మోదీ-అబె : మండిపడుతున్న చైనా | India and Japan are lost | Sakshi
Sakshi News home page

మోదీ-అబె : మండిపడుతున్న చైనా

Published Thu, Sep 14 2017 2:28 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

మోదీ-అబె : మండిపడుతున్న చైనా - Sakshi

మోదీ-అబె : మండిపడుతున్న చైనా

సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-జపాన్‌ బంధంపై చైనా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది. భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ తమకు రాకపోవడం, డోక్లామ్‌ వ్యవహారంలో ఎదురు దెబ్బ తగలడంతో.. తన ఆక్రోశాన్ని మరో రూపంలో చైనా బయట పెడుతోంది.  తాజాగా నరేంద్ర మోదీ-షింజో అబెల సాన్నిహిత్యంపై చైనా మీడియా నిప్పులు కురిపించింది. హైస్పీడ్‌ రైల్‌ విషయంలో వాళ్లిద్దరూ తమగోతిని తామే తవ్వుకుంటున్నారని చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబెల్‌ టైమ్స్‌ పేర్కొంది.

ఆసియాలోని ఏ దేశం కూడా సాంకేతికంగా, జాతీయ భద్రత విషయంలో చైనాకు సరితూగవని చెప్పింది. ఆసియా ఖండం నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.. అం‍దులో సందేహం లేదు.. అయితే ఈ అబివృద్ధి పరుగుపందెంలో.. ఎవరు ముందుగా గమ్యం చేరతారో వారే విజేతగా నిలుస్తారు. ఇందులో ఇప్పటికై చైనా ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని.. ఇప్పుడు కొత్తగా భారత్‌-జపాన్‌లు  ఏం సాధించగలవని గ్లోబెల్‌ టైమ్స్‌ అపహాస్యం చేసింది. 

ఆసియాలో అత్యంత సంకుచితంగా ఆలోచించే దేశం జపాన్‌ అంటూ ఆ పత్రిక నిందారోపణలు చేసింది. బారత్‌-జపాన్‌లు ఎంత దగ్గరైనా.. చైనాకు వచ్చే నష్టం ఏమీలేదని ఆ పత్రిక పేర్కొంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement