బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.
ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టం
ఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్‌లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment