బీజింగ్: దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు అన్ని మసీదుల్లో నిత్యం చైనా జాతీయ జెండాను ఎగురవేయాలని చైనా ఇస్లామిక్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో పాటు చైనా రాజ్యాంగాన్ని, సోషలిస్టు విలువలను తప్పనిసరిగా అభ్యసించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచే గ్లోబల్ టైమ్స్ ఓ లేఖను ప్రచురించింది. పలువురు చైనా నిపుణులు దీనిని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని చదవటం వల్ల మతపరమైన అభివృద్ధి కూడా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 20 లక్షల మంది ముస్లింలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment