bomb blasting
-
China Warning: పాకిస్తాన్‌కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం పాకిస్తాన్ రాజధాని కరాచీలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందగా వారిలో ముగ్గురు చైనీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా.. పాక్‌ను హెచ్చరించింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్లో వివిధ వ్యాపారాలు, ప్రాజెక్టుల పనుల కోసం చైనా తమ దేశ పౌరులను అక్కడికి పంపింది. కాగా, తాజాగా జరిగిన బాంబు దాడిలో ఈ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులే చనిపోవడంతో చైనీస్ స్టేట్ మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ పేలుడును ఖండించింది. అనంతరం పాకిస్తాన్‌లోని చైనా ప్రాజెక్టులు, సిబ్బందిని రక్షించడానికి పాక్ చొరవతీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే, ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చైనా కంపెనీలు, పాకిస్తాన్‌లోని పౌరులపై దాడులు చేస్తామని పదేపదే బెదిరిస్తోందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. చైనాకు వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చైనా.. గ్వాదర్‌ను విడిచిపెట్టి, బలూచిస్తాన్‌లోని CPEC ప్రాజెక్టులను ముగించాలని ఆర్మీ తెలిపింది. లేదంటే చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రత్యేక విభాగం చైనీయులను టార్గెట్ చేస్తారని హెచ్చరించింది. In a video of social media the Baloch Liberation Army is seen warning China to leave Gwadar and end CPEC projects in Balochistan or they will be targeted by a special unit formed against China. China will face repercussions for its Pak Army atrocities on Baloch.#ChinaExposed pic.twitter.com/TnfgWQe4Ey — Indian Warrior (@BharatKaPraheri) April 27, 2022 ఇది కూడా చదవండి: చైనాలో కొత్త వైరస్ టెన్షన్ -
అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం: భారీ పేలుళ్లు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబుల మోత తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్రమాణస్వీకారం వేళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు జరిగాయి. అష్రఫ్ ఘని వేదికపై ప్రసంగిస్తున్న ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. బాంబు పేలుళ్ల శబ్ధాలు విని షాక్ తిన్న ఆయన ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించడంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు సైతం అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు ఆయన ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించకుండానే ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. బాంబు పేలుళ్ల సంభవించడంతో ఘనీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తల తెగిపడుతున్నా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. బాంబు దాడికి పాల్పడ్డది ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా, గత నెలలో అధ్యక్ష ఫలితాలు ప్రకటించగా.. అష్రఫ్ ఘని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఘని ప్రమాణ స్వీకారం చేయడం ఇది వరసగా రెండోసారి. -
2 నౌకలపై దాడి
దుబాయ్/టెహ్రాన్/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది. ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది. ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు. -
ఉదయగిరిలో నివాసాల మధ్య పేలుడు
ఉదయగిరి: పట్టణంలోని గొల్లపాళెంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో బాంబ్ పేలుడు కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గొల్ల పాళెంలో అర్ధరాత్రి సమయంలో బాంబ్ పేలిన శబ్ధం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలోని గృహాల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళనలతో బయటకు వచ్చి చూశారు. ఓ కుక్క తలపగిలిపోయి పొగలు వస్తుండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఎన్.ప్రభాకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఐ సాంబశివరావు బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగీ ఆదేశాల మేరకు గుంటూరు నుంచి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి తనిఖీలను చేయించారు. పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి బాంబ్ ఏమీలేదని గుర్తించారు. అడవి పందుల బెడద బారి నుంచి కాపాడుకునేందుకు ఎవరో నాటు తూటాలు పెట్టి ఉంటారని, దానిని కుక్క నోట కరపించుకుని గృహ నివాసాల మధ్యకు వచ్చి కొరకడంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెంది ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. కుక్కకు స్థానిక పశు వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహిం చారు. -
‘ఫన్ మొదలైంది.. త్వరలోనే కలుస్తాను శ్రీలంక’
కొలంబో : అమెరికాకు చెందిన ఓ టెకీ శ్రీలంక బాంబు పేలుళ్లలో చనిపోవడానికి ముందు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన చివరి మెసేజ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డైటర్ కోవల్స్కి(40) అనే వ్యక్తి బ్రిటన్‌కు చెందిన విద్యా, ప్రచురణ సంస్థ పియర్సన్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం ఆఫీస్ పని నిమిత్తం శ్రీలంక బయలుదేరాడు. ప్రయాణం ప్రారంభం కావడానికి ముందు డైటర్ తన ఫేస్బుక్లో ‘ఫన్ మొదలైంది. వర్క్ ట్రిప్స్‌ని నేను చాలా ఇష్ట పడతాను. 24 గంటల ప్రయాణం. శ్రీలంక.. త్వరలోనే నిన్ను చూస్తాను’ అంటూ పోస్ట్ చేశాడు. శ్రీలంకలో దిగిన తరువాత కంపెనీ తన కోసం రూమ్ బుక్ చేసిన హోటల్‌కు చేరుకున్నాడు. ఫోన్ చేసి ఈ విషయాన్ని సీఈవోకు తెలియజేశాడు. ఓ వారం రోజుల్లో పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతానని తెలిపాడు డైటర్. కానీ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో అతను మృతి చెందాడు. ఈ విషయం గురించి ఆ కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. ‘డైటర్ ఎప్పుడూ తాను నవ్వుతూ ఉండటమే కాక.. తన చుట్టూ ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచుతాడు. అతని మంచితనం వల్ల ఎక్కడి వెళ్తే అక్కడ కొత్త స్నేహితులను తయారవుతుంటారు. ఎలాంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరిస్తాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి డైటర్ కొలంబో వెళ్లాడు. అక్కడ ఓ వారం రోజుల పాటు ఉండి.. తన స్థానిక స్నేహితులతో కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలనుకున్నాడు. కానీ దుష్టులు చేసిన దాడిలో చాలా మంది అమాయకుల్లానే డైటర్ కూడా కన్ను మూశాడు. డైటర్ లాంటి వారు కొత్తవి సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఉగ్రదాడికి పాల్పడిని వారికి కేవలం నాశనం చేయడం మాత్రమే తెలుసు’ అంటూ సదరు సీఈవో విషాదం వ్యక్తం చేశారు. -
లంకకు ఇప్పట్లో వద్దు బాబోయ్ ..!
సాక్షి,సిటీబ్యూరో: శ్రీలంకలో బాంబు పేలుళ్లు హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేశాయి. అక్కడ బాంబుపేలుళ్లతో భాగ్యనగర వాసులకు ఏం సంబంధం ఉందంటారా? ప్రతివారం గ్రేటర్ హైదరాబాద్ నుంచి శ్రీలంక వెళ్లేవారి సంఖ్య వందల్లో ఉంటుంది. వీరంతా శని, ఆదివారాల్లోనే శ్రీలంకకు వెళుతుంటారు. శ్రీలంక అందాలను చూసేందుకు పర్యాటకులుగా వెళ్లే వారు కొందరైతే.. అక్కడ క్యాసినోల్లో జూదం ఆడి కోట్లు సంపాదించేద్దామని వెళ్లేవారు ఇంకొందరు. వ్యాపారపరంగా వెళ్లేవారు మరికొందరు. ఈ మూడు కోవకు చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. శ్రీలంకలోని సిన్నామన్ గ్రాండ్, షంగ్రీలా హోటళ్లతో పాటు పలు ప్రాంతాలు ఆదివారం బాంబుల మోతతో దద్దరిల్లాయి. వందలాది మంది మృత్యువాతపడ్డారు. అదృష్టవశాత్తు ఈ పేలుళ్లలో హైదరాబాద్‌వాసుల ఎవ్వరూలేకపోవడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. శ్రీలంకే ఎందుకు..? నగరానికి చెందిన వారు గతంలో ఎక్కువగా గోవా వెళ్లేవారు. అయితే ప్రస్తుతం గోవాతో పోల్చుకుంటే శ్రీలంకలో వ్యాసినోలకు వెళ్లడం చౌకగా మారింది. అదీకాక హైదరాబాద్ నుంచి పొద్దున్నే విమానం ఎక్కితే గంటన్నరలో శ్రీలంకలో ల్యాండ్ అవుతారు. అక్కడ ఓ పూట క్యాసినోల్లో గడిపి మర్నాడు ఉదయమే ఇంటికి తిరిగి వచ్చేలా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. టికెట్ ధరలు కూడా తక్కువే. దీంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాసులు ఎక్కువగా శ్రీలంక వైపు ఆకర్షితులు అవుతున్నారు. పేరు చెబితేనే బెంబేలు... శ్రీలంకలోని క్యాసినోల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు జూదప్రియులు నగరం నంచి వెళుతుంటారు. నగరంలోని ట్రావెల్ ఏజెంట్ల లెక్కల ప్రకారం.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నెలకు సుమారు 600 మందికి పైగా శ్రీలంక వెళుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం క్యాసినోల్లో ఆడేందుకే వెళ్లేవారే. తాజా దుర్ఘటనతో కొన్ని రోజులపాటు శ్రీలంక వైపు వెళ్లేందుకు గ్రేటర్ హైదరాబాద్ వాసులు వెనుకంజ వేస్తారని ట్రావెల్ ఏజెంట్ ఒకరు చెప్పారు. తెలంగాణతో పాటు కర్నూల్ జిల్లా నుంచి కూడా శ్రీలంక వెళ్లే జూదప్రియుల సంఖ్య రెండుమూడేళ్ల నుంచి బాగా పెరిగిందని తెలిపారు. నగరానికి చెందిన జూదప్రియులను ఆకర్షించేందుకు శ్రీలంకలోని క్యాసినో నిర్వాహకులు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మార్కెంటింగ్ బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉచిత విమాన టికెట్లు, బస పేరుతో జూదప్రియులను ఆకర్షించి తీసుకెళుతున్నారు. అక్కడ క్యాసినోల్లో అడుగుపెట్టేందుకు తక్కువలో తక్కువ రూ. 2 లక్షలు ఉండాల్సిందే. ఈ కారణంగానే క్యాసినో నిర్వాహకులకు ఉచిత ఎర వేస్తున్నారు. ఇక్కడ జూదరులను ఆకర్షించి శ్రీలంకకు తీసుకెళ్లడం అక్కడ క్యాసి నోల్లో జూదం ఆడించి ఉన్నదంతా ఖాళీ చేసి తిరిగి వారినిక్షేమంగా పంపడం చేస్తున్నారు. శ్రీలంకలోని క్యాసినోల్లో ఆడేందుకు వెళుతున్న వారిలో చోటా వ్యాపారుల మొదలు డాక్టర్లు, ఇంజినీర్లు, బడా వ్యాపారులు ఎక్కువగా ఉంటున్నారు. -
చివరికి మిగిలింది సెల్ఫీ
వాళ్లకి తెలీదు మృత్యువు పక్కనే పొంచి ఉందని. వాళ్లకి తెలీదు రక్త పిశాచాలు మరో క్షణంలో దారుణమైన ఘాతుకానికి ఒడిగడతారని. తమిళవేర్పాటు ఉద్యమం సద్దుమణిగాక శాంతి పవనాలు వీస్తున్న శ్రీలంకలో ఉగ్రమూకలు పంజా విసురుతాయని ఎవరు ఊహించగలరు?. బ్రిటన్ నుంచి శ్రీలంక చూడడానికి టూరిస్టులుగా వచ్చిన ఒక కుటుంబం కొలంబోలో ఒక హోటల్లో దిగింది. ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ని ఎంజాయ్ చేయడానికి డైనింగ్ రూమ్‌కి కుటుంబ సభ్యులు వచ్చారు. తినడానికి ముందు నవ్వుతూ తుళ్లుతూ జోకులు వేసుకుంటూ సెల్ఫీ దిగారు. వారిలో ఒకమ్మాయి వెంటనే తన ఫేస్బుక్ అకౌంట్లో ఆ సెల్ఫీ షేర్ చేసింది. ఆ ఫొటో షేరయిన క్షణంలోనే హోటల్లో బాంబుల మోత మోగింది. ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వులు ఆగిపోయాయి. అక్కడిక్కడే మృత్యుఒడికి చేరుకుంది. కుటుంబంలో మిగిలిన సభ్యులందరూ కూడా బాంబు దాడిలో చనిపోయారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చర్చిలు, హోటల్స్ టార్గెట్‌గా శ్రీలంక మారణహోమంతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ బ్రిటిష్ టూరిస్టు ఫ్యామిలీ ఆఖరి సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరికి సెల్ఫీయే మిగిలిందా అంటూ నెటిజన్లు బాధగా నిట్టూరుస్తున్నారు. -
అమరావతిలో అలజడి
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కొలనుకొండలో ఆదివారం ఉదయం నివాసాల మధ్య పెద్ద పేలుడు శబ్దం రావడంతో రాజధాని ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పెయింట్ డబ్బాలో తెల్లని రాళ్లు ఉండడం వల్ల పేలుడు సంభవించిందని ఆ ఇంటి యజమానులు చెబుతున్నప్పటికీ స్థానికులు, పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలో నిజంగా కార్బైడ్‌ను అమరిస్తే దాని నుంచి వెలువడిన గ్యాస్‌కు అంత పేలుడు సంభవిస్తుందా? అయినా కార్బైడ్‌కు నీళ్లు తగలకపోతే దాని నుంచి ఎటువంటి రియాక్షన్ రాదు. నాగరాజు ఇంట్లో పేలిన ప్లాస్టిక్ డబ్బా ఆరు నెలల క్రితం పని వద్ద నుంచి తీసుకొచ్చి ఇంట్లో బయట పెట్టాడని పోలీసుల విచారణలో తెలిపారు. అయితే ప్లాస్టిక్ డబ్బాలో తెల్లని పదార్థం ముందుగా నాగరాజు గమనించలేదా? ఆ పెయింట్ డబ్బా మూత ౖఒక్కసారి తీసి పెట్టింది కాబట్టి లూజుగానే ఉంటుంది. నిజంగా గ్యాస్ ఫామ్ అయితే ఆ మూత ఎప్పుడో పైకి లేచిపోయేదని పోలీసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు తాపీ పనితోపాటు అప్పుడప్పుడు చేపలు కూడా పడుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చేపలు వేటాడేవారు గతంలో డిటనేటర్స్ను వాడి నీటిలో పేల్చి చనిపోయిన చేపలను పట్టుకునే వారు. దాని కోసం తీసుకొచ్చి ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ డబ్బాలో దాచి పెట్టాడా? ప్రమాదవశాత్తూ ఒత్తిడి తగిలి బ్లాస్టింగ్ అయిందా? చుట్టుపక్కల కొండ తొలిచే వారు నాగరాజుకు ఇచ్చి దాచిపెట్టమన్నారా ? అనే విషయాలు తేలాల్సి ఉంది. నాగరాజు భార్య భవానీ మాత్రం ఆ బకెట్లో తెల్లని వస్తువులు ఉన్నాయని మాత్రమే చెబుతుంది. ఏమైనా నాగరాజు స్పృహలోకి వస్తేగాని నిజానిజాలు బయటకు రావు. మొన్న హత్య... నేడు పేలుడు... ఒక్కసారిగా జరిగిన పేలుడుకు రాజధానిలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మొన్న విజయవాడలో రౌడీషీటర్‌ను తెనాలికి చెందిన వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఆ సంఘటన మరువక ముందే కొలనుకొండ ప్రాంతంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం, నాగరాజుది కూడా తెనాలి ప్రాంతం కావడం, వారితో ఏమన్నా సంబంధాలున్నాయా ? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ హత్య నేపథ్యంలోనే విజయవాడకు అతి సమీపంలో ఉన్న కొలనుకొండ ప్రాంతంలో పేలుడు పదార్థాలను దాచిపెట్టారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పేలుడు సంభవించిన ప్రాంతంలో శకలాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో జరిగిన పేలుడు కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం సీరిసయ్‌గా దృష్టి సారించారు. ఆ కత్తేమైంది? నాగరాజు ప్లాస్టిక్ డబ్బాను తెరవడానికి ఉపయోగించిన కత్తి ఏమైంది? పెయింట్ డబ్బాకు వాస్తవానికి కోయాల్సిన అవసరం లేదు. పెయింట్ ఉపయోగించడానికి దానికున్న సీల్ తీసి.. పెయింట్‌ను వాడతారు. నాగరాజు తాపీ పని చేసి దగ్గర్నుండి ఆ డబ్బా తీసుకొచ్చాడని ఆయన భార్య చెబుతుంది. డబ్బా మూత గట్టిగా పట్టుకొని చేత్తో లాగితే వచ్చేస్తుంది. కానీ నాగరాజు కత్తితో కోయడానికి ఎందుకు ప్రయత్నించాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నాగరాజు పని చేసే దగ్గర డబ్బా తీసుకొచ్చినట్లయితే ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకొస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాగరాజు పరిస్థితి విషమం లబ్బీపేట(విజయవాడతూర్పు): పేలుడు ఘటనలో గాయపడి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిలో కార్పెంటర్ నాగరాజు శ్వాసతీసుకోవడం కష్టతరంగా మారడంతో అత్యవసర వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పేలుడులో కుడికాలు మోకాలు కింద వరకూ తెగిపోవడం, ఎడమ కాలు సైతం నుజ్జు నుజ్జు కావడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా శరీరం సైతం 80 శాతం గాయాలు కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలిపారు. ఇదే ఘటనలో గాయపడిన మణిమ్మ కాళ్ల ఎముకలు, తుంటె, పక్కటెముకలు విరిగిపోయాయి. మరో మహిళ భవానీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈమెను సర్జరీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
బ్యాంకాక్ పేలుళ్లు: ఇద్దరు భారతీయుల అరెస్టు
బ్యాంకాక్: గత నెలలో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సంభవించిన భారీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఇద్దరు భారతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 17 వ తేదీన సెంట్రల్ బ్యాంకాక్‌లోని కమర్షియల్ హబ్‌లో బ్రహ్మదేవుని ఆలయానికి సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడులో 20 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా ఇద్దరి భారతీయులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఇద్దరు బాంబు దాడికి పాల్పడిన వ్యక్తితో పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. వారిని థాయ్ లాండ్ మిలటరీ క్యాంపునకు తరలించి ప్రశ్నిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. విదేశీయులు అధికంగా ఉండే మిన్ బూరీ జిల్లాలో ఆదివారం థాయ్ లాండ్ ఆర్మీ- పోలీస్ బలగాలు సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. వీరిలో కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే చైనీయులు సహా పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. -
123 కు చేరిన చైనా మృతుల సంఖ్య
బీజింగ్: చైనా పేలుళ్ల మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. రాజధాని బీజింగ్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టియాన్‌జెన్ మున్సిపాలిటిలోని పారిశ్రామికవాడలో భారీ పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య మరింత పెరిగింది. ఆదివారం నాటికి మృతుల సంఖ్య 123 కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 624 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వీరిలో 44 మంది పరిస్థితి మాత్రం విషమంగా ఉందన్నారు. ఈ ఘటనలో బాధితుల గుర్తింపు వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఇంకా 89 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వీరిలో 50 మంది పౌరులతో పాటు 34 అగ్నిమాపక సిబ్బంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపారు. -
చైనాలో బాంబు పేలుడు:ఇద్దరి మృతి
బీజింగ్: చైనాలోని హుక్సీ పార్కు లో సోమవారం రాత్రి ఓ వ్యక్తి బాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తితో పాటు మరొకరు మృతిచెందారు. మరో 24 మందికి పైగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండమే కాకుండా, నిరుద్యోగి అని పేర్కొన్నారు. అతని పేరు ఇయీ ఇంగ్తాంగ్ అని, వయసు 33 సంవత్సరాలు ఉంటుందని పోలీస్ అధికారి ఇన్ హువా తెలిపారు. ఏదైనా నిషేధిత ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడిందా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ దాడి నేనే చేశా..క్షమించండి!
బోస్టాన్: గత రెండు సంవత్సరాల క్రితం మతపరమైన విద్వేషంతో అమెరికాలోని రోస్ ప్రాంతంలో బాంబు దాడికి పాల్పడి అనేకమంది జీవితాల్లో చీకటి నింపిన ఘటనకు సంబంధించి నిందితుడిగా ఉన్న జోఖార్ సార్నావ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. సుమారు రెండు సంవత్సరాల పాటు నిశ్శబ్ధ యుద్ధం దాల్చిన సార్నావ్ ... వణికిన పెదాలతో ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకున్నాడు. అది తాను చేసిన పెద్ద తప్పిదంగా కోర్టు ఎదుట తన మనసులో భారాన్ని వెళ్లగక్కాడు. విచారణ నిమిత్తం బుధవారం కోర్టుకు హాజరైన జోఖార్ ఆ విధ్వంసానికి తానే కారకుడనని ఆవేదన వ్యక్తం చేశాడు. 'నన్ను క్షమించండి. మతపరమైన విద్వేషంతో బాంబు దాడికి పాల్పడ్డా. కొంతమంది జీవితాల్లో పూడ్చలేని లోటుకు నేనే కారణం'అంటూ తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో అతనికి మరణశిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. పాపపు కర్మలు చేసే మనుషులు మంచిని సమాధి చేశారనడానికి ఇదొక నిదర్శమని ఈ సందర్భంగా జడ్జి పేర్కొన్నారు. 2013 ఏప్రిల్ 15వ తేదీన జోఖార్ సార్నావ్ తన సోదరుడు తమేర్లాన్ తో కలిసి రెండు ప్రెషర్ కుక్కర్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, 17 మందికి తమ అవయవాలను కోల్పోయారు. ఆ సమయంలో పోలీసుల జరిపిన ఎదురు దాడుల్లో తమేర్లాన్ మరణించగా సార్నావ్ ప్రాణాలతో చిక్కాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ న్యాయాధికారి ఇటీవలే అసువులు బాశాడు. -
క్వారిలో బాంబు పేలి డ్రిల్లర్ మృతి
నెల్లికుదురు(వరంగల్ జిల్లా): పొట్ట కూటికోసం కుటుంబంతో వచ్చిన ఒక కూలీ క్వారీలో బాంబుపేలి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామ శివారు వీఎస్వీ గ్రానెట్ క్వారిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు..నల్లగొండ జిల్లా మోతె మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బొంత రవి(28) కుటుంబ పోషణ నిమిత్తం మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామ శివారులోని వీఎస్వీ గ్రానెట్ క్వారిలో తన కాంప్రెషర్ ట్రాక్టర్‌తో ఇదే గ్రామ శివారు బడితండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్‌తో కలిసి పనిచేస్తున్నాడు. రోజులాగే గ్రానెట్ క్వారిలో బండరాయికి కాంప్రెషర్‌తో హోల్ వేస్తుండగా అంతకు ముందే బండలో కూరుకుపోయిన ఉన్న బాంబు ఒక్కసారిగా పేలింది. జాకి నడిపిస్తున్న బొంత రవి అక్కడికక్కడే మృతి చెందగా, గుగులోతు లక్ష్మణ్‌కు తీవ్రగాయాలయ్యూరుు. అతడిని చికిత్సనిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రేణుక, కొడుకులు గోపి, తిరుపతిరావు, కూతురు అంజలి ఉన్నారు. సంఘటన స్థలానికి తొర్రూర్ సీఐ శ్రీధర్‌రావు, ఎస్సై బందం ఉపేందర్‌రావు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.