత్రపటాన్ని ఆవిష్కరించుకుని, సులభంగానే అటూ, ఇటూ ఎలా కదలగలుగుతున్నాం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. అదే మన మెదడులో సమర్థమైన దిక్సూ చి వ్యవస్థ ఉండటం వల్ల! అందుకే.. మనిషి కదలికలకు అత్యంత కీలకమైన మెదడులోని అంతర్గత దిక్సూచి వ్యవస్థ(ఇన్నర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్-జీపీఎస్)ను ఆవిష్కరించిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ బహుమతి వరించింది. పరిసరాలను గమనిస్తూ.. మనిషి మెదడు ఎలా దిశానిర్దేశం చేసుకుంటుందన్న అంశాన్ని వివరించిన బ్రిటిష్-అమెరికన్ శాస్త్రవేత్త జాన్ ఓ కీఫ్(74), నార్వేజియన్ దంపతులు ఎడ్వర్డ్ మోసర్(52), మే-బ్రిట్ మోసర్(51)లు ఈ ఏడాది వైద్యరంగ నోబెల్‌ను సంయుక్తంగా గెలుచుకున్నారు. శతాబ్దాల తరబడి శాస్త్రవేత్తల మెదళ్లను తొలచిన ప్రశ్నకు వీరు ముగ్గురూ సమాధానం కనుగొన్నారని ప్రశంసిస్తూ.. సోమవారం నోబెల్ జ్యూరీ వీరిని విజేతలుగా ప్రకటించింది. మనిషి మెదడు దిక్సూచీ వ్యవస్థ ఆవిష్కరణ వల్ల.. ప్రధానంగా అల్జీమర్స్ వ్యాధికి చికిత్స చేసేందుకు వీలు కానుందని జ్యూరీ పేర్కొంది. పరిసరాల మధ్య స్థానాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే మెదడులోని నాడీకణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు సంబంధిత జ్ఞాపకశక్తి కోల్పోయి తికమక పడుతుంటారు. మెదడులోని అంతర్గత జీపీఎస్ వ్యవస్థను అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి వారికి చికిత్స చేసేందుకు మార్గం సుగమం అయిందని జ్యూరీ అభిప్రాయపడింది. అలాగే వైద్యరంగంలో నోబెల్‌ను గెలుచుకున్న 11వ మహిళగా మే-బ్రిట్ మోసర్ నిలిచారు. విజేతలకు అవార్డు కింద 80 లక్షల స్వీడిష్ క్రోనార్లు(రూ. 6.81 కోట్లు)అందనున్నాయి. ఇందులో జాన్ ఓ కీఫ్‌కు సగం, మిగతా ఇద్దరికి మరో సగం దక్కనుంది. భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్ బహుమతులను కూడా వరుసగా రోజుకొకటిగా శనివారం దాకా ప్రకటిస్తారు. ఆర్థిక శాస్త్ర నోబెల్‌ను మాత్రం సోమవారం ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబరు 10న స్టాక్‌హోంలో అవార్డులు ప్రదానం చేస్తారు. కాగా, గతేడాది వైద్యరంగం(ఫిజియాలజీ)లో నోబెల్ అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు లభించింది. శరీర కణాల మధ్య ఇన్సులిన్ రవాణాను ఆవిష్కరించినందుకు వారికి ఈ బహుమతి దక్కింది. మెదడు జీపీఎస్ ఆవిష్కరణ ఇలా... యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకుడైన జాన్ ఓ కీఫ్ తొలిసారిగా 1971లో మెదడు జీపీఎస్ వ్యవస్థకు సంబంధించిన నాడీకణాలను ఎలుక మెదడులో కనుగొన్నారు. మెదడులోని హిప్పోక్యాంపస్ భాగంలో ఈ ప్రత్యేక స్థాన నాడీకణాలు(ప్లేస్ సెల్స్) క్రియాశీలం కావడం వల్ల ఎలుక ల్యాబ్‌లో తన స్థానాన్ని కచ్చితంగా అంచనా వేసుకుంటోందని, దీనివల్ల ఆ గది చిత్రపటం ఎలుక మెదడులో ఆవిష్కృతం అవుతోందని ఆయన గుర్తించారు. తర్వాత మూడు దశాబ్దాలకు 2005లో నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన మే-బ్రిట్, ఎడ్వర్డ్ మోసర్ దంపతులు ఈ మెదడు జీపీఎస్‌లో మరో కీలక నాడీకణ వ్యవస్థను కనుగొన్నారు. పరిసరాల చిత్రపటాన్ని ఆవిష్కరించిన తర్వాత స్థానాన్ని అంచనా వేయడం, దారి తెలుసుకోవడం అనే అంశాల మధ్య సమన్వయానికి కీలకమైన సమన్వయ నాడీకణాలు (గ్రిడ్ సెల్స్)ను వీరు గుర్తించారు. ఈ రెండు రకాల కణాల వ్యవస్థ మనిషి మెదడులోనూ ఇలాగే ఉందని ఇటీవ లి పరిశోధనల్లో నిరూపించారు. -
సత్యం: ఐన్‌స్టీన్ = మేధావి
ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గౌరవం పొందాలి. ఎవరినీ దేవుళ్లను చేయొద్దు. విచిత్రమేమిటంటే, నా దురదృష్టంకొద్దీ నా తోటివారినుంచి నేను ఎక్కువ ఆదరణనూ, భక్తినీ పొందాను, నా గొప్పతనం అంతగా ఏమీలేకపోయినా... చిన్నతనంలో ఐన్‌స్టీన్‌కు వాళ్ల నాన్న ఒక ప్యాకెట్ కంపాస్ ఇచ్చాడట. ఏమీలేకుండానే శూన్యంలో అటూయిటూ తిరుగుతున్న ఆ ముల్లును చూస్తూంటే, ఏమీలేనిదాన్లోనే ఏదోవుందన్న గ్రహింపు కలిగిందట! ఆ కుతూహలమే ఆ పిల్లాడిని ‘ఐన్‌స్టీన్’ను చేసింది. నిస్సందేహంగా ఇరవయ్యో శతాబ్దపు అత్యున్నత మేధావిగా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను శాస్త్ర ప్రపంచం కీర్తించింది. ప్రతిదాన్నీ ప్రశ్నించే స్వభావం ఆయనది. పాఠశాలల్లో అతి క్రమశిక్షణను సహించేవాడు కాదు. ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు ఆయనకు నచ్చేవాళ్లు కాదు. మనిషికి మెదడు ఉన్నదే ప్రశ్నించడానికనేవారు. ప్రశ్నిస్తూనే జ్ఞానాన్ని పొందాలిగానీ, గుడ్డిగా కాదనేవారు. విద్య అనేది విద్యార్థుల్ని ఆలోచించేలా చేయాలి, అంతకుముందు ఊహించడానికి కూడా సాధ్యంకాని ఊహల్ని సాధ్యం చేసేట్టుగా ఉండాలి. ఉత్తినే వాస్తవాలు తెలుసుకోవడంకన్నా, ఆలోచించేలా మెదడుకు తర్ఫీదు ఇవ్వాలనే ఆలోచనలు ఆయనవి. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలస్తంభాల్లో ఒకటైన సాపేక్ష సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రపంచ సుప్రసిద్ధ సూత్రం ‘ఈ=ఎం.సీస్క్వేర్’ కనుగొన్నారు. 1921లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అయితే, ఆయన కేవలం మేధావిగా, శాస్త్రవేత్తగా మాత్రమే ఉండిపోలేదు. అలా ఉండిపోకపోవడమే ఆయన్ని జనానికి కూడా చేరువ చేసింది. తాత్వికుడిగా, ఆధ్యాత్మిక అన్వేషకుడిగా, అహింస పట్ల ప్రేమ ఉన్నవాడిగా ఆయన ఎన్నో అంశాల్లో తన భావాలను పంచుకున్నారు. ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గౌరవం పొందాలి. ఎవరినీ దేవుళ్లను చేయొద్దు. విచిత్రమేమిటంటే, నా దురదృష్టంకొద్దీ నా తోటివారినుంచి నేను ఎక్కువ ఆదరణనూ, భక్తినీ పొందాను, నా గొప్పతనం అంతగా ఏమీలేకపోయినా, అన్నారు ఓ సందర్భంలో. ఆర్థిక విధానాల రీత్యా సామ్యవాదం వైపు మొగ్గినా, వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ఉండే ప్రాధాన్యతను నొక్కిచెప్పేవారు. ఐన్‌స్టీన్ ఏ దేవుడినీ అంగీకరించలేదు. మానవ బలహీనతలోంచే దేవుడు జన్మించాడని వ్యాఖ్యానించారు. అయితే మతంగా మాత్రం బౌద్ధానికి పెద్దపీట వేశారు. ఏ మతమైనా ఆధునిక శాస్త్రీయావసరాలతో తూగగలిగినది ఉందంటే అది బౌద్ధమే అన్నారు. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న ఐన్‌స్టీన్ తిరిగి తన మాతృదేశం వెళ్లలేదు. అమెరికాలోనే స్థిరపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రదేశాల మద్దతుదారుగా శత్రువును ఎదుర్కోవడానికి మరింత శక్తిమంతమైన బాంబుల తయారీ అవసరం గురించి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్కు లేఖ రాశారు. అయితే, 1955లో తన మరణానికి ముందుమాత్రం బ్రిటన్ రచయిత బెర్ట్రండ్ రసెల్‌తో కలిసి ‘ద రసెల్-ఐన్‌స్టైన్ మానిఫెస్టో’లో అణ్వాయుధాల ప్రమాదం గురించి హెచ్చరించారు. ‘అహింసతోనూ అనుకున్నది సాధించవచ్చని మీరు నిరూపించారు. మీ దారి ఆదర్శప్రాయమైనదీ, ప్రపంచ శాంతిని నెలకొల్పేదీనూ. మీరంటే నాకు ఆరాధన’ అని గాంధీజీకి లేఖ పంపారు ఐన్‌స్టీన్, కలయికను అభ్యర్థిస్తూ. అయితే ఇద్దరూ కలిసే సమయం వచ్చేలోపే మహాత్ముడు నేలకొరిగారు. మహాత్ముడి గురించిన ఐన్‌స్టీన్ వ్యాఖ్య ‘రక్తమాంసాలతో కూడిన ఇలాంటి మనిషి...’ ప్రసిద్ధమైంది. నేనెప్పుడూ ఒంటరి ప్రయాణికుడినే! నేను ఏనాడూ నా దేశానికి చెందలేదు, నా ఇంటికిగానీ, నా స్నేహితులకుగానీ నా నిండుగుండెతో చెందిలేను. అయినప్పటికీ నేను ఏనాడూ ఒంటరితనాన్నిగానీ, దేనికైనా దూరపుతనాన్నిగానీ అనుభవించలేదు, అన్నారు ఐన్‌స్టీన్. ఆయన మరణించి అర్ధశతాబ్దం దాటిపోయినా ఇప్పటికీ ఐన్స్టీన్నుంచి మనకు కూడా ఏ దూరపుతనమూ లేదు. 14 మార్చి ఐన్‌స్టీన్ జయంతి -
పరిశోధనలతోనే దేశ ప్రగతి
నోబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ సాక్షి, హైదరాబాద్: మౌలిక విజ్ఞానంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నోబెల్ అవార్డు గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ అన్నారు. పరిశోధనల ద్వారానే దేశం ప్రగతి సాధించగలదని అన్నారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త సీఆర్ రావు పరిశోధనలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆర్ట్‌గ్యాలరీని రామకృష్ణన్ ఆదివారం ప్రారంభించారు. ప్రాచీనకాలంలో దేశం పరిశోధనలకు పుట్టినిల్లుగా వెలుగొందిందని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని గణితవేత్త సీఆర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త సారస్వత, హెచ్‌సీయూ వీసీ రామకృష్ణ రామస్వామి, అల్లం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
నోబెల్ ఇండియా ఊహాప్రపంచ సృష్టికర్త `రడ్యార్డ్ కిప్లింగ్`
అత్యంత ప్రతిష్టాకరమైనది నోబెల్ పురస్కారం. రడ్ యార్డ్ కిప్లింగ్ సాహిత్య విభాగంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారతదేశంలో జన్మించి ఈ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఈయన రెండవవారు. రడ్ యార్డ్ కిప్లింగ్ రచనలలో కొన్ని: పాక్ ఆఫ్ పోక్స్ హిల్ (1906) రివార్డ్ అండ్ ఫెయిరీస్(1910) పద్య సంకలనం విత్ ది నైట్ మెయిల్’ (1905) యాజ్ ఈజీ యాజ్ ఎ బి సి (1912) రడ్యార్డ్ కిప్లింగ్... మహారాష్ట్రలోని ముంబాయి (బ్రిటిష్ పాలనకాలం నాటి బొంబాయి ప్రెసిడెన్సీ)లో 1865వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన జన్మించారు. తండ్రి జాన్లాక్ ఉడ్ కిప్లింగ్, తల్లి ఆలీస్. వీరిది భారతదేశంలో స్థిరపడిన ఆంగ్లేయ కుటుంబం. ఈ దంపతుల తొలిసంతానం రడ్యార్డ్ కిప్లింగ్. తొలి పరిచయానికి గుర్తుగా... రడ్ యార్డ్ తండ్రి జాన్ లాక్వుడ్ కిప్లింగ్ బొంబాయిలోని జంషెడ్జీ జిజీబాయి కళా విద్యాలయంలో ఆచార్యునిగా ఉద్యోగం చేసేవారు. ఆయన స్వయంగా శిల్పి. శిల్పకళా శాస్త్రం, మృత్తికతో కళాఖండాలు మలిచే విభాగంలో ఆచార్యులు. లాక్ఉడ్ 1863లో ఇంగ్లండులోని స్టాఫోర్డ్ షైర్లో ఉన్న రడ్ యార్డ్ సరస్సు వద్ద ఆలీస్ని తొలిసారిగా కలిసాడు. పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దంపదులు 1865లో భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తమ పరిచయానికి, ప్రేమకు నెలవైన రడ్యార్డ్ సరస్సు పేరును తొలిబిడ్డకు నామకరణం చేశారీ దంపతులు. ఆరేళ్లకే ఖండాంతరం! రడ్ యార్డ్ కిప్లింగ్‌ని ఆరవ యేట ఇంగ్లండ్‌కు పంపించారు లాక్ఉడ్ దంపతులు. రడ్యార్డ్తోపాటు అతని మూడేళ్ల చెల్లెలు చిన్న అలీస్‌ను కూడా ఇంగ్లండ్‌కి పంపించారు. అన్నాచెల్లెళ్లిద్దరూ ఇంగ్లండ్‌లో మిసెస్ హాలోవే ఇంట్లో పేయింగ్ గెస్ట్లుగా ఉండేవారు. హాలోవే వీరిపట్ల కరకుగా వ్యవహరించేది. ఆమె ధోరణితో రడ్ యార్డ్, అతని సోదరి ఇంగ్లండులో ఎన్నో కష్టాలనుభవిస్తూ చదువుకున్నారు. ఇంతలో తండ్రి ఆరోగ్యంతోపాటు ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో రడ్యార్డ్ కిప్లింగ్, ఆయన సోదరి భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పటి అవిభక్త భారతదేశంలోని లాహోర్ పట్టణంలో ఒక ప్రచురణ కర్త వద్ద సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభించారు కిప్లింగ్. అక్కడ ప్రచురితమయ్యే సివిల్ మిలిటరీ గెజెట్ పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తర్వాత కలకత్తా నుంచి వెలువడుతున్న ‘ది పయనీర్’ అనే బహుళ ప్రాచుర్యం గలిగిన పత్రికకు సంపాదకునిగా పనిచేశారు. ఈ కాలంలోనే రడ్ యార్డ్ కిప్లింగ్లోని రచయిత ప్రకాశించటం మొదలుపెట్టాడు. 1889 మార్చి నెలలో రడ్ యార్డ్ తిరిగి లండన్‌కు పయనమయ్యాడు. లండన్‌లో ఆయన తొలి నవల ‘ద లైట్ దట్ ఫెయిల్డ్’ ప్రచురితమైంది. సంపాదకుడి నుంచి... నోబెల్ వరకు! 1891లో రడ్ యార్డ్ కిప్లింగ్‌కు అమెరికన్ ప్రచురణ కర్త వోల్కాట్తో పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహంగాను, బాంధవ్యంగాను మారింది. వోల్కాట్ సోదరి కారొలీన్‌ను రడ్ యార్డ్ కిప్లింగ్ వివాహం చేసుకుని అమెరికాలో జీవించసాగారు. 1892లో రడ్ యార్డ్ కిప్లింగ్, కారొలీనా దంపతులకు ప్రథమ పుత్రిక జోసెఫీన్ జన్మించింది. ఈ కాలంలో రడ్ యార్డ్ కిప్లింగ్ ‘నౌలాహ్‌క’ మోగ్లీ కథలు రాశారు. అదే ఏడాది ఆయన అనారోగ్యానికి గురయ్యారు. రడ్యార్డ్ ఆరోగ్యం కుదుటపడడానికి సముద్రయానం మంచిదని సలహా ఇచ్చారు వైద్యులు. మరొకపక్క ఇదే సమయంలో అమెరికా- బ్రిటన్ దేశాల మధ్య సత్సంబంధాలు తగ్గుముఖం పట్టాయి కూడ. దాంతో కిప్లింగ్ దంపతులు ఇంగ్లండుకు చేరుకున్నారు. ఇంగ్లండ్‌లో రడ్ యార్డ్ కిప్లింగ్ బాలల కోసం, సైనికుల కోసం ఎన్నో రచనలు చేశారు. ఎన్నో పద్యాలు రాశారు. వాటిలో ‘ది సెవెన్ సీస్’ అనే పద్య సంపుటి, ‘కెప్టెన్స్ కరేజియస్’ అనే నవల ప్రధానమైనవి. 1896లో రడ్ యార్డ్ దంపతులకు రెండవ పుత్రిక ‘ఎల్సీ’ జన్మించింది. కిప్లింగ్ రచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. మరెన్నో రచనలు చేస్తూండగానే హటాత్తుగా వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. వారి పెద్ద కుమార్తె నిమోనియాతో బాధపడుతూ 1899లో తుదిశ్వాస వదిలింది. మూడేళ్ల విరామం తర్వాత 1902లో రడ్ యార్డ్ రాసిన ‘జస్ట్ సో’ కథాసంపుటి ప్రచురితమైంది. రడ్యార్డ్ రచనలను ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత 1907వ సంవత్సరం సాహిత్యంలో ఆయనకు నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. ఆ సందర్భంగా ‘‘కిప్లింగ్లోని పరిశీలనాశక్తి, సహజత్వం, ఊహాశక్తి అద్భుతమైన కథాకథన శక్తికి గుర్తింపుగా ఈ నోబెల్ పురస్కారం అందచేయడమైనది’’ అని నోబెల్ కమిటీ పేర్కొన్నది. కిప్లింగ్ దంపతులకు జాన్ రడ్ యార్డ్ కిప్లింగ్ ఒక్కడే పుత్రుడు. అతనిని చిన్నవయసులోనే సైన్యంలో చేర్చారు రడ్యార్డ్. దురదృష్టవశాన జాన్ యుద్ధంలో మరణించాడు. జాన్ మరణానికి తానే కారణమని కిప్లింగ్ ఎంతగానో దుఃఖించారు. ఆ దుఃఖంలో రాసినదే ‘మై బాయ్ జాక్’.నోబెల్ బహుమతి గ్రహించిన తర్వాత ‘లార్డ్’ బిరుదును పొంది ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు కిప్లింగ్. సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ (స్కాట్‌ల్యాండ్)లో 1922వ సంవత్సరం నుండి 1925 వరకూ ‘లార్డ్ రెక్టార్’ పదవిలో కొనసాగారు. ఇంతటి ప్రతిభాశాలి 1936వ సంవత్సరం, జనవరి 18వ తేదీన మెదడులో రక్తనాళాలు చిట్లి (బ్రెయిన్ హెమరేజ్) మరణించారు. కిప్లింగ్ తన రచనలలో చాలా వరకు సైనికులను, పిల్లలను ఉద్దేశించి రాశారు. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యుడు 2013 నోబెల్ బహుమతులు - జీవకణాల రవాణా వ్యవస్థ వెసికిల్ ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. వారు ర్యాండీ డబ్ల్యు షీక్మన్, జేమ్స్ ఈ రాత్‌మన్, డాక్టర్ థామస్ సుఢోఫ్. ఈ ముగ్గురూ శరీరంలో వ్యాధిని నివారించే ఔషధం... ఆ వ్యాధిగల స్థానానికి ఎట్లా చేరుకుంటుందో తెలిపే వెసికిల్ రవాణా వ్యవస్థ పనితీరును వివరించారు. వీరి పరిశోధనలను గుర్తించిన నోబెల్ పురస్కార నిర్ణాయక కమిటీ స్వీడన్‌లోని కరోలిన్స్కా సంస్థలో, ‘‘మన శరీరంలో ప్రధానమైన వెసికిల్ రవాణావ్యవస్థను కనుగొనటం ద్వారా మానవ శరీర వ్యవస్థను అవగాహన చేసుకునే వీలు కలిగించారని’’ పేర్కొంది. ర్యాండీ డబ్ల్యూ షీక్మన్... 1948లో అమెరికాలో జన్మించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(బెర్కిలీ)లో కణ జీవ శాస్త్రవేత్త. వెసికిల్ వ్యవస్థను నియంత్రించే 3 రకాల జన్యువులను కనుగొన్నారు. జేమ్స్ ఈ రాత్‌మన్... 1950వ సంవత్సరంలో అమెరికాలో జన్మించారు. జీవకణాల రవాణా వ్యవస్థలో ‘వెసికిల్’లను స్వీకరించి రవాణా చేసే ప్రొటీన్లను, వాటి చర్యవిధానాన్ని వివరించారు. రాత్‌మన్ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో న్యూహేవెన్లోని యేల్ విశ్వవిద్యాలయంలో జీవకణ శాస్త్రవేత్త. డాక్టర్ థామస్ సుఢోఫ్... 1955లో జర్మనీలో జన్మించారు. జీవకణ రవాణా వ్యవస్థలో ‘వెసికిల్’లను నియంత్రించే ఆజ్ఞలు గమ్యం చేరటానికి, అవి మోసుకు వచ్చిన పదార్థాలను బట్వాడా చేయటానికి ఏ విధంగా పనిచేస్తాయో వివరించారు. వెసికిల్ అంటే... మెంబ్రేన్ పొరతో నిర్మితమైన అతి సూక్ష్మమైన బుడగ వంటి ప్యాకింగ్.