సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన రిచర్డ్ థాలెర్(72) కు నోబెల్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై సమగ్ర అధ్యయనం చేసిన ఆయన ఈ గౌరవం దక్కింది. దీంతో ట్విట్టర్‌లో థాలెర్‌కు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై గతంలో ఆయన చేసిన ఓ రెండు ట్వీట్లు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
గతేడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే క్యాష్‌లెస్ ఉద్దేశ్యాన్ని ప్రధానంగా తీసుకున్న థాలెర్ తన ట్విట్టర్‌లో సందేశం ఉంచారు. ‘దీనికి(నోట్ల రద్దుకు) నేను ఎప్పటి నుంచో మద్ధతు తెలుపుతున్నాను. నగదురహిత విధానానికి, అవినీతి నిర్మూలనకు ఇది ముందడుగు’ అంటూ అభినందనలు తెలియజేశాడు.
అయితే కాసేపటికే ఓ వ్యక్తి కొత్తగా 2000 నోటు కూడా ప్రవేశ పెట్టబోతున్నారంటూ మరో ట్వీట్ చేశాడు. దీంతో అయ్యో.. నిజమా? అంటూ రిచర్డ్ థాలెర్ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ రెండు తెగ వైరల్ అవుతున్నాయి. డీమానిటైజేషన్ సమయంలో నోరు మెదపని మేధావులు, బీజేపీ నేతలు ఈ మధ్య వరుసగా మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తోపాటు యశ్వంత్ సిన్హా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment