flight cancelled
-
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్‌కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్‌లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
విమాన సేవలందిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 70కి పైగా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే ఇందుకు కారణమని చెప్పింది. రద్దైన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. దాంతో ఉన్న సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పౌర విమానయాన అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్‌లీవ్’ దరఖాస్తులు అందాయి. దాంతో మంగళవారం రాత్రి నుంచి కొన్నివిమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశాం. ఈ సంఘటనకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మేము సిబ్బందితో మాట్లాడుతున్నాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఇకపై చేసే ప్రయాణాలకు సంబంధించి సదరు సర్వీసు అందుబాటులో ఉందో లేదో సరిచూసుకోవాలి కోరుతున్నాం’ అని తెలిపింది.ఇదీ చదవండి: ట్రేడింగ్ వేళల పెంపునకు నో చెప్పిన సెబీరద్దు అయిన విమానసర్వీసుల టికెట్ డబ్బులు వాపసు చేస్తామని.. లేదంటే మరోతేదీకి రీషెడ్యుల్ చేసుకునే వీలుందని కంపెనీ పేర్కొంది. More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources— ANI (@ANI) May 8, 2024 -
మాల్దీవులకు టికెట్ బుకింగ్స్ నిలిపేసిన ప్రముఖ సంస్థ
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ ఎక్స్ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈజ్‌మైట్రిప్ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఇది ఆన్లైన్ టికెట్ బుకింగ్ సేవలందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి ఈ సంస్థను 2008లో ప్రారంభించారు. In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY — Nishant Pitti (@nishantpitti) January 7, 2024 భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మంతత్రి మరియం షియునా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు మల్షా షరీఫ్, అబ్దుల్లా మజూం మాజిద్ మద్దతు పలికారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని మంత్రులు విమర్శించారు. ‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని మోదీ పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’ అని మంత్రి మాజిద్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై భారత నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండు చేశారు. -
హీరోయిన్ లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే హీరోయిన్గా సత్తా చాటిన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఈ ఏడాది ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ప్రస్తుతం ‘రాయబారి’ అనే సినిమాలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే లావణ్య తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి విమానంలో ప్రయాణించిన లావణ్యకు అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. సాంకేతిక సమస్యల కారణంగా ఆమె ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో లావణ్య ప్రయాణానికి అంతరాయం కలిగింది. దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ విమానం క్యాన్సిల్ అవుతుందన్న విషయం ముందుగా ఎందుకు తెలియజేయలేదంటూ ఫైర్ అయ్యింది. విమానంలో సీటు రిజర్వ్ చేసుకున్న అనంతరం ఫ్లైట్ క్యాన్సిల్ అని మెసేజ్ రావడం ఏంటని మండిపడింది. ఇలాంటిది గతంలో ఎవరికైనా జరిగిందా లేక తనకే ఎదురైందా అంటూ ఫ్యాన్స్‌ను కోరింది. -
విమానం రద్దు.. ఎయిర్‌లైన్స్‌కు జరిమానా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం, మానసిక వేదనకు, ఇబ్బందులకు గురి చేయటం వంటి కారణాలతో... ఎమిరేట్స్ విమానాయాన సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కారాల ఫోరం రూ.2 లక్షల జరిమానా విధించింది. రద్దు చేసిన విమాన టికెట్ చార్జీలు, వడ్డీతో సహా తిరిగి కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన వినయ్ కుమార్ సిన్హా (57), కృష్ణ సిన్హా (55) దంపతులు టికెట్లు బుక్ చేసి... 2017 జులై 12న డెట్రాయిట్‌లోని బంధు వులను కలిసేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. బోస్టన్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లినా... బోస్టన్ నుంచి డెట్రాయిట్కు వెళ్లాల్సిన విమానం ఆకస్మికంగా రద్దయింది. నిర్ధారిత సమయంలో డెట్రాయిట్కు చేరుకోవటంలో విఫలమైనందుకు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేసినందుకు వీరిద్దరూ కన్జ్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించారు. దీంతో తాజా తీర్పు వెలువడింది. -
గోఎయిర్ ప్రయాణీకులకు తప్పని కష్టాలు..
సాక్షి, న్యూఢిల్లీ : గోఎయిర్ ప్రయాణీకులకు మంగళవారం వరుసగా రెండో రోజూ కష్టాలు తప్పలేదు. సిబ్బంది కొరత, విమానాలు అందుబాటులో లేకపోవడంతో రెండో రోజూ గోఎయిర్ 19 విమానాలను రద్దు చేసింది. విమానాల రద్దుతో పలు గమ్యస్ధానాలకు చేరాల్సిన ప్రయాణీకులు వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు. సోమవారం ఇవే కారణాలు చూపుతూ గోఎయిర్ ఏకంగా 21 విమానాలను రద్దు చేయడంతో ఆఖరినిమిషంలో ప్రయాణ షెడ్యూల్ తారుమారు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతికూల వాతావరణం, వివిధ నగరాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను సంస్థ కారణాలుగా చూపింది. కాక్‌పిట్ సిబ్బంది సమస్యలూ ప్రభావం చూపాయని పేర్కొంది. గోఎయిర్ ప్రతిరోజూ పలు దేశీ, విదేశీ గమ్యస్ధానాలకు రోజూ 200 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. విమానాలు, పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గోఎయిర్ ఇప్పటివరకూ 19 విమానాలు రద్దు చేసిందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, పట్నా, లక్నో సహా పలు గమ్యస్ధానాల నుంచి బయలుదేరాల్సిన విమానాలు రద్దయిన వాటిలో ఉన్నాయని తెలిసింది. -
చివరి నిమిషంలో 18 విమానాలు రద్దు..
సాక్షి, న్యూఢిల్లీ : విమానాలు అందుబాటులో లేకపోవడం, కాక్‌పిట్ సిబ్బంది కొరతతో 18 దేశీయ విమానాలను గోఎయిర్ రద్దు చేసింది. గోఎయిర్‌కు చెందిన ఏ320 నియో విమానాల్లో ఇంజన్ సమస్యలతో ఆ విమానాలు కొన్ని అందుబాటులో లేవని ఎయిర్‌లైన్ వర్గాలు తెలిపాయి. ఈ సమస్యలతో పాటు కాక్‌పిట్ సిబ్బంది కొరతతో ముంబై, గోవా, బెంగళూర్, ఢిల్లీ, శ్రీనగర్, జమ్ము, పట్నా, ఇండోర్, కోల్‌కతా నుంచి బయలుదేరాల్సిన 18 విమానాలను సోమవారం గోఎయిర్ రద్దు చేసింది. కాగా పౌరసత్వ సవరణ చట్టంపై సాగుతున్న ఆందోళనలతో పాటు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఏర్పడిన సమస్యల నేపథ్యంలో తమ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని గోఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతికూల వాతావరణం, లో విజిబిలిటీ వంటి సమస్యలతో పాటు పౌర చట్టంపై దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు, విమాన సిబ్బంది హాజరులో పరిమితుల కారణంగా గోయిర్ నెట్‌వర్క్‌లోని పలు విమానాల సేవల్లో విఘాతం కలుగుతోందని సంస్థ ప్రతినిధి ప్రకటనలో వెల్లడించారు. చివరినిమిషంలో గోఎయిర్ విమానాలను రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
చెన్నై : చెన్నై నుంచి హైదరాబాద్‌కు శనివారం ఉదయం బయలుదేరవలసిన ఎయిర్ కోస్టా విమాన సర్వీసు రద్దు అయింది. సదురు విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులు ఈ రోజు తెల్లవారుజామునే చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. విమాన సర్వీసు రద్దు విషయం తెలియని ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లో పడిగాపులు పడతున్నారు. విమానం ఎందుకు రద్దు అయిందని ఎయిర్ పోర్ట్ అధికారులను ప్రయాణికులు ప్రశ్నించారు. ఎయిర్ కోస్టా అధికారుల నుంచి మాత్రం ఎటువంటి సమాధానాలు రాలేదు. దీంతో ఎయిర్ కోస్టా యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్ పోర్ట్ లో ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇదే పరిస్థితి హైదరాబాద్ : బెంగళూరు నగరానికి ఎయిర్ ఇండియా విమానం శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిలిచిపోయింది. ఆ విమానంలో బెంగళూరు వెళ్లేందుకు అప్పటికే ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. బెంగళూరు వెళ్లవలసిన విమాన సర్వీస్ లేదని తెలుసుకున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా వ్యవహరించడం దారుణమని ఎయిర్ ఇండియా అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. -
చిన్న ఎలుక.. విమానాన్నే ఆపేసింది!
ఒక చిన్న ఎలుక.. విమానం మొత్తాన్ని ఆపేసింది. బర్మింగ్‌హామ్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఈ విమానాన్ని ఒక రోజు మొత్తం రద్దుచేసి పారేశారు. విమానంలో ఎలుక దూరిన విషయం తెలిసినా, దాన్ని పట్టుకోడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో ప్రయాణికులందరినీ దింపేసి, వాళ్లకు రాత్రి అక్కడే ఓ హోటల్లో బస ఏర్పాటుచేసి విమానం రద్దుచేశారు. కేబిన్ సిబ్బంది ఎలుకను పట్టుకోడానికి చాలా ప్రయత్నించారు గానీ, వాళ్ల వల్ల కాలేదని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది. విమానంలో ఎలుక ఉన్న విషయం తెలిసి, అది తమ కాళ్ల వద్దకు ఎక్కడ వస్తుందోనని ప్రయాణికులంతా చాలాసేపు భయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కానీ ఇది అసలైన వీడియో కాదని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అంటోంది.