రోజులో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిని తక్కువ సమయంలోనే రిలాక్స్ చేస్తుంది కుర్చీ ఆసనం. ఈ కుర్చీ భంగిమను ఉత్కటాసన అంటారు. ఈ ఆసనాన్ని సాధన చేయడానికి ముందుగా శరీరాన్ని నిలుచున్న స్థానంలో సిద్ధ పరచాలి.
సులువైన సాధన
⇒ముందు నిటారుగా నిల్చోవాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి.
⇒కుర్చీలో కూర్చున్నట్టుగా మోకాళ్లను ముందుకు వంచాలి. దీంతో హిప్ భాగం వెనక్కి, మోకాళ్లు ముందుకు వచ్చి, చెయిర్ మీద కూర్చున్న భంగిమ వస్తుంది.
⇒చేతులను నమస్కారం చేసినట్టుగా ఒక దగ్గరగా చేర్చాలి.
⇒ఈ భంగిమలో పొట్ట భాగం లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ∙దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ, వదులుతూ వీలైనంత వరకు ఈ ఆసనంలో ఉండచ్చు.
⇒5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్నిప్రాక్టీస్ చేయడం ద్వారా కండరాలు బలపడతాయి.
మెరుగైన పనితీరు
⇒కాలు, కాలు వెనుక, భుజం కండరాలను బలోపేతం అవుతాయి. ∙రక్తప్రసరణ, గుండెపనితీరు పెరుగుతుంది. శ్వాసక్రియ మెరుగుపడటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యమూ పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment