jin ping
-
‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లో విచిత్రమైన భయం నెలకొంది. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండటంతో, అభివృద్ధికి ఆమడదూరంలోకి వెళ్లిపోతామని ఆయన భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్‌పింగ్ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. చైనాలో శిశుజననాల రేటు భారీగా తగ్గింది. మరోవైపు చైనా యువతులు పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంతో మహిళలదే కీలకపాత్ర అని అన్నారు. సమాజంలో కొత్త ఒరవడిని నెలకొల్పడంలో మహిళలు ముందుంటారని పేర్కొన్నారు. దేశంలో వివాహాలు, సంతాన సాఫల్యత అనే నూతన సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 2022లో చైనా సంతానోత్పత్తి రేటు చారిత్రాత్మకంగా పడిపోయి 1.09కి చేరుకుంది. దేశంలో పిల్లలు లేని జంటల సంఖ్య రెండింతలు పెరిగింది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశంలో పిల్లలు లేని జంటల వాటా 2017-2022 మధ్య 20.6 శాతం నుండి 43.2 శాతానికి చేరుకుని, రెండింతలు పెరిగింది. పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు, కెరీర్ సంక్షోభం, లింగ వివక్ష తదితర అంశాలు చైనా యువత పెళ్లికి దూరంగా ఉండటానికి కారణాలుగా నిలిచాయి. ఈ నేపధ్యంలో శిశు జననాల రేటు భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడు దేశంలోని యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా భవిష్యత్తులో చైనా వృద్ధాప్య దేశంగా మారిపోనున్నది. ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా అధికమయ్యింది. మరోవైపు చైనాలో కార్మికుల సంఖ్య తగ్గింది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం అంతకంతకూ పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు! -
సింహళ తీరంలో నిఘానేత్రం
వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌తోట అంతర్జాతీయ నౌకాశ్రయంలో చైనా సైనిక గూఢచర్య నౌక ‘యువాన్ వాంగ్5’ లంగరేయడానికి శ్రీలంక ఇచ్చిన అనుమతి చర్చోపచర్చలకు దారితీస్తోంది. సదరు పోర్ట్‌పై పట్టు బిగించిన చైనా, వ్యతిరేకిస్తున్న భారత్‌ల మధ్య సర్దుబాటు చేసుకోలేక సిలోన్ సతమతమవుతోంది. ఉపగ్రహ, రాకెట్, ఖండాంతర గతిశీల క్షిపణుల ప్రయోగాల ఆచూకీ తెలుసు కొనేందుకు వాడే ఈ ‘యువాన్ వాంగ్’ శ్రేణి పరిశోధక, సర్వే నౌక మన దేశానికి అతి సమీపంలో వారం పాటు తిష్ఠ వేయడం ఆందోళనకరమే. గగనతలాన 750 కిలోమీటర్ల పైగా కన్నేయగల ఈ షిప్పుతో కేరళ, తమిళనాడు, ఏపీల్లోని అనేక పోర్ట్‌లు చైనా రాడార్లోకి వచ్చేస్తాయి. కల్పాక్కం, కూడంకుళం లాంటి అణుపరిశోధక కేంద్రాలు సహా దక్షిణాదిలోని కీలక ప్రాంతాలూ డ్రాగన్ గూఢ చర్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వార్తలే ఇప్పుడు మన దేశాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. ఆగస్టు 11 నుంచి 17 దాకా సింహళ తీరంలో ఉండే సదరు నిఘానౌక రాక పట్ల శ్రీలంక దేశాధ్యక్షుడితోనే భారత్ తన అభ్యంతరం తెలిపింది. ఆ నౌక తమ దగ్గరకు వస్తున్నది ఇంధనం, అవసరమైన సరుకులు నింపుకోవడానికే అని సిలోన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లంకేయులకు భారత్ అందిస్తూ వస్తున్న సాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రశంసాగీతం అందుకొని, అధ్యక్షుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆర్థికకష్టాల్లోనే∙కాదు... అంతకు ముందూ ‘సువసరియా’ అంబులెన్స్ సర్వీసుకు భారత్ సాయమే వేలాది ప్రాణాలు కాపాడిందని గుర్తుచేసుకున్నారు. కానీ మాటల్లోని మెచ్చుకోలుకు భిన్నమైన శ్రీలంక చేతలే సమస్య. ఆసియా, ఐరోపాలను కలిపే సూయజ్ కాలువకూ, మలక్కా జలసంధికీ మధ్య అతి ముఖ్యమైన నౌకాయాన మార్గంలో సింహళం ఉంది. 4500 చమురు ట్యాంకర్లతో సహా దాదాపు 36 వేల నౌకలు ఆ మార్గంలో ఏటా పయనిస్తాయని లెక్క. కొలంబో నౌకాశ్రయం తర్వాత శ్రీలంకలో రెండో అతి పెద్దదైన హంబన్‌తోట ఆ కీలకమార్గంలోదే! ఆ పోర్ట్ నిర్మాణం ఆలోచన మూడు దశాబ్దాల పైగా ఉన్నా, అనేక తర్జనభర్జనలు, నివేదికల బుట్టదాఖలు తర్వాత 2005లో హంబన్‌తోట వాసి మహిందా రాజపక్స అధ్యక్షుడయ్యాక మళ్ళీ ఊపిరి పోసుకుంది. చైనా ఆర్థిక సాయంతో పన్నెండేళ్ళ క్రితం 2010లో ఈ అంతర్జాతీయ పోర్ట్ తొలిదశ పూర్తయింది. ఆర్థికంగా ఆట్టే గిట్టుబాటు కాని ఆ నౌకాశ్రయ నిర్మాణం కోసం 15 ఏళ్ళ కాలానికి చైనా ఇచ్చిన అప్పు వడ్డీలపై వడ్డీలతో ఇప్పుడు శ్రీలంక తలపై భారమై కూర్చుంది. చైనా, శ్రీలంక నౌకాసంస్థల సంయుక్త భాగస్వామ్యంలో నడుస్తున్న ఈ పోర్ట్‌ను స్వల్పకాలిక ప్రయోజనాల నిమిత్తం 99 ఏళ్ళ లీజుకిచ్చి, ద్వీపదేశం తిప్పుకోలేని తప్పు చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే శ్రీలంక క్రమం తప్పకుండా ఆ అప్పుల వాయిదాలు తీర్చాల్సిందేనని చైనా కొండెక్కి కూర్చుంది. డ్రాగన్ విసిరిన ఈ ఋణదౌత్యం వలలో చిక్కుకొని, బయటపడలేక సింహళం సతమతమవుతోంది. హంబన్‌తోట పోర్ట్‌పై చైనా నియంత్రణతో హిందూ మహాసముద్ర జలాల్లో తమ ప్రయోజనాలకు భంగమని భారత్, అమెరికాలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా చైనా నిఘానౌక వ్యవహారం ఆ అనుమానాలకూ, ఆందోళనకూ తగ్గట్టే ఉంది. శ్రీలంక ఇటు భారత్, అటు చైనాతో దోస్తీ చేస్తూ, ఇరువైపుల నుంచి లబ్ధి పొందాలని చూస్తోంది. భౌగోళికంగా తనకున్న సానుకూలతను ద్వీపదేశం వాడుకోవాలని అనుకోవడం అర్థం చేసుకోదగినదే. కానీ, ఏకకాలంలో ఇరుపక్షాలకూ కన్నుగీటడమే సమస్య. సింహళం మాత్రం వర్తమాన ఆర్థిక సంక్షోభంలో భారత, చైనాలు రెండూ అండగా నిలిచాయనీ, ఇరుదేశాలూ తమకు కీలక మిత్రులనీ తన వైఖరిని సమర్థించుకుంటోంది. దాని పరిస్థితి ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపంగా తయారైంది. ఏకకాలంలో ఇద్దరికి కన్నుగీటడం సులభమూ కాదు. సమస్యా రహితమూ కాబోదని ద్వీపదేశానికి మరోసారి తెలిసొస్తోంది. చైనానేమో చట్టబద్ధమైన తన సముద్రజల శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాల్లో ‘సంబంధిత పార్టీలు’ చొరబడడం మానుకోవాలని శ్రీరంగనీతులు చెబుతోంది. నిజానికి, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో చర్యలు చేపట్టేలా చైనా వద్ద ఏకంగా ఇలాంటి ఏడు నౌకలున్నాయి. ఇప్పటికే భూతలంపై బీజింగ్‌కు ఉన్న ట్రాకింగ్ కేంద్రాలకు ఈ నౌకలు అదనం. అందులోనూ అత్యాధునిక ట్రాకింగ్ సాంకేతికత శ్రీలంకలో లంగరేస్తున్న తాజా నౌక సొంతం. ఈ రెండు నెలలూ హిందూ మహాసముద్ర వాయవ్య ప్రాంతంలో చైనా ఉపగ్రహాల నియంత్రణ, రిసెర్చ్ ట్రాకింగ్‌ను తమ నౌక చేస్తుందని చైనా అధికారిక ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ శ్రీలంక’ (బ్రిస్ల్) మాట. కానీ, డ్రాగన్ నక్కజిత్తులు తెలిసినవారెవరైనా ఆ మాటల్ని యథాతథంగా విశ్వసించడం కష్టమే. పైగా, 2014లో కొలంబో పోర్ట్‌లో లంగరేసిన చైనా జలాంతర్గాములతో పోలిస్తే తాజా నిఘానౌక శక్తిసామర్థ్యాలు మరింత ప్రమాదకరం. మీదకొస్తున్న ఈ ముప్పు రీత్యా మనం కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టక తప్పదు. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు అది అత్యవసరం. హంబన్‌తోట నౌకాశ్రయం గనక రేపు చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ (పీఎల్ఏ) నౌకాదళానికి కేంద్రంగా మారితే, భారత్‌కు ఉత్తరాన, దక్షిణాన డ్రాగన్ ఆధిపత్యంతో మన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుంది. తస్మాత్ జాగ్రత్త! -
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. తర్వాత యుద్దం తైవాన్‌పైనే..!
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓసారి పుతిన్ పొడుగుతూ మరోసారి రష్యాను తిడుతూ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ట్రంప్. తాజాగా ఉక్రెయిన్-రష్యా వార్ జరుగుతున్న వేళ తదుపరి దండయాత్ర తైవాన్‌పైనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యయానికి గురి చేశారు. బుధవారం ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్ మాట్లాడుతూ.. తదుపరి దాడి తైవాన్‌పై జరిగే అవకాశం ఉంది. దీని కోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. జిన్‌పింగ్ ఎంతో తెలివైన వ్యక్తి.. ఆఫ్ఘనిస్తాన్‌ను అమెరికా ఎలా వీడి వచ్చిందో ఆయన గమనించారు. అందుకే ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా ఎదుర్కొన్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పరోక్షంగా జిన్ పింగ్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండిపడ్డారు. అగ్ర రాజ్యం అమెరికా మూర్ఖంగా వ్యవహరిస్తోందని.. అందుకే తమ నాయకులను ప్రపంచ దేశాల నేతలు అసమర్థులుగా చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే వారు చేయాలనుకున్నది భయం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తైవాన్‌పై దాడి జరుగవచ్చు అని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇది వారి సమయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
నేపాల్‌తో బంధం మరింత బలోపేతం: చైనా
బీజింగ్/ఖాట్మండు: రాబోయే కాలంలో నేపాల్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు చైనా తెలిపింది. పరస్పర సహాయ, సహకారాలతో ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. డ్రాగన్- హిమాలయ దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక బంధానికి నేటితో 65 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవీ భండారికి శనివారం ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ‘‘ ఎల్లప్పుడూ ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ.. సమానత్వ భావన కలిగి ఉండి పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. తద్వారా ఇరు వర్గాలకు లబ్ది చేకూరుతోంది. ఇక కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిపై పోరులో కలిసికట్టుగా పనిచేసి చైనా- నేపాల్ బంధంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాం’’అని ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల గురించి ప్రస్తావించారు. (పాక్, అఫ్గాన్, నేపాల్ మంత్రులతో చైనా భేటీ!) ఇక ఇందుకు స్పందనగా.. మానవాళి సంరక్షణకై చైనా ప్రతిపాదించిన అంశాలను స్వాగతిస్తున్నామని విద్యాదేవి అన్నారు. అదే విధంగా బెల్ట్ రోడ్ నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా చైనా ప్రీమియర్ లీ కేయాంగ్ సైతం పరస్పర విశ్వాసం కలిగి ఉండి, స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుందామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో వ్యాఖ్యానించారు. కాగా ట్రాన్స్ హిమాలయన్ కనెక్టివిటీ నెట్వర్క్(టీహెచ్‌సీఎన్- టిబెట్ గుండా చైనా- నేపాల్‌ల మధ్య అనుసంధానానికై) ప్రాజెక్టును చైనా నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే.(చైనా మరో ఎత్తుగడ.. బంగ్లాదేశ్‌కు మరిన్ని ప్రయోజనాలు!) కాగా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న నేపాల్‌ను మరింత మచ్చిక చేసుకునేందుకు డ్రాగన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇటీవల పరిణామాల ద్వారా స్పష్టమవతోంది. భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలైన లిపులేఖ్, లింపియదుర, కాలాపానీలను నేపాల్ తన భూభాగంలోకి కలుపుతూ కొత్త మ్యాప్‌లు విడుదల చేసింది. అంతేగాక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేపాల్ ప్రధాని భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం సహా.. అసలు సిసలైన రామజన్మ భూమి తమ దేశంలోనే ఉందంటూ వివాదానికి తెరతీశారు. ఈ క్రమంలో తన పదవికి ఎసరు రావడంతో చైనా ఆయనకు మద్దతుగా నిలిచింది. రాజకీయ సంక్షోభం తలెత్తకుండా, అధికార నేపాలీ కమ్యూనిస్టు పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్- చైనాల మధ్య గల్వాన్ లోయ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న వేళ నేపాల్ సహా ఇతర సరిహద్దు దేశాలతో బంధం మరింత బలపరచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక ఇప్పటికే పాకిస్తాన్‌కు మిత్రదేశంగా కొనసాగుతున్న డ్రాగన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లకు కూడా అండగా నిలుస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.(అధికార పార్టీ భేటీ వాయిదా.. రంగంలోకి ఆమె!) -
చైనాకు భారీ షాక్.. ఐసీజేలో ఫిర్యాదు
బీజింగ్: పొరుగుదేశాలతో కయ్యానికి తయారుగా ఉండే చైనా.. తన దేశం లోపల కూడా పలు అరాచకాలకు పాల్పడుతుంది. అయితే ఆ దేశంలో ప్రభుత్వ ఆంక్షలు కఠినంగా ఉండటంతో అక్కడ జరిగే దారుణాల గురించి బయట ప్రపంచానికి వెంటనే తెలియదు. ముఖ్యంగా ఉయ్ఘర్ ముస్లింల పట్ల చైనా దారుణంగా ప్రవర్తిస్తోంది. వారిని కనీసం మనుషులుగా కూడా చూడదు. మానవహక్కులు అనే మాట ఉయ్ఘర్ల విషయంలో పూర్తిగా నిషేధం. అయితే చైనా ఇన్ని అకృత్యాలకు పాల్పడుతుంటే అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తున్నాయనే అనుమానం తలెత్తవచ్చు. చైనా వీటి ఆదేశాలను అస్సలు పట్టించుకోదు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే చైనా అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్య దేశం కాదు. ఫలితంగా చైనా చేసే దుశ్చర్యలు ఐసీజే పరిధిలోకి రాకపోవడంతో అది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ఈ క్రమంలో చైనాను ఎదుర్కొనేందుకు రెండు బహిష్క్రిత ఉయ్ఘర్ల గ్రూపులు ఐసీజే తలుపు తట్టాయి. డ్రాగన్ కబంద హస్తాల నుంచి తమను కాపాడాల్సిందిగా కోరుతున్నాయి. ఆ వివరాలు.. (‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’) 1. చైనా నుంచి బహిష్కరించబడిన రెండు ఉయ్ఘర్ గ్రూపులు ప్రస్తుతం చైనా, దాని అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ పట్ల పాల్పడుతున్న నేరాల గురించి.. సృష్టిస్తోన్న మారణహోమం గురించి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాయి. 2. ప్రభుత్వం బహిష్కరణ ఎదుర్కొంటున్న తూర్పు తుర్కిస్తాన్, తూర్పు తుర్కిస్తాన్ నేషనల్ అవేకెనింగ్ ఉద్యమకారులు చైనా దాని నాయకులు కంబోడియా, తజికిస్తాన్లలో ఉయ్ఘర్లను దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించారు. 3. అయితే చైనా ఐసీజేలో సభ్య దేశం కాదు. అలాంటప్పుడు వీరు ఎలా ఫిర్యాదు చేస్తారనే ఓ అనుమానం. దానికి వారు 2018-19లో వెలువడిన ఓ తీర్పు ఆధారంగా ఫిర్యాదు చేశామంటున్నారు. ఆ తీర్పు ఏంటంటే.. ఐసీజేలోని సభ్య దేశం పట్ల.. సభ్యత్వం లేని దేశం నేరాలకు పాల్పడితే.. అంతర్జాతీయ న్యాయస్థానం తన అధికార పరిధిని విస్తరిపంచేసి.. సభ్యత్వం లేని దేశాన్ని కూడా విచారించవచ్చని ఐసీజే తెలిపింది. 4. దీని ప్రకారమే బంగ్లాదేశ్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న నేరాల గురించి మయన్మార్ ఐసీజేలో ఫిర్యాదు చేసింది. ఇక్కడ బంగ్లాదేశ్‌కు ఐసీజే సభ్యత్వం ఉండగా.. మయన్మార్‌కు సభ్యత్వం లేదు. 5. ప్రస్తుత కేసులో పిటిషనర్లు చైనా.. తజకిస్తాన్, కంబోడియా నుంచి ఉయ్ఘర్లను అక్రమంగా జిన్జియాంగ్ ప్రావిన్స్‌కు తరలించడమే కాక అక్కడ వారిని ఖైదు చేసి హింసిస్తుందని.. మతం మార్చడమే కాక బలవంతపు వివాహాలు జరిపిస్తుందని ఆరోపించారు. 6. చైనాకు ఐసీజేలో సభ్యత్వం లేనప్పటికి.. తజకిస్తాన్, కంబోడియాలు సభ్య దేశాలు కాబట్టి ఈ కేసును విచారించాల్సిందిగా పిటిషనర్లు కోరారు. ముఖ్యంగా జిన్‌పింగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ‘సీక్రెట్ స్పీచెస్’ పేరుతో ఉయ్ఘర్లకు వ్యతిరేకంగా అమలు చేయాల్సిన చర్యల గురించి మార్గదర్శకాలు జారీ చేశారు. నాటి నుంచి హింస మరింత పెరిగింది. జిన్జియాంగ్లో ఉయ్ఘర్ల పట్ల జరుగుతున్న అణచివేత విధానాలపై అంతర్జాతీయ సమాజం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 7. ఉయ్ఘర్ల పట్ల జరుగుతున్న హింసకు సంబంధించి పలువురు నిపుణులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా ఉపగ్రహ చిత్రాలు, ఉయ్ఘర్లకు సంబంధించి చైనా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రహస్యంగా సేకరించే పనిలో ఉన్నారు. అయితే చైనాపై చర్యలు తీసుకోవడం అంత తేలికగా జరిగే పని కాదని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు చైనా ఉయ్ఘర్ల సమస్యను అంతర్గత వ్యవహారంగా పేర్కొంటుంది. 8. ఈ క్రమంలో జర్మనీకి చెందిన ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త డాక్టర్ అడ్రియాన్ జాంజ్ చైనా దుశ్చర్యలను తెరపైకి తెచ్చారు. చైనా ప్రభుత్వం వెల్లడించిన పత్రాలను అధ్యయనం చేశారు జాంజ్. ఈ పత్రాలు మాండరిన్ భాషలో ఉన్నాయి. దీని ఆధారంగా చైనా ఏర్పాటు చేసిన రీ-ఎడ్యుకేషన్ క్యాంప్‌లో సుమారు 18 లక్షల మంది ఉయ్ఘర్ ముస్లింలను జైలులో పెట్టారని ఆయన పేర్కొన్నారు. 9. ముస్లిం జనాభాను తగ్గించడానికి చైనా అణచివేత విధానాలను అనుసరిస్తోందని జాంజ్ తెలిపారు. దేశంలోని మైనారిటీ ముస్లింలకు వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం జనాభా, సాంస్కృతిక మారణహోమం విధానాల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. 10. ఉయ్ఘర్ ప్రజలపై చైనా అణచివేత ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా దీనిపై స్పందించింది. జూన్ చివరిలో మైక్ పాంపియో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తన అణచివేత విధానాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఉయ్ఘర్ల విషయంలో చైనా తీరు పట్ల అంతర్జాతీయ సమాజం స్పందించాలని పాంపియో కోరారు. -
కిమ్‌నే వాళ్లు జిన్‌పింగ్ అనుకున్నారు..
‘నాలెడ్జ్ ఈజ్ డివైన్’ అనబట్టి సరిపోయింది. ‘నాలెడ్జ్ ఈజ్ నేషన్’ అని ఉంటే పశ్చిమ బెంగాల్ బీజేపీ కార్యకర్తలు వాళ్లు చేసిన పొరపాటు పనికి చింతించవలసిన అవసరం ఏర్పడి ఉండేది. భారత్‌పై చైనా దుశ్చర్యకు ఆగ్రహించిన కమలదళ సభ్యులు పశ్చిమబెంగాల్లోని అసన్సోల్లో ఉత్తర కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ‘ఆయన దిష్టిబొమ్మను ఎందుకు తగలబెడుతున్నారు?’ అని అక్కడున్న వాళ్లెవరో అడిగితే, ‘మన సైనికులను చంపించింది ఆయనే. చైనా ప్రధాని’ అన్నారు. కిమ్ నే వాళ్లు జిన్‌పింగ్ అనుకున్నారు. జిన్‌పింగ్‌ని కూడా వాళ్లు అధ్యక్షుడు అనుకోలేదు. ప్రధాని అనుకున్నారు. మారింది దిష్టి బొమ్మలే కాబట్టి ప్రమాదమేం లేదు. ఇద్దరు లీడర్ల ముఖాలూ గుండ్రంగా ఉంటాయి కనుక పొరపడి ఉండొచ్చు. ఏమైనా పోల్చుకోలేక పోవడం నాలెడ్జ్ లేకపోవడమైతే కాదు. చైనా అంటున్నారంటే క్లారిటీ ఉన్నట్లే. ఆగ్రహంలో జెన్యూనిటీ ఉన్నట్లే. నేషన్ ఈజ్ నాలెడ్జ్. -
‘చైనా ప్రధాని కిమ్ జాంగ్ ఉన్’
కోల్‌కతా: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల పట్ల భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాకు సంబంధించిన ప్రతి దాన్ని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. డ్రాగన్ దేశ అధ్యక్షుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో ఓ పొరపాటు చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త ఒకరు పొరపాటున కిమ్ జాంగ్ ఉన్ను చైనా అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన అన్సోల్లో చోటు చేసుకుంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు బీజేపీ మాస్క్ ధరించి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. చైనా ప్రధాని కిమ్ జాంగ్ ఉన్గా పేర్కొన్నాడు. దీనిపై నెటిజనులు తెగ కామెంట్ చేస్తున్నారు. ‘బీజేపీ ప్రకారం చైనా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అన్నమాట.. ఉత్తర కొరియా చైనాను స్వాధీనం చేసుకుందా ఏంటి’ అని కామెంట్ చేస్తున్నారు. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/OlpjHDj1ej — Lavanya Ballal | ಲಾವಣ್ಯ ಬಲ್ಲಾಳ್ (@LavanyaBallal) June 18, 2020 -
చెన్నైలో చైనా సందడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షులు జి.జిన్‌పింగ్‌ల మూడురోజుల తమిళనాడు పర్యటన ఖరారైనట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది.ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు సంప్రదాయపూర్వక స్వాగతం పలుకుతారు. 1.45 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి చెన్నై గిండీలోని ఐటీసీ గ్రాండ్చోళాకు చేరుకుని బసచేస్తారు. సాయంత్రం 4.10 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి 5 గంటలకు మహాబలిపురంలోని అర్జున్ తపస్వి మండపానికి చేరుకోగానే ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తరువాత మహాబలిపురం సందర్శన, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ కొనసాగుతుంది. రాత్రి 8.05 గంటలకు జి జిన్‌పింగ్ తిరిగి ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. రెండోరోజు 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు తాజ్ ఫిషర్మెన్స్గోవ్ హోటల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహాబలిపురంలో చైనా అధికారులు పరిశీలన ఉదయం 11.30 నుంచి 12.15 గంటల వరకు టాన్కోహాలులో ఉన్నతస్థాయి అధికారులతో చర్చాగోష్టి సమావేశంలో పాల్గొంటారు. 13వ తేదీ కార్యక్రమాల వివరాలు అందాల్సి ఉంది. జిన్ పింగ్ బస చేసే ఐటీసీ గ్రాండ్ చోళా నుంచి మహాబలిపురం వరకు 35 చోట్ల 500 మంది కళాకారులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకనున్నారు. ఈ స్వాగత కార్యక్రమాలను 15 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెన్నైకి రానున్న ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జి జిన్పింగ్లకు తమిళనాడు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలకనున్నట్లు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అలాగే జిన్‌పింగ్‌కు డీఎంకే తరఫున స్వాగతిస్తామని ఆ పార్టీ అధ్యక్షులు స్టాలిన్ తెలిపారు. మోదీ, జీ జిన్‌పింగ్ రాకను స్వాగతిస్తున్న స్టాలిన్, వైగోలకు కేంద్రమాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. మహాబలిపురంలో ఇరుదేశాలభద్రతా దళాలు: భారత్–చైనా భద్రతాదళాలు ఈనెల 8వ తేదీ నుంచి మహాబలిపురంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడం ప్రారంభించాయి. పోలీసు జాగిలాలతో అణువణువునా తనిఖీలు చేస్తున్నాయి. జిన్‌పింగ్‌కు తీవ్రవాదుల బెదిరింపులు ఉన్న కారణంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో 800 చోట్ల ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చైనా అధ్యక్షుని కోసం నాలుగు బుల్లెట్ ప్రూఫ్కార్లు చైనా నుంచి వచ్చాయి. ప్రభుత్వ బస్సులను మహాబలిపురం వెలుపలే నిలిపివేయనున్నారు. మహాబలిపురం పరిసరాల్లోని 70 మత్య్సకార గ్రామాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. ఈసీఆర్ రహదారి పోలీసుల పహారా కాస్తున్నారు. టిబెట్ విద్యార్థి సంఘం అధ్యక్షుడుసహా 8 మంది అరెస్ట్: చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ రాకను నిరసిస్తూ టిబెట్ దేశానికి చెందిన విద్యార్థులను కూడగట్టిన టిబెట్ దేశానికి చెందిన టెన్సిల్నోర్పు అనే విద్యార్థి సంఘ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. టిబెట్‌ను ప్రత్యేక దేశంగాప్రకటించాలని చైనాకు వ్యతిరేకంగా కొందరు టిబెటిన్లు కొంతకాలంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో 11న జిన్‌పింగ్ రాకను ప్రతిఘటించేందుకు చెన్నైలో నివసిస్తున్న టిబెటిన్లు సన్నాహాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సేలయ్యూరు ఆదినగర్లోని ఒక అద్దె ఇంట్లో విద్యార్థుల ముసుగులో నివసిస్తున్న 8 మంది టిబెటెన్లను ఈనెల 6వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి బుధవారం వెలుగుచూసింది. అలాగే చెన్నైలోని అనేక అతిథిగృహాలను పోలీసులు తనిఖీ చేయగా పెరియమేట్లోని ఒక అతిథిగృహంలో మాదకద్రవాలతో ఐదుగురు యువకులు పట్టుబడ్డారు. చెన్నై కేలంబాక్కం సమీపంలో వీసా గడువు ముగిసి తరువాత కూడా ఒక అపార్టుమెంటులో కొనసాగుతున్న ఇద్దరు నైజీరియా యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాస్‌పోర్టు లేకుండా అక్కడికి సమీపంలోని ఒక కాలేజీలో చదువుతున్నట్లు వారు బదులిచ్చారు. -
బ్యానర్ల దుమారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ రాక సందర్భంగా బ్యానర్లు ఏర్పాటుకు అనుమతి కోరుతూ మద్రాసు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం దాఖలు చేసిన పిటిషన్ దుమారం రేపింది. అధికార పక్షం సమర్థన, ప్రతిపక్షాల విమర్శలతో దుమారం రేగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ మూడురోజుల పర్యటన నిమిత్తం ఈనెల 11వ తేదీన చెన్నైకి ప్రత్యేక విమానంలో వస్తున్నారు. చెన్నై నుంచి హెలికాప్టర్లో మహాబలిపురం సమీపంలోని తిరువిడందైకిచేరుకుంటారు. అక్కడి నుంచి కోవలంలోని తాజ్‌స్టార్ హోటల్‌కు వెళ్లి బసచేస్తారు. అదే రోజు రాత్రి ఇరువురూ అనేక అంశాలపై భేటీ అవుతారు. ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఆ తరువాత ఇరువురు నేతలూ 12, 13 తేదీల్లో మహాబలిపురాన్ని సందర్శిస్తారు. ఇద్దరు అగ్రనేతలు మూడురోజులపాటు పర్యటిస్తున్న నేపథ్యంలో అనూహ్యరీతిలో బందోబస్తు, ఇతర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్ల తీరును పరిశీలించే నిమిత్తం ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి బుధవారం మహాబలిపురానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, డీజీపీ త్రిపాఠి, కాంచీపురం జిల్లా కలెక్టర్ పొన్నయ్య సీఎంను అనుసరించారు. టెక్కీ మృతితో నిషేధం: చెన్నై పల్లికరణైలో అన్నాడీఎంకే నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ శుభశ్రీ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలను హరించిన తరువాత బహిరంగప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం అమల్లో ఉంది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే కఠినశిక్ష తప్పదని కోర్టు హెచ్చరికలు జారీచేసింది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్లకు స్వాగత సత్కార ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదురోజులపాటు బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 3న విచారించనున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ఖండన: ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టును కోరడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేఎస్ అళగిరి విమర్శించారు.మోదీ, జీ జిన్పింగ్లకు స్వాగతం పలికేందుకు టీవీలు, పత్రికల్లో ప్రకటనలు, వాల్‌పోస్టర్లు, గోడలపై రాతలు వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉండగా ఫ్లెక్సీలకు అనుమతి కోరడం చట్టాన్ని దిక్కరించడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తప్పేంటి: మంత్రి జయకుమార్: బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు కోర్టు అనుమతి కోరడంలో తప్పేంటని మంత్రి జయకుమార్ ప్రశ్నిస్తున్నారు. బుధవారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోర్టు అనుమతితో బ్యానర్లను ఏర్పాటు చేయడం తప్పుకాదని ఆయన సమర్థించుకున్నారు. చట్టానికి లోబడే తాము అనుమతి కోరుతున్నామని అన్నారు. -
ఉగ్రవాదంపై కఠిన చర్యలు
ఒసాకా: ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక సాయం అందకుండా చూడటంతోపాటు, తమ భూభాగాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలు శుక్రవారం కోరాయి. ఉగ్రవాదంపై తాము పోరాడతామనీ, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకుంటామని ఆ ఐదు దేశాలు ప్రతినబూనాయి. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 దేశాల సదస్సు కోసం అక్కడకు వచ్చిన బ్రిక్స్ దేశాధినేతలు ప్రత్యేకంగా ఓ అనధికారిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల అధ్యక్షులు వరుసగా షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, సిరిల్ రమఫోసా, జాయిర్ బోల్సొనారోలు ఆ భేటీలో పాల్గొన్నారు. నల్లధనం, అవినీతి, అక్రమ ఆర్థిక నిధుల ప్రవాహంపై కూడా కలిసికట్టుగా, ఒకరికొకరు సహకరించుకుంటూ పోరాడాలని ఐదు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఆర్థిక వ్యవస్థలకూ నష్టమే: మోదీ మానవాళికి ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒసాకాలో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల భేటీలో అన్నారు. ఉగ్రవాదం అనే భయంకర భావజాలం వల్ల అమాయకుల ప్రాణాలు పోవడమే కాకుండా దేశాల ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను తక్షణం బలోపేతం చేయడం, రక్షణాత్మక వర్తక విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, అందరికీ ఇంధన భద్రత కల్పించడం, ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం అనేవి ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యాలని మోదీ పేర్కొన్నారు. పుతిన్, జిన్‌పింగ్‌లతో త్రైపాక్షిక భేటీ ఒసాకాలోనే పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి మోదీ ప్రత్యేకంగా ఆర్ఐసీ (రష్యా, ఇండియా, చైనా) సమావేశంలోనూ పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సహా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ‘ప్రపంచపు ఆర్థిక, రాజకీ, భద్రత పరిస్థితులపై మనం చర్చించడం ముఖ్యం’ అని మోదీ పేర్కొన్నారు. -
భారత్, చైనాల మధ్య హాట్‌లైన్
బీజింగ్: రక్షణ మంత్రుల స్థాయిలో హాట్‌లైన్ ఏర్పాటుతోపాటు 12 ఏళ్లనాటి రక్షణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే అంశంపై భారత్, చైనాలు చర్చలు జరుపుతున్నాయి. చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్ గత వారం ఢిల్లీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి సీతారామన్‌తో సమావేశమయ్యారు. వుహాన్‌లో జిన్‌పింగ్, మోదీ మధ్య జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. డోక్లాం సంక్షోభం వంటివి తలెత్తినప్పుడు రెండు దేశాల సైనికాధికారులు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే అంశం కూడా ఇందులో ఉందని చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి బీజింగ్‌లో తెలిపారు. రెండు దేశాల రక్షణ మంత్రులతోపాటు సైనికాధికారుల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు, 2006లో భారత్, చైనాల మధ్య కుదిరిన పరస్పర అంగీకార ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు కూడా చర్చలు జరిగాయన్నారు. -
బీఆర్ఐకి వ్యతిరేకం
చింగ్‌దావ్: చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) తమకు ఆమోదయోగ్యం కాదని భారత్ తేల్చిచెప్పింది. చైనాలోని చింగ్దావ్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం వేదికగా బీఆర్ఐపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నిర్ణయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఏ భారీ ప్రాజెక్టు అయినా.. ఈ కూటమి సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. మధ్య ఆసియా దేశాలతో స్నేహాన్ని పెంపొందించుకోవడంతోపాటు ఎస్సీవో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రభావానికి అతి దురదృష్టకర ఉదాహరణగా అఫ్గాన్ నిలిచిందని.. అక్కడ శాంతి నెలకొల్పడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధాని తెలిపారు. అనంతరం ఎస్సీవో డిక్లరేషన్‌పై భారత్, రష్యా, పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్ దేశాలు సంతకం చేశాయి. భారత్ మినహా మిగిలిన దేశాలన్నీ బీఆర్ఐకి అంగీకారం తెలిపాయి. సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని, పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ పరస్పరం కరచాలనం చేసుకుని, పలకరించుకున్నారు. అయితే వీరి మధ్య చర్చలేమీ జరగలేదు. రెండ్రోజుల ఎస్సీవో సదస్సు ముగిసిన అనంతరం మోదీ భారత్ బయల్దేరారు. అనుసంధానతే మా లక్ష్యం.. కానీ! ఆదివారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. బీఆర్ఐని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ మెగా ప్రాజెక్టు అయినా సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందే. ఇతర దేశాలతో అనుసంధానత పెంచుకోవడమే మా ప్రాధాన్యత. అయితే అందరినీ కలుపుకుపోయే ప్రాజెక్టులను మేం సంపూర్ణంగా స్వాగతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ నార్త్–సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ – 7,200 కి.మీ. పాటు వివిధ రకాల రవాణా మార్గాలతో నిర్మించే ఈ ప్రాజెక్టు భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌లను కలపనుంది)లో భాగస్వామ్యం, ఇరాన్‌లోని ఛబహర్ పోర్టు అభివృద్ధి, అష్గాబట్ (వివిధ రవాణా మార్గాల ఏర్పాటుకు భారత్, ఇరాన్, కజకిస్తాన్, ఒమన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య కుదిరింది) ఒప్పందం తదితర ప్రాజెక్టుల్లో భారత్ చురుకైన పాత్ర పోషించడమే అనుసంధానతపై తమ విధానాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఉగ్రవాదంపై సమైక్యపోరు: ఉగ్రవాదంపై అన్ని దేశాలు ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. అఫ్గానిస్తాన్ ఉగ్రవాదానికి బలైపోయి దురదృష్టకర ఉదాహరణగా నిలిచిందన్నారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశాధ్యక్షుడు ఘనీ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు. ప్రచ్ఛన్న యుద్ధ ఆలోచనలు మనకొద్దు: జిన్‌పింగ్ ఎస్సీవోలోకి భారత్, పాక్‌లు శాశ్వత సభ్యదేశాలుగా చేరడంతో ఈ కూటమి బలం పెరిగిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. బీఆర్ఐ గురించి ప్రస్తావిస్తూ.. ‘అన్ని దేశాలూ ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని మెరుగుపరుచుకునేందుకు పరస్పర సహకారం అనే నినాదంతో పనిచేయాలి. బీఆర్ఐ సహకారాన్ని, మన అభివృద్ధి వ్యూహాలను పెంచుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘ఎస్సీవో ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. సరికొత్త సహకారం అందనుంది. అయితే మనం ప్రచ్ఛన్నయుద్ధ ఆలోచనలను తిరస్కరించాలి. సభ్యదేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని, తమ భద్రతకోసం ఇతరుల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలి. దీర్ఘదృష్టి లేకుండా తీసుకునే నిర్ణయాలను (పరోక్షంగా అమెరికాను ప్రస్తావిస్తూ) మనం సమర్థించకూడదు’ అని జిన్‌పింగ్ అన్నారు. బీఆర్ఐ ఏంటి? ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లలోని రోడ్డు, సముద్రమార్గాలను కలుపుతూ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)ని నిర్మించనున్నట్లు చైనా 2013లో ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.8.5 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తూ 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికే బీజింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చైనా వెల్లడించింది. అయితే పలు దేశాలకు ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నాయి. అంతర్జాతీయంగా చైనా ప్రభావాన్ని పెంచుకునేందుకే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని ఆ దేశాలు భావిస్తున్నాయి. అయితే.. బీఆర్ఐలో చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) భాగంగా ఉంది. ఈ సీపీఈసీ కోసం చైనా రూ.3.4 లక్షలకోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ గుండా వెళ్తోంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టును చేపట్టడం తమ సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడమేనని భారత్ భావిస్తోంది. -
అందరికీ అందుబాటులో ఆరోగ్యం
న్యూఢిల్లీ: పేదలపై పడుతున్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించి, అందుబాటు ధరల్లో అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆసుపత్రులు, వాటిలో పడకలు, వైద్యుల సంఖ్య పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధాన్‌మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) లబ్ధిదారులతో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ సహా ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలను వివరించారు. త్వరలో దేశమంతా ఆయుష్మాన్ భారత్ ‘పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 90కి పైగా మెడికల్ కళాశాలలను ప్రారంభించి, 15 వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచాం. 50 కోట్ల మందికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందించే బృహత్ పథకం ఆయుష్మాన్ భారత్ తొలి దశ ప్రారంభమైంది. త్వరలోనే దేశమంతా అమల్లోకి వస్తుంది. పేదలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు నాలుగేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించాం. ప్రతి భారతీయునికి చౌక ధరల్లో వైద్యం అందించేందుకు కృషిచేస్తున్నాం. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాటి ప్రయోజనాలు పేదలకు చేరుతున్నాయని చాలా సంతోషంగా చెబుతున్నా. ఔషధాలు పొందడం పేదలకు ఒక సమస్యగా మారింది. పీఎంబీజేపీ కింద వాటి ధరలు దిగొచ్చాయి. దేశవ్యాప్తంగా నేడు సుమారు 3,600 జన ఔషధి కేంద్రాల్లో 700 రకాలకు పైగా జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయి. డయాలిసిస్ సేవల ఖర్చును తగ్గించేందుకు ప్రారంభించిన ప్రైమ్‌మినిస్టర్ రాష్ట్రీయ డయాలిసిస్ యోజన 80 శాతం జిల్లాల్లో అమలవుతోంది. 2030 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని ప్రపంచం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి 5 ఏళ్ల ముందే అంటే 2025 నాటికే దేశం నుంచి ఆ వ్యాధిని తరిమికొట్టడానికి కార్యాచరణ ప్రారంభించాం. 12 రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ఇంద్రధనుష్ కార్యక్రమం కింద 3.15 కోట్ల మంది చిన్నారులు, 80 లక్షల మంది గర్భిణులకు టీకాలు వేయించాం. పరిశుభ్ర భారత్ సాకారం దిశగా స్వచ్ఛ్ భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా పారిశుధ్య కవరేజీ 38 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది’ అని మోదీ అన్నారు. జిన్‌పింగ్‌తో భేటీ కానున్న మోదీ.. షాంగై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ శనివారం భేటీ కానున్నారు. గత నెలలో వుహాన్‌లో జరిగిన అనధికారిక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఇద్దరు నేతలు సమీక్ష జరుపుతారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. ఎస్సీఓ కూటమికి చెందిన సుమారు ఆరుగురు దేశాధినేతలతో మోదీ చర్చించే వీలుంది. సదస్సుకు హాజరుకాబోతున్న పాక్ అధ్యక్షుడితో మోఈ భేటీపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఫోర్బ్స్ టాప్ టెన్‌లో ప్రధాని మోదీ
న్యూయార్క్ : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితా– 2018ను ఫోర్బ్స్ విడుదల చేసింది. 75 మందితో కూడిన ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మొదటి స్థానం దక్కించుకోగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. వివిధ రంగాల నుంచి శక్తిమంతులైన వ్యక్తుల జాబితా రూపొందించడానికి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఎక్కువ మంది వ్యక్తులకు ప్రాతినిథ్యం వహించే దక్షత కలిగి ఉండటం, ఆర్థిక వనరులను నియంత్రించగలగడం, భిన్న రంగాలలో తమ ముద్ర వేయగలగడం, అధికారాన్ని చురుగ్గా వినియోగించుకోగలగడం వంటి అంశాల ఆధారంగా 75 మంది వ్యక్తులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. భూగ్రహం మీద 7.5 బిలియన్ల జనాభా ఉందని.. తమ సామర్థ్యంతో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న 75 మంది(మహిళలు, పురుషులు కలిపి)ని ఎంపిక చేశామని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితా సిద్ధం చేయడానికి 10 కోట్ల మందికి ఒకరి చొప్పున ఎంపిక చేశామని పేర్కొంది. ఆయన ప్రపంచ నాయకుడు.. భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారని ఫోర్బ్స్ ప్రశంసించింది. డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్‌తో జరిపిన చర్చల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడింది. అంతర్జాతీయ అంశాల్లో మోదీ కీలక వ్యక్తిగా మారారని, తన దేశంలోని గ్రామీణ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని మెచ్చుకుంది. 2016లో నోట్ల రద్దు ద్వారా గుణాత్మక మార్పులు చేపట్టి, అవినీతిని తొలగించేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని పేర్కొంది. కాగా ‘జియో’తో టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చిన భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఈ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల 40వ స్థానాన్ని దక్కించుకున్నారు. -
ఉత్తరకొరియా దెబ్బకు ట్రంప్ ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్: ఉత్తర కొరియా దెబ్బకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?. తాజా పరిణామాలు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. ఉత్తర కొరియాను అదుపు చేయడానికి చైనా సహకరిస్తే బావుంటుందని ట్రంప్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీట్ ద్వారా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ ట్వీట్‌ను చైనా చూసి చూడనట్లు ఊరుకుంది. ఉత్తర కొరియా సముద్ర జలాల చేరువలోకి అమెరికా యుద్ధ నౌకలు వెళ్లడంతో ఆ దేశం అమెరికాపై అణుదాడికి తాము వెనుకాడమని ప్రకటించింది. ఉత్తరకొరియా ప్రకటనతో ఒక్కసారిగా ప్రపంచదేశాలు షాక్‌కు గురయ్యాయి. అగ్రరాజ్యంపై ఉత్తరకొరియా వ్యాఖ్యల ధైర్యాన్ని చూసి కొన్ని దేశాలు లోలోపలే నవ్వుకున్నాయి కూడా. ఉత్తరకొరియా కలవరం ట్రంప్‌ను నిద్రపోనిస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే చైనా ద్వారా ఆ దేశానికి చెక్ పెట్టాలని ట్రంప్ యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చైనాతో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌తో తన కెమిస్ట్రీ బాగుందంటూ ట్రంప్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం జిన్ పింగ్‌కు ట్రంప్ ఫోన్ చేశారు. వ్యాపార సంబంధాల విషయం గురించే కాక మరెన్నో అంశాలు చర్చించుకున్నామని మీడియాతో చెప్పుకొచ్చారు ట్రంప్. చైనాతో మంచి వ్యాపారసంబంధాలు పెంచుకోవడం వల్ల ఉత్తరకొరియాను అదుపు చేయడం సులువు అవుతుందని తాను అనుకుంటున్నట్లు వివరించారు. -
మరింత బలోపేతంగా బ్రిక్స్
అంతర్జాతీయ ఎజెండాను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర హాంగ్జౌ: అంతర్జాతీయంగా తన వాణిని బలంగా వినిపించే శక్తిగా బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సమాఖ్య ఎదిగిందని మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఎజెండాను తీర్చిదిద్దడంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషిస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ లక్ష్యాలను సాధించేందుకు వీలుగా సహాయం అందిస్తోందని చెప్పారు. జీ20 సదస్సుకు ముందుగా బ్రిక్స్ దేశాల అధినేతల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో బ్రెజిల్ అధ్యక్షుడు మైఖెల్ తీమెర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. వీరితో మోదీ ద్వైపాక్షికంగానూ చర్చలు జరిపారు. ‘దక్షిణ ఆసియా లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉగ్రవాదులకు బ్యాంకులు, ఆయుధాల తయారీ పరిశ్రమలు లేవు. కానీ ఎవరో వారికి నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్నారనేది స్పష్టం. అందువల్ల బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదం కట్టడికి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులపైనే కాక వారికి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అని మోదీ సూచించారు. చైనాకు మిత్రదేశమైన పాకిస్థాన్‌ను ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతోంది. స్థిరత్వానికి ఉగ్రవాదం అవరోధంగా మారిందని, ఇది మానవాళికి ముప్పుగా పరిణమించిందని అన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి విస్తృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బ్రిక్స్ దేశాధినేతలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ శాంతికి, భద్రతకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాదాన్ని వారు తీవ్రంగా ఖండించారు.