బీజింగ్: దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం పాకిస్తాన్ రాజధాని కరాచీలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందగా వారిలో ముగ్గురు చైనీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా.. పాక్‌ను హెచ్చరించింది.
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో వివిధ వ్యాపారాలు, ప్రాజెక్టుల పనుల కోసం చైనా తమ దేశ పౌరులను అక్కడికి పంపింది. కాగా, తాజాగా జరిగిన బాంబు దాడిలో ఈ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులే చనిపోవడంతో చైనీస్ స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ పేలుడును ఖండించింది. అనంతరం పాకిస్తాన్‌లోని చైనా ప్రాజెక్టులు, సిబ్బందిని రక్షించడానికి పాక్ చొరవతీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే, ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) చైనా కంపెనీలు, పాకిస్తాన్‌లోని పౌరులపై దాడులు చేస్తామని పదేపదే బెదిరిస్తోందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. చైనాకు వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చైనా.. గ్వాదర్‌ను విడిచిపెట్టి, బలూచిస్తాన్‌లోని CPEC ప్రాజెక్టులను ముగించాలని ఆర్మీ తెలిపింది. లేదంటే చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యేక విభాగం చైనీయులను టార్గెట్ చేస్తారని హెచ్చరించింది.
In a video of social media the Baloch Liberation Army is seen warning China to leave Gwadar and end CPEC projects in Balochistan or they will be targeted by a special unit formed against China.
— Indian Warrior (@BharatKaPraheri) April 27, 2022
China will face repercussions for its Pak Army atrocities on Baloch.#ChinaExposed pic.twitter.com/TnfgWQe4Ey
ఇది కూడా చదవండి: చైనాలో కొత్త వైరస్ టెన్షన్
Comments
Please login to add a commentAdd a comment