Global Times
-
‘భారత్‌కు గుడ్ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు!
భారత్‌లో కార్యకలాపాల నుంచి వైదొలగుతున్న విదేశీ సంస్థల జాబితా పెరిగిపోతుంది. మార్కెట్లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక, ఇక్కడి చట్టాల్ని యేథేచ్ఛగా ఉల్లంఘించినా ఏం కాదులే అనే ధీమా తగ్గడంతో దేశీయ మార్కెట్‌కు గుడ్ బై చెబుతున్నాయి. తమ వ్యాపార నిర్వహణకు అనువైన దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు గుడ్‌బై చెప్పి ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియాలలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల్ని ప్రచురించింది. మేడిన్ ఇండియా ‘భారత్ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థల్ని ప్రోత్సహించేందుకు మా పట్ల (చైనా కంపెనీలు) కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ తరహా ధోరణి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఎక్కువగా ఉంది’ అంటూ భారత్‌లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు చెప్పారంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒప్పో ఈజిప్ట్‌లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఈజిప్ట్‌లో ఒప్పో చైనా సంస్థ ఒప్పో ఈజిప్ట్‌లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఫోన్ల తయారీ ప్లాంటు కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా రానున్న సంవత్సరాల్లో సుమారు 900 ఉద్యోగాల రూప కల్పన జరనున్నట్లు ఈజిప్ట్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 బంపరాఫర్ ..ఏకంగా 80 శాతం డిస్కౌంట్! పన్ను ఎగొట్టి 2021 డిసెంబర్ నెలలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడి చైనాలో తన పేరెంట్ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ షావోమీతో పాటు ఇతర చైనా సంస్థల్ని విచారించారు. ఆ విచారణ కొనసాగుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు షావోమీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఒప్పో, వివో, షావోమీతో పాటు ఇతర కంపెనీలు మనీ ల్యాండరింగ్ (Prevention of Money Laundering Act (PMLA) యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో 2022 జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివో తో పాటు ఇతర సంస్థలకు చెందిన ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మేఘాలయా, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేల కోట్లు ఆ సమయంలో వివో మోసాలను ఈడీ బయటపెట్టింది. వివో కంపెనీ భారత్‌లో పన్నులు ఎగొట్టి టర్నోవర్‌లో దాదాపు 50శాతం నిధులను చైనాకు తరలించిందని, ఆ మొత్తం 2017 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం రూ.62,476కోట్లు ఉందని వెల్లడించింది.వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టినట్లు బయటపడింది. ఒప్పో సంస్థ రూ. 4389 కోట్ల వరకు కస్టమ్ డ్యూటీ ఎగవేసింది. వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడింది. మరో కంపెనీ షావోమి కూడా రూ. 653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా.. ఈ తరుణంలో భారత్‌కు చైనా కంపెనీలు గుడ్ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
చల్లారని తైవాన్–చైనా ఉద్రిక్తత
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్ వైపు గుడ్లురిమి చూస్తున్న చైనా వారమైనా తన పంథాను మార్చుకోలేదు. తైవాన్ చుట్టూతా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు కొనసాగిస్తూ ద్వీప ఆక్రమణ భయాలను పెంచేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారమే ముగియాల్సిన సైనిక యుద్ధ క్రీడలను ఇంకా కొనసాగిస్తోంది. తైవాన్ జలసంధి వెంట లైవ్ ఫైర్ డ్రిల్స్ పేరిట చైనా నావిక, వాయు సేన దళాలు సంయుక్త విన్యాసాలు కొనసాగిస్తున్నాయని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. గత ఐదు రోజులుగా వేర్వేరు సామర్థ్యాలున్న క్షిపణులను చైనా ప్రయోగించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లను తీరం వెంట, గగనతలంలో చక్కర్లు కొట్టించింది. తైవాన్ స్పందనను చైనా విశ్లేషిస్తోందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
నిమిషాల్లోనే... రూ. 2 లక్షల కోట్లు హుష్
న్యూఢిల్లీ: ‘మా అరెస్టయ్యారు’ అంటూ వచ్చిన ఒక వార్త మంగళవారం అలీబాబా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఉదయం సెషన్లో నిమిషాల వ్యవధిలోనే 26 బిలియన్ డాలర్ల మేర (రూ.2 లక్షల కోట్లు/ మార్కెట్ విలువలో 10%) తుడిచిపెట్టుకుపోయింది. మా అరెస్ట్‌కు సంబంధించి ఆ తర్వాత స్పష్టత రావడంతో పడిన షేరు కోలుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. మా అంటే అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా అని పొరపడ్డారు ఇన్వెస్టర్లు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన జాక్‌మా గ్రూపు కంపెనీలపై చైనా సర్కారు 2020 నుంచి ఉక్కుపాదం మోపడం తెలిసిందే. ఒక వ్యక్తి శక్తిగా మారకూడదన్న విధానాన్ని అక్కడి కమ్యూనిస్ట్ సర్కారు పాటిస్తోంది. దీంతో నాటి నుంచి జాక్‌మా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు వచ్చింది లేదు. ఈ క్రమంలో మా అరెస్ట్ అంటూ వార్త రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది వార్తా కథనం.. చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం (మే 3) ఒక వార్తను ప్రచురించింది. జాతీయ భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఐటీ డైరెక్టర్ మా అనే వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. జాక్‌మా ఈ కామర్స్ కంపెనీ అలీబాబా ప్రధాన కేంద్రం కూడా అదే పట్టణంలో ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు పొరపడడానికి ఇది కూడా ఒక అంశమే. ‘‘విదేశీ శక్తులతో చేతులు కలిపి, రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినట్టు అనుమానాలపై ఇంటి పేరు ‘మా’ కలిగిన వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో స్టేట్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది’’అంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. దీంతో నిమిషాల్లోనే అలీబాబా షేరు హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 9.4% పడిపోయింది. అదే రోజు గ్లోబల్ టైమ్స్ అదే అంశానికి సంబంధించి మరో కథనాన్ని ప్రచురించింది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరులో 3 అక్షరాలు ఉన్నట్టు పేర్కొంది. అరెస్ట్ అయిన వ్యక్తి స్థానిక ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు, 1985లో జన్మించినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షేరు రికవరీ అయింది. కాకపోతే పడినప్పుడు కంగారుతో అమ్ముకున్నవారే నిండా నష్టపోయారు. అలీబాబా గ్రూపు అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన జాక్‌మా 2020 నవంబర్ నుంచి కనిపించింది లేదు. చైనా జాతీయ బ్యాంకులపై ఆయన విమర్శలు చేశాక సర్కారు ఆయన్ను నిర్బంధించిందన్న వార్తలూ వచ్చాయి. -
China Warning: పాకిస్తాన్‌కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం పాకిస్తాన్ రాజధాని కరాచీలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందగా వారిలో ముగ్గురు చైనీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా.. పాక్‌ను హెచ్చరించింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్లో వివిధ వ్యాపారాలు, ప్రాజెక్టుల పనుల కోసం చైనా తమ దేశ పౌరులను అక్కడికి పంపింది. కాగా, తాజాగా జరిగిన బాంబు దాడిలో ఈ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులే చనిపోవడంతో చైనీస్ స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ పేలుడును ఖండించింది. అనంతరం పాకిస్తాన్‌లోని చైనా ప్రాజెక్టులు, సిబ్బందిని రక్షించడానికి పాక్ చొరవతీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే, ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చైనా కంపెనీలు, పాకిస్తాన్‌లోని పౌరులపై దాడులు చేస్తామని పదేపదే బెదిరిస్తోందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. చైనాకు వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చైనా.. గ్వాదర్‌ను విడిచిపెట్టి, బలూచిస్తాన్‌లోని CPEC ప్రాజెక్టులను ముగించాలని ఆర్మీ తెలిపింది. లేదంటే చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యేక విభాగం చైనీయులను టార్గెట్ చేస్తారని హెచ్చరించింది. In a video of social media the Baloch Liberation Army is seen warning China to leave Gwadar and end CPEC projects in Balochistan or they will be targeted by a special unit formed against China. China will face repercussions for its Pak Army atrocities on Baloch.#ChinaExposed pic.twitter.com/TnfgWQe4Ey — Indian Warrior (@BharatKaPraheri) April 27, 2022 ఇది కూడా చదవండి: చైనాలో కొత్త వైరస్ టెన్షన్ -
చైనాతో వాణిజ్యం కొత్త పుంతలు
బీజింగ్: భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో రికార్డు స్థాయిలో 125 బిలియన్ డాలర్లకు (రూ.9.37 లక్షల కోట్లు) విస్తరించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 43 శాతం పెరిగింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పటికీ వాటి ప్రభావం వాణిజ్యంపై పడలేదని స్పష్టమవుతోంది. చైనా నుంచి దిగుమతులు పెరిగిపోవడంతో ఆ దేశంతో భారత్ వాణిజ్య లోటు 69 బిలియన్ డాలర్లకు (బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,500కోట్లు) విస్తరించింది. 2021లో చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 46 శాతం పెరిగి 97.52 బిలియన్ డాలర్లకు విస్తరించగా.. భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 34 శాతం వృద్ధితో 28.14 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కస్టమ్స్ విభాగం డేటా ఆధారంగా గ్లోబల్‌టైమ్స్ పేర్కొంది. భారత్ ఆందోళన.. గత దశాబ్దకాలంగా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతుండడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. భారత ఐటీ, ఫార్మా ఉత్పత్తులకు ద్వారాలు తెరవాలని చైనాను గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయినా బీజింగ్ పట్టించుకోవడం లేదు. కరోనా రెండో విడత ప్రభావంతో వైద్య పరికరాల దిగుమతి, ఫార్మా కంపెనీలు ముడి సరుకుల కోసం చైనాపై ఆధారపడడమే ఆ దేశం నుంచి భారత్‌కు ఎగుమతులు భారీగా పెరిగేందుకు కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. 2021 మే5 న ప్యాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. పదుల సంఖ్యలో సైనికులు ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ద్వైపాక్షిక సంబంధాలు క్లిష్టంగా మారాయి. ఆ తర్వాత నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు చైనా నుంచి దిగుమతులను తగ్గించడంపై దృష్టి సారించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) తీసుకొచ్చింది. ఇప్పటికే 13–14 రంగాలకు దీన్ని అమలు చేస్తోంది. తద్వారా ఆయా ఉత్పత్తుల తయారీని స్థానికంగానే పెంచుకుని, ప్రపంచానికి ఎగుమతి కేంద్రంగా మార్చాలన్నది కేంద్ర సర్కారు ప్రణాళిక. ఇది ఆచరణ రూపం దాలిస్తే చైనాపై ఆధారపడడం తగ్గుతుంది. -
ఆకాశంలో చైనా ఉపగ్రహ సమూహం
బీజింగ్: తమ స్నాతకోత్సవం ఫొటోలను ఆకాశం నుంచి తీయించుకోవాలని అనుకున్న ఆ విద్యార్థుల ఆలోచన కార్యరూపం దాల్చింది. భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఉపగ్రహాలకున్న శక్తివంతమైన కెమెరాలు వారి వినూత్న ఆలోచనను నిజం చేశాయి. చైనా ప్రభుత్వ అధీనంలోని ది చాంగ్‌గ్వాంగ్ శాటిలైట్ కంపెనీ లిమిటెడ్ ఈ ఏడాది జూలైలో చేసిన ఈ ప్రయోగం మిగతా కళాశాల విద్యార్థుల్లోనూ ఆసక్తి కలిగించింది. దాదాపు 12 వర్సిటీల విద్యార్థులు తమకు కూడా అలాంటి ఫొటోలే కావాలని కోరుతున్నారని అధికార గ్లోబల్ టైమ్స్ తెలిపింది. జిలిన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌చున్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(సీయూఎస్‌టీ)కి చెందిన 100 మంది విద్యార్థులు సీయూఎస్‌టీ ఐటీ అనే అక్షరాలున్న ఎరుపు, పసుపు కార్డులను పట్టుకుని తమ వర్సిటీ ప్రాంగణంలో వరుసగా నిలబడ్డారు. సరిగ్గా 9.45 గంటలకు ది చాంగ్‌గ్వాంగ్ శాటిలైట్ కంపెనీ లిమిటెడ్(సీజీఎస్‌టీసీ)కు చెందిన జిలిన్–1 స్పెక్ట్రమ్01, జిలిన్–1 వీడియో07 ఉపగ్రహాలు వర్సిటీ ప్రాంగణం మీదుగా వచ్చినప్పుడు తమ కెమెరాలను ఆకాశం నుంచి క్లిక్‌మనిపించాయి. చైనాలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోని వర్సిటీ స్నాతకోత్సవాన్నైనా ఏ సమయంలోనైనా ఆకాశం నుంచి ఫొటోలు తీయగల సత్తా సొంతం చేసుకునేందుకు సీజీఎస్‌టీసీ పథకం సిద్ధం చేసింది. 2030 నాటి ఆకాశంలో చైనా తొలి వాణిజ్య ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం, 138 ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను పంపనుంది. ఇవన్నీ భూ కక్ష్యలో తక్కువ ఎత్తులో ఉంటూ అత్యధిక రిజల్యూషన్ కలిగిన స్పష్టమైన చిత్రాలను పంపుతాయి. ఒక్కోటి 40 కిలోల బరువుండే 138 ఉపగ్రహాల్లో 2015 మొదలుకొని ఇప్పటి వరకు 31 శాటిలైట్లను సీజీఎస్‌టీసీ పంపించింది. 2021 చివరికల్లా మరో 29 ఉపగ్రహాలను పంపనున్నట్లు తెలిపింది. మరో 8 ఏళ్లలో, 2030కల్లా మిగతా 78 శాటిలైట్లను పంపేందుకు భారీగా నిధులను సమీకరించుకుంది. లక్ష్యం పూర్తయితే భూమిపైని ప్రతి అంగుళాన్ని రేయింబవళ్లూ ప్రతి 10 నిమిషాలకోసారి మ్యాపింగ్ చేయగలిగే సామర్థ్యం చైనా సొంతమవుతుంది. ఈ ఫొటోలు వ్యవసాయ, అటవీ ఉత్పత్తి సేవలు, పర్యావరణ పరిశీలన, జియోగ్రాఫికల్ ప్లానింగ్, ల్యాండ్ ప్లానింగ్ తదితర రంగాలకు ఎంతో ఉపయోగపడతాయి. కాగా, జిలిన్–1 ఉపగ్రహాలు తీసిన పంపిన చిత్రాలనే పాకిస్తాన్ 2020లో చైనా నుంచి కొనుగోలు చేసినట్లు సౌత్ ఏసియా మానిటర్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ చిత్రాల్లో కశ్మీర్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఆర్మీ సైనిక క్యాంపుల వివరాలున్నాయని తెలిపింది. ఇప్పటికే భారత్‌తో సరిహద్దుల వెంబడి కయ్యానికి కాలుదువ్వుతూ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా..తాజాగా సమకూర్చుకునే సాంకేతికతతో మరింత రెచ్చిపోయే ప్రమాదముంది. భారత సైన్యం, కదలికలు, సాయుధ సంపత్తి జాడను చేజిక్కించుకుని భద్రతకు ముప్పు కలిగించే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కమ్యూనిస్టు పార్టీలోకి ప్రపంచ ప్రఖ్యాత నటుడు
బీజింగ్: వందేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లోకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అగ్ర నటుడు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తమ దేశ మీడియాతో పంచుకున్నారు. తనకు ‘సీపీసీ’లో చేరాలని ఉందంటూ ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ చర్చలో ఆయన పేర్కొన్నారు. ఇంతకు ఆయనెవరో కాదు హాలీవుడ్ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్ట్స్ సినిమాలతో ప్రపంచ ప్రజలను ఆకర్షించిన జాకీ చాన్ (67 ఏళ్లు). జూలై 1వ తేదీన సీపీసీ వంద వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. శత వసంతాల వేడుకలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై మంగళవారం (జూలై 6) ఆ దేశ సినీ ప్రముఖులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆ చర్చలో చైనా ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్ పై వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్లల్లో ఏం చెప్పిందో అది చేసి చూపించిందని కొనియాడారు. అది కూడా కొన్ని దశాబ్దాల్లోనే పూర్తి చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను కొన్నేళ్లుగా ఆ పార్టీకి మద్దతుదారుగా ఉన్నట్లు తెలిపారు. జాకీ చాన్ నటుడు, దర్శకుడు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు కూడా. గతంలో జాకి చాన్చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ)లో సభ్యుడిగా పని చేశారు. -
గల్వాన్ ఘర్షణ: వీడియో విడుదల చేసిన చైనా
బీజింగ్: భారత్-చైనా మధ్య గత 10 నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలను మోహరించాయి. పలు దఫాల చర్చల అనంతరం ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనా గతేడాది జరిగిన గల్వాన్ ఘర్షణలో తమ సైనికులు కేవలం నలుగురు చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆఫ్ చైనా వారికి మరణానంతరం శౌర్య పురస్కారలను ప్రదానం చేయనున్నట్లు ఎల్ఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ వీడియో ఫుటేజ్‌ను చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ విడుదల చేసింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది సైనికులు చనిపోయారు. ఈ గొడవల్లో తమ సైనికులు నలుగురు చనిపోయారని చైనా అంగీకరించింది. చైనా తరఫున విడుదలైన ఈ వీడియోలో చనిపోయిన నలుగురు సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఇరు సైన్యాల అధికారులు మాట్లాడుకోవడం కూడా కనిపిస్తుంది. ఈ వీడియోలో చైనా పరోక్షంగా భారత్‌ను ఉద్దేశిస్తూ ‘‘ఏప్రిల్ నుంచి విదేశీ శక్తులు పాత ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయి. వంతెనలు, రోడ్డు వేయడం కోసం వాళ్లు సరిహద్దును దాటారు. త్వరత్వరగా నిఘా పూర్తి చేశారు" అని ఆరోపించింది. "విదేశీ శక్తులు యధాతథ స్థితిలో మార్పు తెచ్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారు. ఫలితంగా సరిహద్దుల్లో వేగంగా ఉద్రిక్తతలు పెరిగాయి, ఒప్పందాలను గౌరవిస్తూ మేం చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించడానికి చూశాం’’ అని పేర్కొంది. ఈ వీడియో ఫుటేజిలో భారత, చైనా సైనికులు రాత్రి చీకట్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం కనిపిస్తోంది. అందులో చైనా సైనికులు గాయపడ్డ తమ సైనికుడిని తీసుకెళ్లడం కూడా ఉంది. అందులోనే చనిపోయిన తమ సైనికులకు చైనా ఆర్మీ గౌరవ వందనం చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. మా సైనికులు చనిపోయారు: చైనా అంతకు ముందు చైనా ఆర్మీ అధికారిక పత్రిక పీఎల్ఏ డెయిలీని ప్రకారం ఒక వార్త ప్రచురించిన గ్లోబల్ టైమ్స్ "చైనా తన సార్వభౌమత్వాన్ని రక్షించుకోడానికి త్యాగాలు చేసిన సైనికులకు నివాళిగా వారి పేర్లు, వివరాలను మొదటిసారి వెల్లడించింది" అని తెలిపింది. కారాకోరమ్ పర్వతాల్లో చైనా సైన్యంలోని నలుగురు అధికారులు, సైనికులను చైనా సెంట్రల్ మిలిట్రీ కమిషన్ గుర్తించిందని వారిని తగిన పదవులతో సత్కరిస్తామని పీఎల్ఏ డెయిలీ శుక్రవారం తన రిపోర్ట్‌లో చెప్పుకొచ్చింది. ఆ రిపోర్టులో చైనా ఆర్మీ మొదటిసారి గల్వాన్ ఘర్షణ గురించి వివరణాత్మక కథనం ఇచ్చింది. "భారత సైన్యం అక్కడికి పెద్ద సంఖ్యలో సైనికులను పంపించింది. వారంతా దాక్కున్నారు. చైనా సైన్యం వెనక్కు వెళ్లేలా బలవంతం చేశారు అని చెప్పింది. ఆ దాడుల సమయంలో చైనా సైనికులు స్టీల్ రాడ్లు, మేకులు ఉన్న రాడ్లు, రాళ్లతో తమ సౌర్వభౌమాధికారాన్ని ఎలా రక్షించుకున్నారో కూడా చైనా ఆర్మీ ఆ రిపోర్టులో వెల్లడించింది. చదవండి: భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..! గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా -
భారతీయ చేపల ప్యాకెట్లపై కరోనా!
బీజింగ్: భారత్ సహా వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చేపల ప్యాకెట్లపై కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు చైనా అధికారులు ప్రకటించారు. ఇండియా, రష్యా, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వచ్చిన ఈ ప్యాకెట్లను పరీక్షించగా వాటిపై కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు స్పష్టంగా తేలిందని బుధవారం గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇండియా నుంచి వచ్చిన రెండు బట్టర్‌ఫిష్ ప్యాకెట్లు, రష్యా నుంచి వచ్చిన ఒక సాల్మన్ ఫిష్ ప్యాకెట్, అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకున్న రెండు బీప్ ప్యాకెట్ల ఉపరితలాలపై కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించామని అధికారులు తెలిపినట్లు పేర్కొంది. 20 దేశాల నుంచి వచ్చిన వివిధ ఉత్పత్తుల ప్యాకెట్లపైనా వైరస్ ఉన్నట్లు వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. భారత్ నుంచి దిగుమతి అయిన ప్యాకెట్లపై వైరస్ ఆనవాళ్లు ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఇది రెండోసారి. దిగుమతుల పరీక్షలు, నిబంధనల విషయంలో చైనా అసంబద్ధంగా వ్యవహరిస్తోందని, ఇది వాణిజ్యాన్ని దెబ్బతిస్తోందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. -
'జిన్‌పింగ్ ఓకే అంటేనే లెక్కను వివరిస్తాం'
బీజింగ్ : లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో సరిహద్దుకు సంబంధించి భారత్- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారన్న విషయంపై ఆ దేశం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. సరిహద్దు ఘర్షణలో భారత్ నుంచి ఒక కల్నల్ అధికారి సహా 20 మంది జవాన్లు ప్రాణత్యాగం చేసినట్లు మంగళవారం ఉదయం భారత ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, మృతి చెందిన సైనికుల్లో 40 మంది చైనా సైనికులు ఉన్నారని భారత ఆర్మీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దీనిపై చైనా విదేశాంగా శాఖ స్పందిస్తూ భారత సైనికులతో ఘర్షణ జరిగిన మాట నిజమేనని చెప్పింది కానీ తమ సైనికులు ఎంతమంది చనిపోయారన్నది మాత్రం పేర్కొనలేదు. అయితే ఘర్షణలో ఎంతమంది సైనికులు చనిపోయారనే దానిపై ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ఓకే అంటేనే అధికారికంగా లెక్కలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కడి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనంలో పేర్కొంది. (చైనా అధ్యక్షుడి సాయం కోరిన ట్రంప్) ఆ రిపోర్టులో.. 'చైనాలో సెంట్రల్ మిలటరీ కమిషన్ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ చేతిలో ఉంటుంది. ఘర్షణలో మృతి చెందిన చైనా సైనికుల జాబితా విడుదల చేయడానికి ముందు జిన్‌పింగ్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతేగాక 1962లో చైనా- ఇండియా మధ్య తలెత్తిన యుద్దంలో దాదాపు 2వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గాల్వన్ లోయలో తలెత్తిన ఘర్షణలో ఎంతమంది చనిపోయారనే విషయం వెల్లడిస్తే మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సంఖ్య వెల్లడించలేదని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ప్రకటించింది. అమెరికాతో కీలక సమావేశం ఉన్నందున ఈ విషయాన్ని తక్కువ చేసి చూడాలని చైనా భావించి ఉంటుంది. ఇదిలా ఉంటే గల్వాన్ నది లోయలో జరిగిన ఘర్షణలో రెండు వైపులా ప్రాణనష్టానికి దారితీసిందని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షుయిలీ మంగళవారం పేర్కొన్నారని, అయితే ఆయన కూడా చైనా ప్రాణనష్టం గురించి వివరించలేదని అని రిపోర్టులో తెలిపింది.(అదే చైనా వ్యూహం: జిజి ద్వివేదీ) మరోవైపు చైనా ప్రభుత్వ అధికార పత్రికగా ఉన్న గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ హు జిజిన్ స్పందిస్తూ..' నాకు తెలిసినంత వరకు ఈ ఘర్షణలో చైనా కూడా నష్టపోయింది. చైనా సంయమనాన్ని భారత్ తప్పుడు దృష్టితో చూడొద్దు. దీనిని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. చైనా భారత్‌తో యుద్దం చేసేందుకు సిద్ధంగా లేదు. సామరస్య పద్దతిలో సమస్యను పరిష్కరించుకుందాం' అంటూ ట్వీట్ చేశారు. (స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు) -
సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్–డ్రోన్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భారత్‌తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది. పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్–డ్రోన్‌ను త్వరలోనే టిబెట్‌లో భారత్ సరిహద్దుల్లో మోహరించనుందని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ‘చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్–డ్రోన్‌ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవవచ్చు. 500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు’అని వెల్లడించింది. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసిందని తెలిపింది. చైనా–భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొంది. ‘శత్రు దేశ సైనిక కార్యకలాపాలపై నిఘా, శత్రుదేశాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు అంతరాయం కలిగించడంతోపాటు కాల్పులు జరపగల గలదు. నిట్టనిలువుగా, సమాంతరంగా ప్రయాణించగల ఈ ఆధునిక హెలికాప్టర్‌ను ఆపరేట్ చేయడమూ తేలికే. పర్వతమయమైన టిబెట్ ప్రాంతంలోని సరిహద్దుల పరిరక్షణలో చైనాకు అదనపు బలం కానుంది’అని పరిశీలకులు అంటున్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు రెండు దేశాలు సైనిక బలగాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతాల్లోనే చైనా కూడా తాత్కాలిక నిర్మాణం చేపట్టడంతో పాటు, 2,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. అయితే, అక్కడ భారత బలగాల బలమే అధికంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు వెల్లడించారు. గాల్వన్‌లోయలోని దార్బక్–షాయక్– దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ వెంబడి ఉన్న కేఎం 120 సహా పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా ఆర్మీ మోహరించడం ఆందోళనకరమన్నారు. -
చైనాలో బయటపడిన మరో వైరస్!
బీజింగ్: మహమ్మారి కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోలేక, వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక ప్రపంచ మానవాళి బెంబేలెత్తుతోంది. ఈ తరుణంలో చైనాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడినట్టు ఓ మీడియా రిపోర్టు వెల్లడించింది. హంటా వైరస్‌గా పిలవబడే ఈ వైరస్ బారిన పడి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడని గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ పేర్కొంది. హంటా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను చనిపోవడం కలకలం రేపుతోంది. (చదవండి: చైనాపై అమెరికన్ లాయర్ కేసు) గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. ఓ వ్యక్తికి హంటా వైరస్ లక్షణాలు బయటపడటంతో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అతనికి హంటా వైరస్ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయింది. అయితే, అతడు పని నిమిత్తం షాండాంగ్ ప్రావిన్స్‌కు చార్టర్డ్ బస్సులో పయమవ్వగా దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే.. మరో 32 మంది కూడా ఇదే వైరస్ బారిన పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అయితే, వారి రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ‘వ్యాధుల నియంత్రణ, నివారణ సెంటర్’ హంటా వైరస్‌కు సంబంధించిన పలు వివరాలు తెలిపింది. ‘హంటా వైరస్ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపించే వ్యాధి. ఇంట్లో, పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకుంటే మంచిది. ఆరోగ్యవంతులకు కూడా ఈ వైరస్ సోకితే ప్రమాదమే. అయితే, ఇది అంటువ్యాధి కాదు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. కేవలం ఎలుకల లాలాజలం, వాటి గూళ్లు, ఎలుకల వ్యర్థాలు తాకినపుపడు వైరస్ మన చేతుల్లోకి చేరుతుంది. క్రిములు చేరిన చేతులతో సదరు వ్యక్తి కళ్లు, ముక్కు నోటిని తాకితే వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా కోవిడ్-19 మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, కండరాల నొప్పి, వాంతులు, డయేరియా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది.’ (చదవండి: జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా) -
సీఈవోలుగా ఇండియన్స్.. చైనా ఆందోళన
హై-టెక్ ప్రొడక్ట్‌లను తయారుచేయడంలో చైనా ముందంజలో ఉంది. కానీ ఆ ప్రొడక్ట్‌లను తయారుచేస్తున్న దిగ్గజ కంపెనీలను నడపడంలో మాత్రం వారు వెనుకంజే అట. సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు సీఈవోలుగా భారతీయులను ఎందుకు నియమించుకుంటున్నాయి? దాన్ని నుంచి చైనా ఏం నేర్చుకోవాలి? అని ప్రస్తావిస్తూ ఆ దేశపు అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్‌లో టెక్ దిగ్గజాలు భారతీయులకే ఎందుకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయో హైలెట్ చేసింది. కార్పొరేట్ కంపెనీలను పైకి ఎగిసేలా చేయడానికి భారతీయులకు సరియైన నైపుణ్యాలు ఉన్నాయని, ఆ విషయంలో సిలికాన్ వ్యాలీలోని చైనా నిపుణులు వెనుకబడి ఉన్నారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో భారత్ కంటే కూడా చైనా అత్యధిక స్థానంలోనే ఉన్నా.. ప్రపంచ దిగ్గజ కంపెనీలను నడిపించడంలో మాత్రం వెనుకబడే ఉందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో చాలా మంది భారతీయ అమెరికన్లు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారని, ప్రస్తుతం సిలీకాన్ రాజ్యమేలేది భారతీయులేని తెలిపింది. ప్రస్తుతం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల ఉన్నారు. కేవలం దిగ్గజ బహుళ జాతీయ కంపెనీలకు మాత్రమే కాక, ఇతర కంపెనీలకు కూడా భారతీయులే సారథ్యం వహిస్తున్నారని పేర్కొంది. శాన్డిస్క్‌కు సంజయ్ మెహ్రోత్రా, పెప్సికోకు ఇంద్రానూయీ వంటి వారి కూడా దశాబ్ద కాలంగా కంపెనీలను విజయవంతమైన బాటలో నడిపిస్తున్నట్టు తెలిపింది. వారికి భిన్నంగా చైనీస్ మాత్రం సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో టాప్ స్థానాల్లో ఎవరూ లేరని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి గల కారణాలను కూడా గ్లోబల్ టైమ్స్ వివరించింది. భారతీయులు ఎక్కడికి వెళ్లినా... త్వరగా అక్కడి వాతావరణాన్ని అలవరుచుకుంటారని ఐడీసీ చైనా గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ చెరిస్ డాంగ్ తెలిపారు. చైనా ప్రజలు మాత్రం తిరిగి స్వదేశానికి వచ్చేస్తారని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో ఇంగ్లీష్ భాషను అనర్గళంగా మాట్లాడగలగడం, వెంటనే అర్థం చేసుకోగలగడం వచ్చి ఉండాలి. కానీ చైనీస్ మాత్రం ఈ భాష సమస్యను తట్టుకోలేక తిరిగి స్వదేశ బాట పడుతున్నారని వివరించారు. అమెరికా హై-టెక్ సంస్థల్లోని భారతీయ సంతతి సీఈవోలు మాస్టర్స్ డిగ్రీని కానీ సైన్స్‌లోని పీహెచ్డీ డిగ్రీని కానీ కలిగి ఉంటున్నారని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు ఎంబీఏ డిగ్రీలు చాలా సామాన్యమైన విద్యా అర్హతలుగా మారాయని తెలిపారు. ఇలా మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ భారతీయులకు ఎక్కువగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక విదేశీ కంపెనీలు ఎక్కువగా భారత్‌లో అవుట్సోర్సింగ్ సెంటర్లను, రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని డాంగ్ చెప్పారు. దాంతో భారతీయులు ఎక్కువగా లబ్దిపొందుతున్నారని, వారు టాప్ స్థానాల్లో నిలిచేందుకు అవి దోహదం చేస్తున్నాయని డాంగ్ అన్నారు. -
చైనాలో మసీదులపై జాతీయ జెండా
బీజింగ్: దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు అన్ని మసీదుల్లో నిత్యం చైనా జాతీయ జెండాను ఎగురవేయాలని చైనా ఇస్లామిక్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో పాటు చైనా రాజ్యాంగాన్ని, సోషలిస్టు విలువలను తప్పనిసరిగా అభ్యసించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచే గ్లోబల్ టైమ్స్ ఓ లేఖను ప్రచురించింది. పలువురు చైనా నిపుణులు దీనిని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని చదవటం వల్ల మతపరమైన అభివృద్ధి కూడా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 20 లక్షల మంది ముస్లింలున్నారు. -
భారత గ్రాడ్యుయేట్లపై చైనా ఆసక్తికర వ్యాఖ్యలు
బిజినెస్ గ్రాడ్యుయేట్లు... భారత్‌కు బలమైన వారు కాదట. వీరు భారత్‌కు బలహీనంగా మారుతున్నట్టు చైనా వ్యాఖ్యానించింది. చాలా మంది బిజినెస్ గ్రాడ్యుయేట్లు అమెరికాలోని టాప్ బహుళ జాతీయ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌ల్లో టాప్ పోస్టుల్లో ఉన్నారని, వారు సొంతంగా మల్టినేషనల్ కంపెనీలు నిర్మించనంత వరకు భారత్‌కు ఎలాంటి ఉపయోగకరం లేదంటూ పేర్కొంది. భారత్‌లో ఎంబీఏ గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఉన్నారని, అది భారత్‌కు ఒకానొక బలమైనప్పటికీ, ఉద్యోగాల పరంగా చూస్తే వారు భారత ఆర్థిక వ్యవస్థకు బలహీనంగా మారుతున్నట్టు చైనీస్ ప్రభుత్వ రంగ న్యూస్ అవుట్లెట్ గ్లోబల్ టైమ్స్ తన ఆర్టికల్‌లో తెలిపింది. ఉన్నత స్థాయి టెక్నికల్, మేనేజ్మెంట్ స్టాఫ్ ఎక్కువగా విదేశీ కంపెనీలకే సేవలందిస్తున్నారని పేర్కొంది. దీంతో ఆర్థిక వృద్ధిలో భారత్, చైనాను అధిగమించలేకపోతుందని తెలిపింది. ప్రతిభావంతులైన భారత మేనేజర్లతో భారత్ సొంతంగా బహుళ జాతీయ కంపెనీలను ఏర్పాటుచేయాల్సి ఉందని వివరించింది. ''ఆర్థిక వృద్ధిని పెంచుకోవాలంటే, భారత్‌కు ఉన్నత స్థాయి కంపెనీలు కావాలి. సొంతంగా టాప్ మల్టినేషనల్ కంపెనీలను నిర్మించుకోవాలి. భారతదేశం వ్యవస్థాపకతకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించాలి'' అని గ్లోబల్ టైమ్స్ ఆర్టికల్ ప్రచురించింది. సొంత వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికే భారత్, మంచి వాతావరణం కల్పించనప్పుడు, విదేశీ పెట్టుబడిదారులకు మంచి వాతావరణం ఎలా సృష్టిస్తారని ప్రశ్నించింది. ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పటికీ, విదేశీ పెట్టుబడులు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సిందేనని వ్యాఖ్యానించింది. చైనాతో భారత్‌ను పోల్చినప్పుడు, చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపింది. ఎందుకంటే తమ దేశంలో చాలా మంది ప్రజలు వ్యాపారాలను స్థాపించడం, మార్కెట్ ఆర్ధిక సంపదకు తోడ్పడటం, ఆర్ధికవృద్ధికి పునాది వేయడం చేస్తున్నారని పేర్కొంది. -
గుజరాత్ ఫలితాలపై చైనా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పుపై దేశప్రజల్లో ఆసక్తి సహజమే అయినా అంతర్జాతీయంగానూ గుజరాత్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చైనా గుజరాత్ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. మన ఎన్నికల ఫలితాలపై చైనాకు ఎందుకంత క్రేజ్ అంటే చైనా సొంత ప్రయోజనాలు ఈ ఎన్నికలతో ముడిపడటమే. భారత్‌లో పెరుగుతున్న చైనా పెట్టుబడుల నేపథ్యంలో గుజరాత్ మోడల్‌కు, మోదీ విధానాలకు పరీక్షగా ఈ ఎన్నికలను చైనా భావిస్తోంది. బీజేపీ భారీ ఆధిక్యంతో గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పలు విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు జనామోదం లభించినట్టు చైనా భావిస్తోంది. అదే సమయంలో స్వల్ప ఆధిక్యంతో బీజేపీ గట్టెక్కినా, ఓటమి పాలైనా సంస్కరణలపై మోదీ సర్కార్ ముందుకెళ్లడంపై సందేహాలు అలుముకుంటాయని అంచనా వేస్తోంది. భారత్‌లో చైనా కంపెనీల పెట్టుబడులు పెరుగుతుండటంతోనే భారత్‌లో ఆర్థిక సంస్కరణల పట్ల చైనా అమితాసక్తి కనబరుస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు మోదీ సంస్కరణల అజెండాపై పెను ప్రభావం చూపుతుందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ స్పష్టం చేసింది. 2015తో పోలిస్తే 2016లో భారత్‌లో చైనా పెట్టుబడులు పలు రెట్లు అధికమని, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిస్తే మోదీ యంత్రాంగం ఆర్థిక సంస్కరణలపై మరింత దూకుడుగా ముందుకెళుతుందని పేర్కొంది. గుజరాత్లో బీజేపీ ఓటమి పాలైతే మాత్రం ఆర్థిక సంస్కరణలపై మోదీ వైఖరిపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేసింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక మార్కెట్లలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. -
ఇండియా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే!
బీజింగ్ : చైనా మీడియా మరోసారి భారత్ పై తన అక్కసును వెల్లగక్కింది. భారత డ్రోన్‌ను కూల్చేశామని ఈ మధ్యే చైనా సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ శనివారం తన ఎడిటోరియల్‌లో ఓ సుదీర్ఘ కథనాన్నే ప్రచురించింది. దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో భారత్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. ‘‘ఇండియా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అన్న కథనంతో రాసిన ఆ సంపాదకీయంలో ఇండియా చర్యలను తప్పుబట్టింది. ‘‘భారత, చైనా సైన్యం మోహరింపుల నడుమ ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో సరిగ్గా అదే ప్రాంతంలో డ్రోన్ సంచారం చేసింది. అది సమస్యాత్మక ప్రాంతం అని తెలిసి కూడా కవ్వింపు చర్యలు చేపట్టడం దారుణం. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని చైనా భావిస్తోంది. కానీ, భారత్ సరిగ్గా వ్యవహరించటం లేదు. సాంకేతిక సమస్య అన్న కారణం చెబుతున్నప్పటికీ.. సరిగ్గా అదే స్థలంలో జరగటం సహేతుకంగా లేదు. ఒకవేళ చైనా నుంచి ఇలాంటి ఘటనే ఎదురయితే అంతర్జాతీయ సమాజం దృష్టిలో మమల్ని దోషులుగా నిలబెట్టేందుకు భారత్ తీవ్రంగా యత్నించేది. కానీ, చైనా భారత్ నుంచి స్నేహాన్ని మాత్రమే కోరుకుంటోంది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత నివేదికతో భారత్ వైఖరిని ఎండగడతాం’’ అని ఆ కథనంలో పేర్కొంది. ఇక భారత సైన్యం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది తెలిసిందే. ఇజ్రాయెల్ రూపొందించిన హోరోన్ అనే ఈ డ్రోన్ భారత్-చైనా సరిహద్దులోని కొండ ప్రాంతాల్లో నిఘా పర్యవేక్షణ కోసం గత కొంత కాలంగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తటంతో అది సరిహద్దును దాటిందని భారత ఆర్మీ చెబుతోంది. అయినా చైనా మాత్రం ఆ వివరణపై సంతృప్తి వ్యక్తం చేయటం లేదు. -
మోదీ-అబె : మండిపడుతున్న చైనా
సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-జపాన్ బంధంపై చైనా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ తమకు రాకపోవడం, డోక్లామ్ వ్యవహారంలో ఎదురు దెబ్బ తగలడంతో.. తన ఆక్రోశాన్ని మరో రూపంలో చైనా బయట పెడుతోంది. తాజాగా నరేంద్ర మోదీ-షింజో అబెల సాన్నిహిత్యంపై చైనా మీడియా నిప్పులు కురిపించింది. హైస్పీడ్ రైల్ విషయంలో వాళ్లిద్దరూ తమగోతిని తామే తవ్వుకుంటున్నారని చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబెల్ టైమ్స్ పేర్కొంది. ఆసియాలోని ఏ దేశం కూడా సాంకేతికంగా, జాతీయ భద్రత విషయంలో చైనాకు సరితూగవని చెప్పింది. ఆసియా ఖండం నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.. అందులో సందేహం లేదు.. అయితే ఈ అబివృద్ధి పరుగుపందెంలో.. ఎవరు ముందుగా గమ్యం చేరతారో వారే విజేతగా నిలుస్తారు. ఇందులో ఇప్పటికై చైనా ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని.. ఇప్పుడు కొత్తగా భారత్-జపాన్‌లు ఏం సాధించగలవని గ్లోబెల్ టైమ్స్ అపహాస్యం చేసింది. ఆసియాలో అత్యంత సంకుచితంగా ఆలోచించే దేశం జపాన్ అంటూ ఆ పత్రిక నిందారోపణలు చేసింది. బారత్-జపాన్‌లు ఎంత దగ్గరైనా.. చైనాకు వచ్చే నష్టం ఏమీలేదని ఆ పత్రిక పేర్కొంది. -
భారత్‌పై డ్రాగన్ బుసలు: ట్రేడ్ వార్ ప్రారంభం
బీజింగ్ : భారత్‌పై డ్రాగన్ మరోసారి బుసలు కొట్టింది. ఇటీవల డొక్లామ్ వివాదానంతరం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు చైనా తనదైన శైలిలో వార్నింగ్‌లు ఇస్తూనే ఉంది. తాజాగా 93 చైనా ఉత్పత్తులపై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీలు విధించిన అనంతరం ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ పరిణామాలు కనిపిస్తున్నాయంటూ రెండు ఆ దేశ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. భారత్ తీసుకునే చర్యలకు చైనా ప్రతీకారం తీర్చుకోగలందంటూ తమ అక్కసును వెల్లగక్కాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టే చైనీస్ సంస్థలు ప్రమాదాల గురించి పునరాలోచించాలని అక్కడి అధికారిక కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అంతేకాక భారత్ తీసుకునే చర్యలకు ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు కూడా ఆ దేశమే సిద్దమై ఉండాలని గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. భారత ఉత్పత్తులపై పరిమితులు విధించి, తేలికగా చైనా ప్రతీకారం తీర్చుకోగలదని తన అక్కసును వెల్లగక్కింది. చైనా నుంచి వచ్చే 93 ఉత్పత్తులపై గత బుధవారం భారత ప్రభుత్వం యాంటీ-డంపింగ్ డ్యూటీలు విధించింది. దీంతో భారత్, చైనాల మధ్య ట్రేడ్‌వార్ పరిణామాలు కనిపిస్తున్నాయని గ్లోబల్ టైమ్స్ రిపోర్టు పేర్కొంది. ఒకవేళ భారత్ నిజంగా చైనాతో ట్రేడ్ వార్‌కు సిద్ధమైతే, కచ్చితంగా చైనా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, కానీ అంతేమొత్తంలో భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సిక్కిం సరిహద్దు డొక్లామ్‌లో నెలకొన్న టెన్షన్ వాతావారణం వల్ల భారత్, చైనాల మధ్య ట్రేడ్ పరిస్థితులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ వివాదానంతరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విషయంలో గ్లోబల్ టైమ్స్, భారత్‌కు వార్నింగ్ ఇచ్చింది. భారత్‌లో ఆర్థిక సహకార ప్రాజెక్టులు లేదా పెట్టుబడులను చైనా తాత్కాలికంగా రద్దు చేస్తుందంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనీస్ డైలీ కూడా భారత్‌కు వార్నింగ్ ఇస్తోంది. చైనీస్ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేస్తే, భారత్‌కే ప్రమాదమని తన ఆర్టికల్‌లో పేర్కొంది. ఈ విషయంలో భారతే ఎక్కువగా బాధపడాల్సి వస్తుందని తెలిపింది. కాగ, మన దేశీయ ఎగుమతులు యేడాదియేడాదికి 12.3 శాతం మేర పడిపోగా, చైనా నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులు మాత్రం 2 శాతం పెరగడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు భారత్‌కు 47 బిలియన్ డాలర్ల మేర ఏర్పడింది. -
యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైంది: చైనా
బీజింగ్: భారత్‌తో యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. యుద్ధం వద్దు అనుకుంటే భారతే డొక్లాంలో సైన్యాన్ని వెనక్కుపిలవాలని సూచించింది. ఆలస్యమైన తర్వాత సైన్యాన్ని వెనక్కు పిలిచినా ప్రయోజనం ఉండబోదని బుధవారం హెచ్చరించింది. తన ఎడిటోరియల్ కాలమ్‌లో భారత్‌పై తీవ్రంగా విరుచుకుపడిన గ్లోబల్ టైమ్స్.. సమయం మించిపోతోందని, ఇకనైనా భారత్ ఊహల్లోంచి బయటకొచ్చి ప్రత్యక్ష ప్రపంచాన్ని కళ్లు తెరచి చూడాలని వ్యాఖ్యానించింది. ముందుగానే సైన్యాన్ని డొక్లాం నుంచి ఎందుకు ఉపసంహరించుకోలేదా అని భారత్ బాధపడాల్సివస్తుందని చేతికొచ్చినట్లు రాతలు రాసింది. ఇప్పటికే ఏడు వారాలు గడిపోయాయని చెప్పుకొచ్చిన గ్లోబల్ టైమ్స్.. సమయం గడిచేకొద్దీ శాంతి బాట మూసుకుపోతుందని తెలిపింది. పదేపదే పత్రికలో వస్తున్న హెచ్చరికలను భారత్ పెడచెవిన పెడుతోందని.. కళ్లు, చెవులు ఉన్న వారికి తామిచ్చే సమాచారం చేరుతుందని వ్యాఖ్యానించింది. -
దోవల్ వల్లే డోక్లామ్ ఉద్రిక్తత: చైనా
బీజింగ్/న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులోని డోక్లామ్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వల్లే ఉద్రిక్తత నెలకొందని చైనా అధికార మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం ఆరోపించింది. గురువారం నుంచి జరిగే బ్రిక్స్ దేశాల జా తీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) సమావేశం కోసం బీజింగ్‌కు వెళ్తున్న దోవ ల్.. సరిహద్దు వివాదంపై చైనా ఎన్ఎస్ఏ తో చర్చించే అవకాశమున్న నేపథ్యంలో ఈ విమర్శలు చేయడం గమనార్హం. చైనాతో ముప్పు: ఆర్మీ వైస్ చీఫ్ భారత పొరుగు ప్రాంతాల్లోని హిమాలయాల వెంబడి చైనా ప్రభావం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో మనకు ముప్పుగా మారొచ్చని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ చెప్పారు. చైనా తన భద్రతపై చేస్తున్న ఖర్చులో చాలా భాగాన్ని బహిర్గతం చేయడం లేదని అన్నారు.ఈ పరిస్థితుల్లో భారత్ తన సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలన్నారు. -
ఆ పురస్కారాన్నేరద్దు చేయాలి
బీజింగ్: తమ తమ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు అందజేసే నోబెల్ పురస్కారాన్ని రద్దు చేయాలని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వాదించింది. ఈ పురస్కారం మంజూరులో రాజకీయాలు ఎక్కువయ్యాయని, విజేతల్లో ఎక్కువ మంది యూరప్ లేదా అమెరికా వాళ్లుండటమే ఇందుకు నిదర్శనమని వాదించింది. చైనాలో హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి నిర్బంధాన్ని ఎదుర్కొన్న నోబెల్ గ్రహీత లియు జియబో ఈనెల 13న మరణించిన నేపథ్యంలో ఈ వ్యాసం ప్రచురితమైంది. లియు శాంతిదూత కాదని, యుద్ధపిపాసి అని డ్రాగన్ నిందించింది. పాశ్చాత్య సమాజం ఉద్దేశపూర్వకంగా ఈ వాస్తవాన్ని విస్మరించిందని విమర్శించింది. చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న దలైలామాకు నోబెల్ ఇవ్వడం ద్వారా అవార్డు కమిటీ పొరపాటు చేసిందని ఆక్షేపించింది. -
మళ్లీ బరితెగించిన చైనా మీడియా
-
మళ్లీ బరితెగించిన చైనా మీడియా
బీజింగ్: చైనా మీడియా మరింత హద్దు మీరుతోంది. ఒక్క సిక్కింలోని డోక్లామ్‌లోనే కాకుండా ఇప్పుడు మరిన్ని ప్రాంతాల విషయంలో రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. డోక్లామ్ మాత్రమే కాకుండా నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలను కూడా భారత భూభాగంగా చైనా గుర్తించబోదంటూ రెచ్చగొట్టేలాగా కథనాలు వెలువరించింది. చైనాలో గ్లోబల్ టైమ్స్ అనే మీడియా సంస్థ తన కథనంలో చైనా కేవలం డోక్లామ్ భూమినే కాకుండా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఇతర భూభాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని, వాటిని భారత భూభాగంగా గుర్తించబోదని పేర్కొంది. అంతేకాదు, తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు యుద్ధానికి కూడా వెనుకాడబోమంటూ మరోసారి రెచ్చగొట్టేలా కథనం వెలువరించింది. అంతేకాదు, సరిహద్దు నిర్మాణం విషయంలో చైనా మరింత కఠినంగా ఉండాలని, వేగంగా సైన్యాన్ని సరిహద్దు వద్ద మోహరించి తిప్పాలని, డోక్లామ్ వద్ద సరిహద్దు నిర్మాణం పూర్తి చేయాలంటూ పేర్కొంది. -
మోదీపై చైనా మీడియా ప్రశంసల జల్లు
బీజింగ్: ఓ పక్క సిక్కిం విషయంలో భారత్‌పై అవాకులు చెవాకులు పేలుతూ రాతలు రాస్తున్న చైనా మీడియా అనూహ్యంగా భారత ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించింది. భారత్‌లో తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను విధానం చరిత్రాత్మకం అంటూ కితాబునిచ్చింది. ఈ ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందంటూ వ్యాఖ్యానించింది. 'అతి తక్కువ ఖర్చుతో కూడిన తయారీ రంగం మెల్లగా చైనా నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు భారత్‌కు క్లిష్టతరంగా మారనుంది. త్వరలో ప్రపంచ మార్కెట్లో చైనాను భారత్ భర్తీ చేయగలదు' అంటూ అక్కడి వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది. భారత్-చైనాకు సరిహద్దుగా ఉన్న సిక్కిం ప్రాంతం విషయంలో చైనా ప్రతి రోజు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కథనాలు వెలువరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా నెల రోజులుగా ఈ తంతు కొనసాగుతోంది. కానీ అనూహ్యంగా గ్లోబల్ టైమ్స్ ఈ కథనం వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ మౌలిక వసతుల లేమి ఉంటుందని, విధానాల అమలులో ఆయా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఎదురవుతుంటాయనే ఇదే భారత్‌కు కొంత వెనుకకు లాగే అంశమని కూడా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే, ఆ సమస్యను కూడా ప్రస్తుతం భారత్ అధిగమిస్తుందని పేర్కొంటూ 'కొత్త పన్ను శకం(జీఎస్టీ) భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత ఊపునిస్తుంది. ఎందుకంటే, ఆయా రాష్ట్రాల మధ్య పన్ను వైరుధ్యాలను ఈ కొత్త నిర్ణయం రూపుమాపుతుంది. కేంద్ర, రాష్ట్ర పన్నులను ఏకం చేస్తుంది. దీంతో కామన్ నేషన్ మార్కెట్ ఏర్పడుతుంది. దీంతో మౌలిక రంగంలో పోటీని కూడా అధిగమించనుంది. ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇండియా కార్యక్రమం ప్రారంభించిన 2014 సెప్టెంబర్నాటి నుంచి భారత్‌ను మరింత ఐక్యంగా ఉంచేందుకు శాయాశక్తులా భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేందుకు మంచి చర్య' అంటూ చైనా మీడియా వెల్లడించింది.