column
-
Utkatasana: బలాన్ని పెంచే ఉత్కటాసనం
రోజులో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిని తక్కువ సమయంలోనే రిలాక్స్ చేస్తుంది కుర్చీ ఆసనం. ఈ కుర్చీ భంగిమను ఉత్కటాసన అంటారు. ఈ ఆసనాన్ని సాధన చేయడానికి ముందుగా శరీరాన్ని నిలుచున్న స్థానంలో సిద్ధ పరచాలి. సులువైన సాధన⇒ముందు నిటారుగా నిల్చోవాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి. ⇒కుర్చీలో కూర్చున్నట్టుగా మోకాళ్లను ముందుకు వంచాలి. దీంతో హిప్ భాగం వెనక్కి, మోకాళ్లు ముందుకు వచ్చి, చెయిర్ మీద కూర్చున్న భంగిమ వస్తుంది. ⇒చేతులను నమస్కారం చేసినట్టుగా ఒక దగ్గరగా చేర్చాలి. ⇒ఈ భంగిమలో పొట్ట భాగం లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ∙దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ, వదులుతూ వీలైనంత వరకు ఈ ఆసనంలో ఉండచ్చు. ⇒5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్నిప్రాక్టీస్ చేయడం ద్వారా కండరాలు బలపడతాయి. మెరుగైన పనితీరు⇒కాలు, కాలు వెనుక, భుజం కండరాలను బలోపేతం అవుతాయి. ∙రక్తప్రసరణ, గుండెపనితీరు పెరుగుతుంది. శ్వాసక్రియ మెరుగుపడటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యమూ పెరుగుతుంది. -
Business: సారూ.. మీరు.. మీ ఐటీఆరూ..
‘సారూ’ అని మాత్రమే సంబోధిస్తున్నారు.. మా సంగతేమిటి అని ఎదురుప్రశ్న వేయకండి.. మేడమ్‌గారు!! ఇది అందరికీ వర్తించే విషయమే. ఈ రోజు, ఈ కాలమ్‌లో.. ఎవరు ఏ ఫారంలో ఆదాయపు పన్ను రిటర్నులను సబ్మిట్ చేయాలనేది ప్రస్తుతపు ప్రశ్న. అసెస్సీలు వారి వారి ఆదాయాన్ని ఒక నిర్దేశించిన ఫారంలోనే తెలియజేయాలి. ఈ ఫారంలో అన్ని కాలమ్‌లు సంపూర్ణంగా నింపి, రిటర్నుని లేదా ఫారంని ఫైల్ చేయాలి. ఫారం చాలా ముఖ్యమైన డాక్యుమెంటు. మీ ఆదాయాన్ని బట్టి, ఏ ఫారం ఎవరు ఫైల్ చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీ క్యాటగిరీని బట్టి.. అంటే స్టేటస్ .. అంటే మీరు వ్యక్తులా, కంపెనీయా, ఉమ్మడి కుటుంబమా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఏడు రకాల ఫారమ్‌లు అమల్లో ఉన్నాయి. ఫారం 1 లేదా సహజ్ని వ్యక్తులు, రెసిడెంట్లు, కేవలం జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం మాత్రమే ఉంటేనే వేయాలి. ఈ రూపంలో వచ్చే ఆదాయం రూ. 50,00,000 దాటని వారు వేయొచ్చు. ఫారం 2 ని వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం కూడా వేయొచ్చు. జీతం, పెన్షన్, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉండి, మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితేనే వెయ్యాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ఈ ఫారం వేయకూడదు. ఇక ఫారం 3. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం.. వ్యాపారం, వృత్తి మీద ఆదాయం/లాభం ఉన్న వారు, ఇతరత్రా అన్ని ఆదాయాలతో పాటు ఈ ఫారం వేయొచ్చు. నాలుగో ఫారం తీసుకుంటే.. దీన్నే సుగమ్ అని కూడా అంటారు. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, వ్యాపారం.. వృత్తిపరమైన ఆదాయాలు, ఇతరత్రా ఆదాయాలు ఉన్నవారు దీన్ని వేయాలి. లెక్కలతో నిమిత్తం లేకుండా కేవలం టర్నోవరు మీద నిర్దేశించిన శాతం కన్నా ఎక్కువ లాభం చూపించే వారు ఈ ఫారం వేయొచ్చు. ఇక ఐటీఆర్ 5. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ట్రస్టులు, వ్యక్తుల కలయిక అంటే గ్రూప్ లేదా అసోసియేషన్, ఎల్ఎల్పీలు, కంపెనీలు మొదలైన వారు వేయొచ్చు. మరొకటి ఫారం 6. కంపెనీలు మొదలైనవి, కంపెనీల చట్ట ప్రకారం నమోదు అయినవి వేయాలి. విదేశీ కంపెనీలు కూడా వేయొచ్చు. కొన్ని సంస్థలను కంపెనీగా పరిగణిస్తారు. అటువంటివి కూడా ఈ ఫారం వేయాలి. చివరగా ఫారం 7. మతపరమైన ధారి్మక సంస్థలు, హాస్పిటల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ సంస్థలు, ఎన్జీవోలు మొదలైన సంస్థలు ఈ ఫారం వేయాలి. ఈ ఫారాల సంగతి ఇది.. స్థూలంగా చెప్పాలంటే వేతన జీవులకు ఫారం 1 లేదా ఫారం రెండు వర్తిస్తుంది. అయితే, వీరికి వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉంటే ఫారం 3 లేదా ఫారం 4 వేయాలి. జీతమే ఉంటే ఫారం 1 లేదా 2, వ్యాపారమే ఉంటే ఫారం 3 లేదా 4 వేయాలి. వెనకటికి కుప్పుస్వామీ మేడ్ ఇట్ డిఫికల్ట్ (kuppuswamy made it difficult) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే ఉన్నాయి ఈ ఫారాలు కూడా. ఏ కేటగిరిలో ఎవరు వేశారు, ఎంత ఆదాయం డిక్లేర్ చేశారు మొదలైన సమాచారం కోసం వెసులుబాటుగా ఉండాలని ఇన్ని ఫారాలు. ఈ కాలమ్ ద్వారా ప్రతి వారం మీకు మీ సంశయాలు తీరుస్తాం. ఓపిగ్గా వెయిట్ చేయండి. ఇవి చదవండి: మార్చిలో ఎంఎఫ్‌లు డీలా -
కమల్‌హాసన్ ముస్లిమా..? అసలు పేరు..
హీరో కమల్‌హాసన్ ముస్లిమా?. కాదు. కానీ, ఆదివారం ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్‌లో లెజండరీ హీరో హిందూ వ్యతిరేక కామెంట్లు చేశారని, ఆయన ఇస్లాంను నమ్ముతారని కాలమిస్టు ఆరోపించారు. కాలమ్ వివాదాస్పదంగా మారడంతో ఆన్లైన్ వెర్షన్ లోని కాలమ్ నుంచి వివాదాస్పద పేరాగ్రాఫ్‌ను తొలగించారు. కమల్ తన మతాన్ని మరచి హిందూ, ముస్లింల మధ్య భేదాలను పొడసూపేలా ప్రవర్తిస్తున్నారని కాలమిస్టు తొలగించిన పేరాగ్రాఫ్‌లో వ్యాఖ్యానించారు. ఆయన మతానికి చెందిన వాళ్లే మహిళను అవమానించారనే విషయాన్ని మరిచిపోయి ఓ ముస్లింలా మాట్లాడుతున్నారని అన్నారు. మహాభారతం లాంటి వాటిపై కామెంట్లు చేయడం కన్నా.. సమకాలీన సమస్యలైన త్రిపుల్ తలాక్ లాంటి వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మతాలపై మాట్లాడటప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుంటే బాగుంటుందని అన్నారు. అసలు కాలమిస్టు కమల్‌ను ఓ ఇస్లామిస్టుగా పేర్కొనడానికి కారణం.. ఆయన మహాభారతాన్ని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్. కొద్ది రోజుల కిందట కమల్ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. రెండు కుటుంబాల గొడవల్లో ఓ మహిళను పెట్టి జూదం ఆడిన వాళ్ల పండుగను దేశంలో ఎందుకు జరుపుకుంటారో తనకు అర్ధం కాదని అన్నారు. కమల్ అసలు పేరు ఇది.. తాను దేవుడిని నమ్మనని కమలే చెప్పారు. కమల్ 1952లో తమిళ బ్రహ్మణులైన అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. చెన్నైలోని పల్లవుల కాలానికి చెందిన ఓ గుడిలో 'పార్ధసారధి' అని తల్లిదండ్రలు నామకరణం చేశారు. కొద్దికాలం తర్వాత తండ్రి శ్రీనివాసన్ పార్ధసారధి పేరును కమల్‌హాసన్‌గా మార్చారు. అయితే, కమల్‌హాసన్ అని పేరును మార్చడం వెనుక కొన్ని ఇతర కారణాలున్నాయని గతంలో ఆన్లైన్లో న్యూస్ హాల్చల్ చేసింది. యాకూబ్ హసన్ అనే తన ఫ్రెండ్ గుర్తుగా శ్రీనివాసన్ కమల్‌కు కమల్‌హాసన్ అని పేరు పెట్టారని దీని సారాంశం. ఈ వార్తలను అప్పట్లో కమల్ ఖండించారు. కమల్ అంటే పద్మం అని, హాసన్ అనే పదం హాస్యం నుంచి వచ్చిందని చెప్పారు. కాగా, జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్ దేశంలో పెచ్చరిల్లుతున్న మత ఆపాదనలను ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా స్వేచ్చగా మాట్లాడే హక్కును ఇది హరిస్తుంది. -
భారత్ భయ్యా.. బుర్ర పెట్టి ఆలోచించు:చైనా
-
భారత్ భయ్యా.. బుర్ర పెట్టి ఆలోచించు:చైనా
బీజింగ్: వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్) ప్రాజెక్టుపై భారత్ తన అభిప్రాయాన్ని పునరాలోచించుకోవాలని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌టైమ్స్ పేర్కొంది. ప్రపంచదేశాలన్నీ ఓబీఓఆర్ ద్వారా ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని భావిస్తుంటే భారత్ మాత్రం అందుకు విభిన్నంగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించింది. చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు యూఎన్ మద్దతు కూడా ఉందని చెప్పింది. ఓబీఓఆర్‌పై భారత్ మనసు మార్చుకోవాలని, అపోహలు వీడి బయటిప్రపంచలోకి వచ్చి చూడాలని హితవు పలికింది. అప్పట్లో చైనా చేపట్టిన ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్(ఏఐఐబీ)ను అమెరికా వ్యతిరేకించి పొరబాటు చేసిందని.. అదే తప్పును ఓబీఓఆర్‌పై భారత్ ఇప్పుడు చేస్తోందని పేర్కొంది. భారత్ ఓబీఓఆర్‌పై ఇతర దేశాల్లో వ్యతిరేకత తీసుకురావడంలో విఫలమైతే తనే వచ్చి భాగస్వామి కావొచ్చని తెలిపింది. సమస్యాత్మక ప్రాంతమైన పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీగా పెట్టుబడులు రావడం భారత్‌ను ఆందోళనలకు గురిచేస్తుందని చెప్పింది. అయితే, సాధారణ పెట్టుబడులకు, కమర్షియల్ పెట్టుబడులకు తేడాను భారత్ గుర్తించాలని సూచించింది. ఓబీఓఆర్ ప్రాజెక్టు ద్వారా ఆసియా దేశాలతో యూరప్‌కు ఎకనమిక్ కారిడార్ ఏర్పడుతుంది. సీపీఈసీ, బీసీఐఎమ్ కారిడార్లు కూడా చైనా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఉన్నాయి.