వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్) ప్రాజెక్టుపై భారత్ తన అభిప్రాయాన్ని పునరాలోచించుకోవాలని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌టైమ్స్ పేర్కొంది. ప్రపంచదేశాలన్నీ ఓబీఓఆర్ ద్వారా ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని భావిస్తుంటే భారత్ మాత్రం అందుకు విభిన్నంగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించింది. చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు యూఎన్ మద్దతు కూడా ఉందని చెప్పింది.