వాళ్లకి తెలీదు మృత్యువు పక్కనే పొంచి ఉందని. వాళ్లకి తెలీదు రక్త పిశాచాలు మరో క్షణంలో దారుణమైన ఘాతుకానికి ఒడిగడతారని. తమిళవేర్పాటు ఉద్యమం సద్దుమణిగాక శాంతి పవనాలు వీస్తున్న శ్రీలంకలో ఉగ్రమూకలు పంజా విసురుతాయని ఎవరు ఊహించగలరు?. బ్రిటన్ నుంచి శ్రీలంక చూడడానికి టూరిస్టులుగా వచ్చిన ఒక కుటుంబం కొలంబోలో ఒక హోటల్‌లో దిగింది. ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ని ఎంజాయ్ చేయడానికి డైనింగ్ రూమ్‌కి కుటుంబ సభ్యులు వచ్చారు. తినడానికి ముందు నవ్వుతూ తుళ్లుతూ జోకులు వేసుకుంటూ సెల్ఫీ దిగారు. వారిలో ఒకమ్మాయి వెంటనే తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆ సెల్ఫీ షేర్ చేసింది.
ఆ ఫొటో షేరయిన క్షణంలోనే హోటల్‌లో బాంబుల మోత మోగింది. ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వులు ఆగిపోయాయి. అక్కడిక్కడే మృత్యుఒడికి చేరుకుంది. కుటుంబంలో మిగిలిన సభ్యులందరూ కూడా బాంబు దాడిలో చనిపోయారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చర్చిలు, హోటల్స్ టార్గెట్‌గా శ్రీలంక మారణహోమంతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ బ్రిటిష్ టూరిస్టు ఫ్యామిలీ ఆఖరి సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరికి సెల్ఫీయే మిగిలిందా అంటూ నెటిజన్లు బాధగా నిట్టూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment