
మూడు కిలోల బంగారం స్వాధీనం
కస్టమ్స్ అధికారులకు పట్టుబడిపోతానన్న భయంతో ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని విమానంలోనే వదిలేశాడు
శంషాబాద్: ఓ విమానంలోని సీటు కింద 3 కేజీల 148 గ్రాముల బంగారాన్సి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బంగారం అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం తెలుసుకున్న అధికారులు విమానంలో సోదాలు జరపగా ఓ సీటు కింద దాచిన మూడు కేజీల బంగారు బిస్కెట్లు కలిగిన లగేజీ కనుగొన్నారు.