భారత్, చైనాలకు 'గ్లోబల్ టైమ్స్' హెచ్చరిక | India, China must not fall into rivalry trap: Chinese daily | Sakshi
Sakshi News home page

భారత్, చైనాలకు 'గ్లోబల్ టైమ్స్' హెచ్చరిక

Published Mon, Jan 26 2015 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

భారత్, చైనాలకు 'గ్లోబల్ టైమ్స్' హెచ్చరిక

భారత్, చైనాలకు 'గ్లోబల్ టైమ్స్' హెచ్చరిక

 బీజింగ్: పాశ్చాత్య దేశాలు సృష్టించిన పోటీ ఉచ్చులో పడొద్దని చైనా అధికార దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' భారత్, చైనాలను హెచ్చరించింది. నిగూఢ ఉద్దేశాలతో పాశ్చాత్య ప్రపంచం ఈ రెండు దేశాలను సహజ ప్రత్యర్థులుగా ప్రచారం చేస్తోందని ఆరోపించింది. చైనా ఎదుగులను అడ్డుకోవడానికి అమెరికా వ్యూహానికి మద్దతు పలకవద్దని కోరింది.  భారత గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్యంలో సోమవారం ఓ వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

భారత్, చైనాలు ఒకరిని దెబ్బతీసి ఒకరు లాభపడే పోటీని కోరుకోవడం లేదని, అయితే పాశ్చాత్య దేశాల ప్రభావంతో భారత్ ఆ పోటీవైపు సాగుతోందని పేర్కొంది. ఇరు దేశాలు తమ విభేదాలను చర్చలతో పరిష్కరించుకుని, సంబంధాలను పరిరక్షించుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement