చైనాలో బాంబు పేలుడు:ఇద్దరి మృతి | two killed in china bomb blasting | Sakshi
Sakshi News home page

చైనాలో బాంబు పేలుడు:ఇద్దరి మృతి

Published Tue, Jul 21 2015 10:06 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

చైనాలోని హుక్సీ పార్కు లో సోమవారం రాత్రి ఓ వ్యక్తి బాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

బీజింగ్: చైనాలోని  హుక్సీ పార్కు  లో సోమవారం రాత్రి  ఓ వ్యక్తి బాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో  దాడి చేసిన వ్యక్తితో పాటు మరొకరు మృతిచెందారు.  మరో 24 మందికి పైగా  గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

 

వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండమే కాకుండా,  నిరుద్యోగి అని పేర్కొన్నారు.  అతని పేరు ఇయీ ఇంగ్తాంగ్ అని, వయసు 33 సంవత్సరాలు ఉంటుందని పోలీస్ అధికారి ఇన్ హువా తెలిపారు. ఏదైనా నిషేధిత ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడిందా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement