ఆ పురస్కారాన్నేరద్దు చేయాలి | 'Nobel prize should be canceled' | Sakshi
Sakshi News home page

ఆ పురస్కారాన్నేరద్దు చేయాలి

Published Fri, Jul 21 2017 9:59 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

ఆ పురస్కారాన్నేరద్దు చేయాలి

ఆ పురస్కారాన్నేరద్దు చేయాలి

బీజింగ్‌: తమ తమ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు అందజేసే నోబెల్‌ పురస్కారాన్ని రద్దు చేయాలని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వాదించింది. ఈ పురస్కారం మంజూరులో రాజకీయాలు ఎక్కువయ్యాయని, విజేతల్లో ఎక్కువ మంది యూరప్‌ లేదా అమెరికా వాళ్లుండటమే ఇందుకు నిదర్శనమని వాదించింది.

చైనాలో హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి నిర్బంధాన్ని ఎదుర్కొన్న నోబెల్‌ గ్రహీత లియు జియబో ఈనెల 13న మరణించిన నేపథ్యంలో ఈ వ్యాసం ప్రచురితమైంది. లియు శాంతిదూత కాదని, యుద్ధపిపాసి అని డ్రాగన్ నిందించింది. పాశ్చాత్య సమాజం ఉద్దేశపూర్వకంగా ఈ వాస్తవాన్ని విస్మరించిందని విమర్శించింది. చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న దలైలామాకు నోబెల్‌ ఇవ్వడం ద్వారా అవార్డు కమిటీ పొరపాటు చేసిందని ఆక్షేపించింది.   

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement