కొలొంబో అంటే కోహ్లికి పిచ్చెక్కిపోద్ది..! | IND vs SL: Virat Kohli Scored Four Hundreds In His Last Five Innings At Colombo | Sakshi
Sakshi News home page

కొలొంబో అంటే కోహ్లికి పిచ్చెక్కిపోద్ది..!

Published Fri, Jul 19 2024 4:37 PM | Last Updated on Fri, Jul 19 2024 5:02 PM

IND vs SL: Virat Kohli Scored Four Hundreds In His Last Five Innings At Colombo

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ప్రపంచంలోని కొన్ని మైదానాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. కోహ్లికి మూడ్‌ వచ్చే మైదానాల్లో కొలొంబోలోని ప్రేమదాస మైదానం ఒకటి. ఇక్కడ టీమిండియా మ్యాచ్‌ జరిగిందంటే కోహ్లి చెలరేగిపోవడం ఖాయం. 

కోహ్లి ప్రేమదాసలో ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 107.33 సగటున 98.47 స్ట్రయిక్‌రేట్‌తో 644 పరుగులు చేశాడు. కోహ్లి కొలొంబోలో చేసిన నాలుగు సెంచరీలు (128*, 131, 110*, 122*, 3) గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసినవే కావడం విశేషం. కోహ్లికి కొలొంబో అంటే ఎంత పిచ్చో ఈ గణాంకాలు చూస్తే అర్దమవుతుంది.

కాగా, కోహ్లి టీమిండియా తరఫున తన తదుపరి మూడు మ్యాచ్‌లు కొలొంబోని ప్రేమదాస మైదానంలోనే ఆడనున్నాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా ఇక్కడే మూడు వన్డేలు జరుగనున్నాయి. లంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను నిన్ననే ప్రకటించారు. వన్డేల్లో రోహిత్‌.. టీ20ల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాకు సారథ్యం వహించనున్నారు.

శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగుతాయి. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్‌ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్‌ కొలొంబోలో జరుగనుంది.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్‌ పంత్, రింకూ సింగ్‌, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, ఖలీల్ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్, వాషింగ్టన్‌ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌, రియాన్ పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్ అహ్మద్‌, హర్షిత్ రాణా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement