చైనాకు భారత్ భయం!!
చైనాకు భారత్ భయం!!
Published Mon, Sep 26 2016 5:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
బీజింగ్ : ఓయ్ చైనా, తమ మేజర్ టెలికాం సంస్థ హ్యువాయ్, భారత్లో తయారీప్లాంట్ను నెలకొల్పుతోంది. ఇప్పటివరకు ఇక్కడ జరుగుతున్న ప్రొడక్షన్ అంతా భారత్కు తరలిపోతోంది. ప్రతిఫలంగా చైనాలో ఉద్యోగాలకు ఎసరొస్తుంది జాగ్రత్త. ఇవన్నీ చైనాలోని ఓ మీడియా సంస్థ తన స్వదేశానికి చేసిన హెచ్చరికలు.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా పేరొందుతున్న చైనాకు, ఇండియాకు ఎకానమిక్ పరంగా ఈ మధ్య కాలంలో తీవ్రమైన పోటీ నెలకొంది. చైనాలోని ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలు, ఆటోపరిశ్రమలు భారత్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. చైనాలో ప్రొడక్ట్లను తయారుచేసి, ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టడం ఎందుకని డైరెక్ట్గా ఇక్కడే తయారీ ప్లాంట్ల స్థాపనకు అనుమతులు పొందుతున్నాయి. చైనా నుంచి ప్రొడక్షన్ యూనిట్లను భారత్కు తరలించేస్తున్నాయి. చైనా నుంచి భారత్కు ఇండస్ట్రియల్ ట్రాన్సఫర్పై తమ దేశం ఆందోళన చెందాల్సిందేనని ఆ దేశ మీడియా గ్లోబల్ టైమ్స్ రిపోర్టు చేసింది. భారత్లో చైనా ప్లాంట్ల విస్తరణ తమ ఉద్యోగాలకు గండికొడుతుందని బీజింగ్ ను గ్లోబల్ టైమ్స్ ఓ ఆర్టికల్లో హెచ్చరించింది.
భారత్లో స్మార్ట్ఫోన్ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటంతో హ్యువాయ్ తయారీ సౌకర్యాలను ఇక్కడే నెలకొల్పాలని భావించింది. ఈ నేపథ్యంలోనే భారత్లో తయారీ ప్లాంట్ను నెలకొల్పుతామని వెల్లడించింది. దీన్ని ఫలితంగా చైనాలో హ్యువాయ్ తయారీ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం పడే అవకాశలున్నట్టు వెల్లడవుతోంది. ఇటీవల కాలంలో చాలా చైనీస్ కంపెనీలు స్మార్ట్ఫోన్ వర్తకుల కోసం భారీగా ప్రొడక్షన్ చైన్లను ప్రారంభించాయి.ఈ చైన్లలో ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారో చెప్పడం కష్టం. అంతమంది వర్కర్లు వాటిలో జీవానాధారం పొందుతున్నారు. ప్రస్తుతం చైనా నుంచి ఇండియాకు తయారీ ప్లాంట్లు తరలిరావడం మొత్తం ఇండస్ట్రియల్ చైన్పై ప్రభావితం చూపుతుందని గ్లోబల్ టైమ్స్ తన రిపోర్టులో పేర్కొంది.
ముక్కుసూటిగా చెప్పాలంటే ఈ విషయాన్ని చైనా జీర్ణించుకోలేదని రిపోర్టు పేర్కొంది. భారత్ తయారీ ప్రక్రియలో కొత్తదనంతో ముందుకొస్తున్న నేపథ్యంలో పోటీతత్వాన్ని భరించడం కోసం నూతనావిష్కరణలతో టెక్నాలజికల్ వినియోగించుకోవాలని చైనాకు ఆ దేశ మీడియా సూచించింది. భారత్ కంపెనీ, లేబర్ చట్టాలను విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకున్న తర్వాతే చైనీస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని హెచ్చరికలు కూడా చేసింది. స్థిరమైన రాజకీయ వాతావరణం, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమిక్ గ్రోత్, ఎక్కువ జనాభా డివిడెంట్, తక్కువ లేబర్ ధరలతో భారత్ విదేశీ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తోందని రిపోర్టు పేర్కొంది.
Advertisement
Advertisement