కొలంబో : అమెరికాకు చెందిన ఓ టెకీ శ్రీలంక బాంబు పేలుళ్లలో చనిపోవడానికి ముందు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన చివరి మెసేజ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డైటర్ కోవల్స్కి(40) అనే వ్యక్తి బ్రిటన్‌కు చెందిన విద్యా, ప్రచురణ సంస్థ పియర్సన్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం ఆఫీస్ పని నిమిత్తం శ్రీలంక బయలుదేరాడు. ప్రయాణం ప్రారంభం కావడానికి ముందు డైటర్ తన ఫేస్‌బుక్‌లో ‘ఫన్ మొదలైంది. వర్క్ ట్రిప్స్‌ని నేను చాలా ఇష్ట పడతాను. 24 గంటల ప్రయాణం. శ్రీలంక.. త్వరలోనే నిన్ను చూస్తాను’ అంటూ పోస్ట్ చేశాడు. శ్రీలంకలో దిగిన తరువాత కంపెనీ తన కోసం రూమ్ బుక్ చేసిన హోటల్‌కు చేరుకున్నాడు. ఫోన్ చేసి ఈ విషయాన్ని సీఈవోకు తెలియజేశాడు.
ఓ వారం రోజుల్లో పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతానని తెలిపాడు డైటర్. కానీ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో అతను మృతి చెందాడు. ఈ విషయం గురించి ఆ కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. ‘డైటర్ ఎప్పుడూ తాను నవ్వుతూ ఉండటమే కాక.. తన చుట్టూ ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచుతాడు. అతని మంచితనం వల్ల ఎక్కడి వెళ్తే అక్కడ కొత్త స్నేహితులను తయారవుతుంటారు. ఎలాంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరిస్తాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి డైటర్ కొలంబో వెళ్లాడు. అక్కడ ఓ వారం రోజుల పాటు ఉండి.. తన స్థానిక స్నేహితులతో కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలనుకున్నాడు. కానీ దుష్టులు చేసిన దాడిలో చాలా మంది అమాయకుల్లానే డైటర్ కూడా కన్ను మూశాడు. డైటర్ లాంటి వారు కొత్తవి సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఉగ్రదాడికి పాల్పడిని వారికి కేవలం నాశనం చేయడం మాత్రమే తెలుసు’ అంటూ సదరు సీఈవో విషాదం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment