Power Outage: అంధకారంలో శ్రీలంక | Sri Lanka Country Faces Nationwide Power Cut Due to System Failure | Sakshi
Sakshi News home page

Power Outage: అంధకారంలో శ్రీలంక

Published Sat, Dec 9 2023 9:06 PM | Last Updated on Sat, Dec 9 2023 9:07 PM

Sri Lanka Country Faces Nationwide Power Cut Due to System Failure - Sakshi

కొలంబో: శ్రీలంకలో ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. దేశంలో మొత్తం విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యలతో పవర్ కట్ జరిగినట్లు ఆ దేశ విద్యుత్‌ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEB) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే దేశంలో కరెంట్ అంతరాయం కలగటంతో పలు ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. 

దేశంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని సీఈబీ సంస్థ ప్రతినిధి నోయెల్ ప్రియాంత తెలిపారు. ఇక మరో వైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement