వాషింగ‍్టన్: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓసారి పుతిన్ పొడుగుతూ మరోసారి రష్యాను తిడుతూ వ్యాఖ‍్యలు చేసి వార్తల్లో నిలిచారు ట్రంప్. తాజాగా ఉక్రెయిన్-రష్యా వార్ జరుగుతున్న వేళ తదుపరి దండయాత్ర తైవాన్‌పైనే అంటూ సంచలన వ్యాఖ‍్యలు చేసి అందరినీ ఆశ్చర్యయానికి గురి చేశారు.
బుధవారం ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్ మాట్లాడుతూ.. తదుపరి దాడి తైవాన్‌పై జరిగే అవకాశం ఉంది. దీని కోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. జిన్‌పింగ్ ఎంతో తెలివైన వ్యక్తి.. ఆఫ్ఘనిస్తాన్‌ను అమెరికా ఎలా వీడి వచ్చిందో ఆయన గమనించారు. అందుకే ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా ఎదుర్కొన్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పరోక్షంగా జిన్ పింగ్‌ను హెచ్చరించారు.
ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు. అగ్ర రాజ్యం అమెరికా మూర్ఖంగా వ్యవహరిస్తోందని.. అందుకే తమ నాయకులను ప్రపంచ దేశాల నేతలు అసమర్థులుగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే వారు చేయాలనుకున్నది భయం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తైవాన్‌పై దాడి జరుగవచ్చు అని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇది వారి సమయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment