అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం | Acemoglu, Johnson and Robinson Won 2024 Nobel Prize For Economics | Sakshi
Sakshi News home page

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

Published Mon, Oct 14 2024 3:50 PM | Last Updated on Mon, Oct 14 2024 4:45 PM

Acemoglu, Johnson and Robinson Won 2024 Nobel Prize For Economics

డారన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ. రాబిన్సన్‌లకు 2024 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వీరు ''సంస్థలు ఏవిధంగా ఏర్పాటవుతాయి, అవి ప్రజా శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి'' అనే అంశం మీద చేసిన పరిశోధనలకు ఈ బహుమతి లభించింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ ప్రైజ్.. ఆల్ప్రైడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అందిస్తారు. ఈ బహుమతులను ప్రతి ఏటా డిసెంబర్ 10న గ్రహీతలకు అందిస్తారు. ఇప్పటికే భౌతిక, రసాయన, సాహిత్య, వైద్య రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఇప్పుడు తాజాగా అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం ముగ్గురుకి నోబెల్ ప్రైజ్ అందిస్తున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement