Over 6 Kg Gold Seized At Hyderabad Airport - Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ లాంతరులో ఆరు కిలోల బంగారం 

Published Wed, Oct 20 2021 5:31 AM | Last Updated on Wed, Oct 20 2021 10:18 AM

6 KG Gold Was Seized By Customs Officials In Hyderabad Airport - Sakshi

శంషాబాద్‌: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఈకే 524 విమానంలో మంగళవారం ఉదయం శంషాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం కలిగింది. అతని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిం చగా ఎమర్జెన్సీ లాంతరు వెనుక భాగంలో బ్యాటరీల సైజులో నలుపు రంగు కవర్‌లో అమర్చిన బంగారు కడ్డీలు బయటపడ్డాయి.

6.06 కిలోల బరువున్న ఈ బంగారం విలువ 2.96 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ప్రయాణికుడిని కొరియర్‌గా ఉపయోగించుకుని బంగారాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణా చేయించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement