
స్టాక్‌హోమ్ : స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం ఎడమ రెక్క ఆర్లాండా విమానాశ్రయంలోని టర్మినల్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. విమానం రెక్క టర్మినల్ గోడను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుదుపుకు గురైందని, ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment