ప్రపంచ సైనిక బడ్జెట్‌ 2 ట్రిలియన్‌ డాలర్లు | World military expenditure passes 2 trillion dollers for first time | Sakshi
Sakshi News home page

ప్రపంచ సైనిక బడ్జెట్‌ 2 ట్రిలియన్‌ డాలర్లు

Published Tue, Apr 26 2022 6:07 AM | Last Updated on Tue, Apr 26 2022 6:07 AM

World military expenditure passes 2 trillion dollers for first time - Sakshi

లండన్‌: ప్రపంచదేశాలు సైనికపరంగా చేస్తున్న వ్యయం మొట్టమొదటిసారిగా ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్లను మించిపోయింది. స్వీడన్‌కు చెందిన సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) ఈ మేరకు వెల్లడించింది. ఈ ఖర్చులో అమెరికా, చైనా, భారత్‌ టాప్‌ త్రీ స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ‘‘2021లో ప్రపంచ సైనిక వ్యయం 0.7% పెరిగి 2,113 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇందులో 62% వాటా అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యాలదే. అమెరికా, చైనా వాటాయే ఏకంగా 52%! 2021లో అమెరికా 801 బిలియన్‌ డాలర్లు, చైనా 293 బిలియన్‌ డాలర్లు, భారత్‌ 76.6 బిలియన్‌ డాలర్లు రక్షణపై వెచ్చించాయి. ఆసియా–ఓసియానియా ప్రాంత దేశాల సైనిక వ్యయం 586 బిలియన్‌ డాలర్లు. ఇందులో భారత్‌–చైనాల వాటాయే ఏకంగా 63%! అయితే ఇది 2020 కంటే 1.4% తక్కువ’’ అని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement