బ్యాంకాక్ పేలుళ్లు: ఇద్దరు భారతీయుల అరెస్టు | Two Indians taken into custody in Thai bombing case From Jaishree Balasubramanian Bangkok | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్ పేలుళ్లు: ఇద్దరు భారతీయుల అరెస్టు

Published Mon, Sep 7 2015 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

బ్యాంకాక్ పేలుళ్లు: ఇద్దరు భారతీయుల అరెస్టు

బ్యాంకాక్ పేలుళ్లు: ఇద్దరు భారతీయుల అరెస్టు

బ్యాంకాక్: గత నెలలో  థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో సంభవించిన భారీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఇద్దరు భారతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆగస్టు 17 వ తేదీన సెంట్రల్ బ్యాంకాక్లోని కమర్షియల్ హబ్లో బ్రహ్మదేవుని ఆలయానికి సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడులో 20 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా ఇద్దరి భారతీయులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఇద్దరు బాంబు దాడికి పాల్పడిన వ్యక్తితో పలుమార్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. వారిని  థాయ్ లాండ్ మిలటరీ క్యాంపునకు తరలించి ప్రశ్నిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. విదేశీయులు అధికంగా ఉండే మిన్ బూరీ జిల్లాలో ఆదివారం థాయ్ లాండ్ ఆర్మీ- పోలీస్ బలగాలు సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. వీరిలో కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే చైనీయులు సహా పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement