శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా(ఏఐ-559) విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఉదయం 6.40 వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం తమకేం బాద్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.