ట్రంప్కు చైనా గట్టి వార్నింగ్
ట్రంప్కు చైనా గట్టి వార్నింగ్
Published Mon, Dec 12 2016 11:15 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
బీజింగ్ : వన్-చైనా పాలసీపై అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలనకర వ్యాఖ్యలపై చైనా మండిపడింది. చైనీస్ ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్ టైమ్స్ లో డొనాల్డ్ ట్రంప్ను బహిరంగంగా హెచ్చరించింది. వన్-చైనా పాలసీలో సంప్రదింపులు జరగకుండా, పక్కకు నెట్టేస్తే బీజింగ్ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా శత్రువులతో కలిసి పనిచేసి ట్రంప్ భరతం పడతుందని సోమవారం పేర్కొంది. ట్రంప్ చిన్న పిల్లవాడిలా దౌత్య సంబంధాలు ఏమి తెలియకుండా అమాయకంగా మాట్లాడుతున్నారని చైనీస్ మీడియా తెలిపింది. ఒకవేళ తైవాన్ స్వాతంత్య్రానికి అమెరికా బహిరంగంగా మద్దతిచ్చినా.. ఆయుధాలు అందించినా చైనా చూస్తూ ఊరుకోద్దని వెల్లడించింది. వన్-చైనా పాలసీలో చైనా మినహాయింపులు ఇవ్వన్నప్పుడు, దాని ఆధిపత్యంలో కొనసాగాల్సినవరసం ఏముందని డొనాల్డ్ ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే.
ట్రంప్ ఆ వ్యాఖ్యలను చైనా తప్పుపట్టింది. దౌత్య సంబంధాలను బ్రేక్ చేస్తూ తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్తో డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఆ విషయంలోనూ చైనా అంతకముందే ఆగ్రహం వ్యక్తంచేసింది. 1979 నుంచి తైవాన్కు, అమెరికాకు ఎలాంటి దౌత్య ఒప్పందాలు లేవు. అయితే వాటిని బ్రేక్ చేస్తూ ట్రంప్ నిర్వహిస్తున్న ఈ పనులకు చైనాకు మింగుడు పడటం లేదు. సాయ్ ఇంగ్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన్నప్పుడు కొంచెం తక్కువగానే వార్నింగ్ ఇచ్చిన చైనా.. ఈసారి మాత్రం గట్టిగానే హెచ్చరించింది. తైవాన్, సైనో-అమెరికా సంబంధాలపై మిడిమిడి జ్ఞానంతో అనుభవరహిత వ్యాఖ్యాలను ట్రంప్ చేస్తున్నారని తన పత్రిక గ్లోబల్ టైమ్స్లో విమర్శించింది. ఓ వ్యాపారవేత్తగా వ్యాపారాలు చేయడానికి ఇలా మాట్లాడటం సర్వసాధారణం కానీ ఇక్కడే ఓ విషయం గమనించాలి. చైనాతో బిజినెస్ చేయడాన్ని తైవానే ఎప్పుడు ప్రశ్నించలేదని ఆ దేశ విదేశీ వ్యవహారాల యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు పేర్కొన్నారు. ట్రంప్ చేసే ఇలాంటి వ్యాఖ్యలు ఆయన్ను చాలా త్వరగా ఆపదలో పడేస్తాయని గుర్తుంచుకోవాలన్నారు.
Advertisement
Advertisement