కిమ్‌నే వాళ్లు జిన్‌పింగ్‌ అనుకున్నారు.. | BJP Activists Confused China And North Korea President | Sakshi
Sakshi News home page

కిమ్‌నే వాళ్లు జిన్‌పింగ్‌ అనుకున్నారు..

Published Mon, Jun 22 2020 8:33 AM | Last Updated on Mon, Jun 22 2020 8:48 AM

BJP Activists Confused China And North Korea President - Sakshi

కిమ్, బీజేపీ కార్యకర్తలు

‘నాలెడ్జ్‌ ఈజ్‌ డివైన్‌’ అనబట్టి సరిపోయింది. ‘నాలెడ్జ్‌ ఈజ్‌ నేషన్‌’ అని ఉంటే పశ్చిమ బెంగాల్‌ బీజేపీ కార్యకర్తలు వాళ్లు చేసిన పొరపాటు పనికి చింతించవలసిన అవసరం ఏర్పడి ఉండేది. భారత్‌పై చైనా దుశ్చర్యకు ఆగ్రహించిన కమలదళ సభ్యులు పశ్చిమబెంగాల్‌లోని అసన్సోల్‌లో ఉత్తర కొరియా లీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ‘ఆయన దిష్టిబొమ్మను ఎందుకు  తగలబెడుతున్నారు?’ అని అక్కడున్న వాళ్లెవరో అడిగితే, ‘మన సైనికులను చంపించింది ఆయనే. చైనా ప్రధాని’ అన్నారు. కిమ్‌ నే వాళ్లు జిన్‌పింగ్‌ అనుకున్నారు. జిన్‌పింగ్‌ని కూడా వాళ్లు అధ్యక్షుడు అనుకోలేదు. ప్రధాని అనుకున్నారు. మారింది దిష్టి బొమ్మలే కాబట్టి ప్రమాదమేం లేదు. ఇద్దరు లీడర్‌ల ముఖాలూ గుండ్రంగా ఉంటాయి కనుక పొరపడి ఉండొచ్చు. ఏమైనా పోల్చుకోలేక పోవడం నాలెడ్జ్‌ లేకపోవడమైతే కాదు. చైనా అంటున్నారంటే క్లారిటీ ఉన్నట్లే. ఆగ్రహంలో జెన్యూనిటీ ఉన్నట్లే. నేషన్‌ ఈజ్‌ నాలెడ్జ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement